Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
వంటరాని బ్యాచిలర్స్ కూడా ఇట్టే చేసేయగల గ్రీన్ చికెన్ 65..ప్లేట్ కూడా నాకేయాల్సిందే!
ఎప్పుడూ ఒకేలాంటి ఎర్రటి చికెన్ 65 తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యానికి మేలు చేసే పాలకూరను జోడించి అద్భుతమైన పాలక్ గ్రీన్ చికెన్ 65 ని ట్రై చేయండి. ఇది చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, తినడానికి అంతకంటే అద్భుతంగా ఉంటుంది.
వంట రాని బ్యాచిలర్స్ సైతం చాలా సులభంగా తయారు చేయగల ఈ గ్రీన్ చికెన్ 65 కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇక్కడ చూడండి.

గ్రీన్ చికెన్ 65 తయారీకి కావలసిన పదార్థాలు
పాలకూర - 1 కట్ట
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 5
కొత్తిమీర - ఒక గుప్పెడు
పుదీనా - ఒక గుప్పెడు
పచ్చిమిర్చి - 2
చిక్కటి పెరుగు - 1 కప్పు
చికెన్- 1 కిలో
ఉప్పు - రుచికి సరిపడా
మిరియాల పొడి - ముప్పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కారం - 1 టీస్పూన్
మొక్కజొన్న పిండి - 2 టేబుల్ స్పూన్లు
వంట నూనె - వేయించడానికి సరిపడా
కరివేపాకు - రెండు రెమ్మలు
గ్రీన్ చికెన్ 65 తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి స్టవ్ మీద మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న పాలకూరను వేసి సరిగ్గా 8 నిమిషాల పాటు ఉడికించి, నీరంతా వంపేసి చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ఉడికించిన పాలకూర, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చిక్కటి పెరుగు వేసి నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కారం వేసి ముక్కలకు పట్టించండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలపాలి. చివరగా కార్న్ ఫ్లోర్(మొక్క జొన్న పిండి) వేసి మొత్తం మిశ్రమం చికెన్ కి పట్టేలా మిక్స్ చేసి, మూతపెట్టి కనీసం అరగంట పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కలు జ్యూసీగా తయారవుతాయి.
-అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి, అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కాక, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను విడివిడిగా నూనెలో వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ముక్కలను దోరగా వేయించాలి. అవి వేగుతున్నప్పుడు కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది.
-చికెన్ ముక్కలు పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉడికేవరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే ఎంతో నోరూరించే, వేడివేడి పాలక్ గ్రీన్ చికెన్ 65 రెడీ. పైన కాస్త నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలతో తింటుంటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
