Latest Updates
-
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.!
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్
ఉలవల కారం పొడి ఎప్పుడైనా రుచి చూశారా? లేకుంటే మాత్రం వెంటనే ట్రై చేయండి. వేడి అన్నంతో కలుపుకుని తిన్నా లేదా ఇడ్లీ,దొశ వంటి టిఫిన్స్ తో కూడా ఉలవల కారం పొడి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది మన శరీరానికి చాలా చాలా మేలు చేసేదే. ఈ కారం పొడిలో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా నెయ్యి ఇడ్లీలకు ఈ పొడి అద్భుతంగా ఉంటుంది. దోశల మీద చల్లుకోడానికి కూడా ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఉలవల కారం పొడిని తయారుచేయడం కూడా చాలా చాలా ఈజీ. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పైనే నిల్వ ఉంటుంది. అన్నం తింటున్నప్పుడు మొదటి రెండు ముద్దల ఉలవల కారం వేసి అందులో కొంచెం నెయ్యి వేసి తింటే అద్భుతం అంటూ ఆస్వాదిస్తూ భోజనం తినేస్తారు.

ఉలవల కారం పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఉలవలు
-ఎండుమిర్చి
-పొట్టు మినుములు
-జీలకర్ర
-ధనియాలు
-పచ్చి శెనగపప్పు
-చింతపండు
-రాళ్ల ఉప్పు
-వెల్లుల్లి
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్
ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా
చేసేయండి.!
ఉలవల కారం పొడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోండి.ఆ పాన్ లో 1/3 కప్పు ఉలవలు వేసి సన్నని సెగ మీద అవి చిట్లేదాకా కలుపుతూ వేపుకోవాలి. ఉలవలు లోపలిదాకా వేగితేనే రంగు మారి, తర్వాత చిట్లుతుంది.
-ఉలవలు మంచిగా వేగి చిట్లిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లో 3 టేబుల్ స్పూన్ల పొట్టు మినుములు(నల్లవి), 3 టేబుల్ స్పూన్ల పచ్చి శెనగపప్పు వేసి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేవరకు కలుపుతూ వేపుకోండి.
-మినుములు, పచ్చి శెనగపప్పు మంచి సువాసన వస్తున్నప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేపండి. మంచి వాసన వస్తూ, పప్పు ఎర్రబడుతున్నప్పుడు వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 18 ఎండు మిరపకాయలు వేసి, పిడికెడు పొట్లుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు వేసి తక్కువ మంట మీద మిర్చిని కలుపుతూ పొంగనివ్వాలి.మిర్చి వాడితే చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మాడకుండా వేయించుకోవాలి.
-మిర్చి కాస్త పొంగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్ లోకి తీపుకొని చల్లారనివ్వాలి.
-వేయించినవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో అవన్నీ వేయండి, అందులోనే ఉసిరికాయంత చింతపండు, కావాలనుకుంటే కొంచెం బెల్లం, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు వేసి మొత్తాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడి వెచ్చగా ఉంటుంది. కాబట్టి దీనిని కాసేపు గాలికి ఆరనిచ్చి తర్వాత డబ్బాలో పెట్టుకుంటే నెలరోజులు పైనే నిల్వ ఉంటుంది.నెయ్యి ఇడ్లీలకు ఈ పొడి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
