Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం!
మధుమేహం (డయాబెటిస్)... ఆధునిక ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న మహమ్మారి. దీనిని షుగర్ వ్యాధి అని కూడా అంటారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో షుగర్ పేషెంట్లు ఉన్నారు. అందుకే మన దేశాన్ని వరల్డ్ డయాబెటిస్ రాజధాని అని కూడా అంటుంటారు.
జీవితాంతం మందులు వాడుతూ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడమే తప్ప దీనికి పూర్తి పరిష్కారం లేదని వైద్యశాస్త్రం చెబుతోంది. అయితే కేవలం ఒక పురాతన ఆలయాన్ని దర్శిస్తే చాలు.. షుగర్ వ్యాధి పూర్తిగా నయమవుతుందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఒక అద్భుత శివాలయం భక్తులకు కల్పిస్తున్న నమ్మకం ఇది. ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆ శివాలయం విశేషాలేంటో ఇక్కడ చూడండి.

కర్మఫలం - దైవానుగ్రహం
మన పురాణాల ప్రకారం అనారోగ్యం అనేది పూర్వజన్మ కర్మల ఫలితంగా వస్తుందని, భగవంతుని అనుగ్రహంతో దాన్ని జయించవచ్చని ప్రగాఢ విశ్వాసం. ఈ విశ్వాసానికి సజీవ సాక్ష్యమే తమిళనాడు రాష్ట్రంలోని తిరువెన్నియూర్ (కోయిల్ వెన్ని)లో కొలువై ఉన్న శ్రీ వెన్ని కరుంబేశ్వరర్ స్వామి. స్వయంభువుగా వెలసిన ఈ పరమశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే మధుమేహం మటుమాయం అవుతుందని భక్తుల అపార నమ్మకం.
ఎంత పురాతనమైనది?
భారతదేశంలోని అత్యంత విశిష్టమైన శివాలయాలలో ఇదీ ఒకటి. ఇక్కడి శివలింగం అచ్చం చెరకు గడల కట్టలాగా కనిపిస్తుంది. చరిత్ర ప్రకారం ఈ ఆలయం 1,300 ఏళ్ల నాటిది కాగా, పురాణాల ప్రకారం ఇది దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే (నాలుగు యుగాల నుండి) ఉనికిలో ఉందని చెబుతారు.
ఆలయ పుట్టుక వెనుక ఆసక్తికర కథ
పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన చెరకు తోటలతో నిండి ఉండేదట. ఒకరోజు ఇద్దరు రుషులు ఈ మార్గం గుండా వెళుతూ, అక్కడే ఉన్న శివలింగాన్ని దర్శించి పూజించారు. అయితే ఆ ఆలయ పవిత్ర వృక్షం (స్థల వృక్షం) చెరకు అని ఒకరు, కాదు వెన్ని (నంద్యావట్టం) అని మరొకరు వాదించుకున్నారు.
అప్పుడు పరమశివుడు అశరీరవాణిగా వినిపించి.. నా పేరు చెరకు (కరుంబు)తో ముడిపడి ఉంటుందని, ఆలయ పవిత్ర వృక్షంగా వెన్ని ఉంటుందని ఆశీర్వదించాడు. అప్పటినుండి స్వామివారిని వెన్ని కరుంబేశ్వరర్ అని పిలుస్తున్నారు. శివలింగానికి అభిషేకం చేసే సమయంలో అది అచ్చం చెరకు ముద్దలాగా కనిపించడం విశేషం.
ఈ శివలింగం కుడివైపు పైభాగంలో ఒక చిన్న గాయం ఉన్నట్లు కనిపిస్తుంది. ముసుకుంద చక్రవర్తి ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించడానికి చెరకు తోటను నరికిస్తుండగా, పొరపాటున కత్తి శివలింగానికి తగిలి రక్తం కారిందట. తన తప్పు తెలుసుకున్న చక్రవర్తి, భక్తితో స్వామికి చతురస్రాకారంలో పీఠం నిర్మించి, అద్భుతమైన గర్భగుడిని ఏర్పాటు చేశాడు.
మధుమేహానికి దివ్యౌషధం - ఆలయ విశిష్టత
ఈ ఆలయ స్థల వృక్షమైన నంద్యావట్టం పువ్వులతో స్వామికి పూజ చేయడం అత్యంత శ్రేష్ఠం. ప్రసిద్ధ సిద్ధులైన పాంబాట్టి సిద్ధర్, కాకభుజండర్ సిద్ధర్ తమ రచనలలో ఈ ఆలయంలో మధుమేహం నయమయ్యే విధానాన్ని వివరించారు.
పూర్వం, రసమణికి బెల్లం కలిపి స్వామివారికి సమర్పిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని సిద్ధులు చెప్పారు. కానీ నేటి కాలంలో రసమణి లభించడం కష్టం కాబట్టి, భక్తులు ఒక వినూత్న పద్ధతిని పాటిస్తున్నారు.

గోధుమ రవ్వ, పంచదార కలిపి ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారంలో చల్లుతారు. దీన్ని అక్కడి చీమలు ఆహారంగా తీసుకుంటాయి. ఇలా చీమలు తమ సమర్పణను స్వీకరిస్తే సాక్షాత్తూ పరమశివుడే దానిని స్వీకరించి మధుమేహం నుండి విముక్తి కల్పిస్తాడని భక్తుల నమ్మకం.
అలాగే ఇక్కడ బియ్యం, బెల్లం దానం చేయడం వల్ల కూడా వ్యాధి నయమవుతుందని విశ్వసిస్తారు. ఇక్కడికి వచ్చిన ఎంతోమంది భక్తులు తమ షుగర్ వ్యాధి అదుపులోకి వచ్చిందని సంతోషంగా చెబుతుంటారు.
ఎలా వెళ్లాలి?
శ్రీ వెన్ని కరుంబేశ్వరర్ ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. తంజావూరు నుండి నీడమంగళం వెళ్లే దారిలో సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోయిల్ వెన్ని అనే చిన్న గ్రామంలో ఈ క్షేత్రం కొలువై ఉంది.
Disclaimer: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలతో ఆధారపడి ఉంది. దీనిని ఎంత వరకు విశ్వసించాలనేది వ్యక్తిగత విషయం. బోల్డ్ స్కై తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.



Click it and Unblock the Notifications