Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
గుడ్డు లేకుండా బేకరీ స్టైల్ ఫ్రూట్ కేక్... ఇంట్లోనే ఇంత ఈజీగా చేయొచ్చని మీకు తెలుసా?
పిల్లల నుంచి పెద్దల దాకా కేక్ అంటే ఇస్టపడని వారు ఎవరూ ఉండరు. అందులో కూడా నట్స్, పండ్లతో నిండిన ఫ్రూట్ కేక్ రుచి గురించి ఇక వేరే చెప్పక్కర్లేదు. బర్త్ డే సెలబ్రేషన్స్ అయినా, ఫెస్టివల్స్ టైంలో అయినా లేదా సాయంత్రం టైంలో ళ టీతో పాటు ఏదైనా స్వీట్ తినాలనిపించినా ఫ్రూట్ కేక్ బెస్ట్ ఆప్షన్. అయితే గుడ్డు తినని వారు కేక్ తినడానికి కాస్త వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే ఈ అద్భుతమైన ఎగ్ లెస్ ఫ్రూట్ కేక్ రెసిపీ. ఎంతో మృదువుగా, స్పాంజ్ లా ఉండే ఈ కేక్ ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఎగ్ లెస్ ఫ్రూట్ కేక్ తయారీకి కావాల్సినవి
మైదా పిండి - ఒకటింబావు కప్పు
వెన్న (బటర్) - అర కప్పు
బ్రౌన్ షుగర్ - ముప్పావు కప్పు
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ - 1 కప్పు
జీడిపప్పు, బాదం తరుగు - పావు కప్పు
ఆరెంజ్ జ్యూస్ - ముప్పావు కప్పు
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
బేకింగ్ పౌడర్ - అర టీస్పూన్
బేకింగ్ సోడా - పావు టీస్పూన్
ఆరెంజ్ జెస్ట్ (ఆరెంజ్ పండు పై తొక్క తురుము) - 1 టీస్పూన్
దాల్చిన చెక్క పొడి - అర టీస్పూన్
లవంగాల పొడి - పావు టీస్పూన్
జాజికాయ పొడి- అర టీస్పూన్
ఉప్పు - పావు టీస్పూన్

ఎగ్ లెస్ ఫ్రూట్ కేక్ తయారీ విధానం
-ఒక గిన్నెలో డ్రై ఫ్రూట్స్ తీసుకుని, అందులో ఆరెంజ్ జ్యూస్ పోసి కనీసం రాత్రంతా నానబెట్టాలి. ఎక్కువ రోజులు నానబెట్టాలనుకుంటే ఫ్రిజ్ లో ఉంచడం మంచిది.
-కేక్ తయారు చేసే ముందు డ్రై ఫ్రూట్స్ నుండి ఆరెంజ్ జ్యూస్ మొత్తాన్ని వడకట్టాలి. ఆ రసంలో ఒక 3 టేబుల్ స్పూన్ల జ్యూస్ ను కేక్ పిండి కోసం పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు వడకట్టిన డ్రై ఫ్రూట్స్ లో పావు కప్పు మైదా పిండి వేసి బాగా కలపాలి. అందులోనే తరిగిన నట్స్ కూడా వేసి పక్కన పెట్టుకోవాలి.
-మరొక పెద్ద గిన్నెలో మిగిలిన 1 కప్పు మైదా పిండి, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి, జాజికాయ పొడి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండిలో ఉండలు లేకుండా ఉండేందుకు ఒకసారి జల్లెడ పట్టుకోండి.
-ఇప్పుడు వేరొక గిన్నెలో వెన్నను తీసుకుని క్రీమ్ లాగా మారే వరకు బాగా బీట్ చేయాలి. అందులో బ్రౌన్ షుగర్ వేసి మరింత మృదువుగా అయ్యేంత వరకు కలపాలి. ఆ తర్వాత పెరుగు, ముందుగా పక్కన పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా గిలకొట్టాలి.
-ఇప్పుడు ముందుగా జల్లెడ పట్టి ఉంచుకున్న మైదా మిశ్రమాన్ని ఈ వెన్న మిశ్రమంలో కొద్దికొద్దిగా వేస్తూ గరిటెతో సున్నితంగా కలపాలి. చివరగా పిండి కోట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్, ఆరెంజ్ జెస్ట్ వేసి అన్నీ కలిసేలా ఫోల్డ్ చేయాలి.
-కేక్ బేక్ చేయడానికి ఉపయోగించే పాన్ తీసుకుని, అడుగున వెన్న రాసి, బటర్ పేపర్ వేయాలి. ఇప్పుడు తయారుచేసుకున్న మిశ్రమాన్ని అందులో పోయాలి.
-ముందుగానే 180°C (డిగ్రీల సెల్సియస్) వద్ద ప్రీహీట్ చేసిన ఓవెన్ లో ఈ పాన్ పెట్టి 40-45 నిమిషాల పాటు బేక్ చేయాలి. కేక్ మధ్యలో ఒక టూత్ పిక్ గుచ్చి చూడండి. అది శుభ్రంగా బయటకు వస్తే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్లు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
