Latest Updates
-
ఎప్పుడూ అలసిపోతున్నారా? అయితే మీ శరీరంలో ఈ విటమిన్ తగ్గినట్లే..డాక్టర్ చెప్పిన సంచలన నిజం! -
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక! -
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
కురుక్షేత్ర యుద్ధం: మహాభారతంలోని కీలక ఘట్టాలు, అర్జునుడు, కర్ణుడి కథలు వెల్లడి -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే..
ఉగాది స్పెషల్ తమిళనాడు ఫేమస్ వెప్పం పూ రసం..హెల్త్ కి హెల్త్.. టేస్ట్ కి టేస్ట్!
తెలుగువారి లోగిళ్లలో ఉగాది పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు.. ఇలా జీవితంలోని కష్టసుఖాలకు, భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచే ఈ షడ్రుచుల సమ్మేళనం కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, మన సంప్రదాయంలో భాగం. ఈ పచ్చడి ఆరోగ్యానికి ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది.
అయితే ఈసారి ఉగాది పండుగకు కాస్త వైవిధ్యంగా, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు స్టైల్ లో వెప్పం పూ రసం ట్రై చేయండి. తమిళనాడులో ఉగాదిని పుదు వరుష పిరప్పు(తమిళ నూతన సంవత్సరం) పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున తమిళులు మన ఉగాది పచ్చడి తరహాలోనే సాంప్రదాయబద్ధంగా వెప్పం పూ రసం (వేప పూల రసం) తయారు చేస్తారు. చేదు, పులుపు, తీపి కలగలిపిన ఈ రసం అమృతంలా ఉంటుంది.
వెప్పం పూ రసం తయారీకి కావాల్సిన పదార్థాలు
చింతపండు రసం - ఒక కప్పు
కందిపప్పు - ఒక కప్పు
తాజా వేప పువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - రెండు స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
పసుపు - అర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు (మంచి సువాసన కోసం)
నూనె - రెండు స్పూన్లు
ఎండుమిర్చి - 3
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - 5 లేదా 6 రెమ్మలు
ఉప్పు - రుచికి తగినంత
వెప్పం పూ రసం తయారీ విధానం
-తాజా వేప పువ్వులను శుభ్రం చేసి పెట్టుకోవాలి
-ఇప్పుడు స్టౌ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, శుభ్రం చేసుకున్న వేప పువ్వులను వేసి, సన్నని మంట మీద అవి కాస్త రంగు మారే వరకు దోరగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో మరో స్పూన్ నెయ్యి, కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఇందులోనే కందిపప్పు కూడా వేసి పచ్చివాసన పోయేలా కొద్దిసేపు వేయించుకోవాలి.
-పోపు మంచిగా వేగాక, అందులో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం పోయాలి. ఆ వెంటనే అర టీస్పూన్ పసుపు, రెండు స్పూన్ల బెల్లం తురుము వేసి గరిటతో బాగా కలపాలి.
-ఈ మిశ్రమాన్ని మీడియం మంట మీద ఉంచి, చింతపండు పచ్చివాసన పోయి, రసం బాగా మరిగే వరకు కుక్ చేయాలి. రసం ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పును జతచేయాలి.
-రసం చక్కగా మరిగి, కమ్మటి వాసన వస్తున్న సమయంలో.. ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న వేప పువ్వులను అందులో వేసి కలపాలి. ఇప్పుడు మంట తగ్గించి కేవలం రెండే రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆపేయాలి. చివరగా కొత్తిమీరను చల్లుకుంటే చాలు వెప్పం పూ రసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












