Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర

కావలసిన పదార్థాలు:
తాజా నల్లని చిన్న సైజు వంకాయలు - 1/2 kg
ఉల్లిపాయలు - 1/4 kg
టమోటాలు - 1/4 kg
మిరప పొడి
ధనియాల పొడి
ఆవాలు - 1/2 tsp
ఉప్పు - 2 tsp
పసుపు - చిటికెడు
కొబ్బరి: అరచిప్ప
అల్లం - 2 కొద్దిగా
నూనె - 2 tsp
పచ్చి మిర్చి - 10 nos
నువ్వులు - 25 grm
కొత్తిమీర- తగినంత
తయరుచేయు విధానం:
ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకొవాలి. ఉల్లిపాయలు, టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని అడ్డంగా నిలువుగా గాట్లు పెట్టాలి. ఇప్పుడు నువ్వులు ఒక పాన్ లో వేయించుకోవాలి. దోరగా వేగాక వాటిని మిక్సీలొ పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు పొడి, మిరప పొడి, పసుపు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నీరుల్లి అన్ని గ్రైడ్ చేసి వుంచుకోవాలి. ఈ మసాలా ముద్దకు ఉప్పు, కొద్దిగా నూనే వేసి కట్ చేసి వుంచిన వంకాయల్లో కూర్చాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నే తీసుకుని పొయ్యి మీద పెట్టి నూనె పొయ్యాలి. నూనె కాగాక పోపు పెట్టి ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. ఆ ముక్కలు బాగా పేస్టులాగా ఉడకాలి. ఇప్పుడు ఆ గిన్నెలొ ఒక లీటరు నీరు పోసి వంకాయలు ఉడికి బాగా మగ్గనివ్వాలి, నీళ్ళు సగం అయ్యే దాకా ఉడికించాలి. ఇప్పుడు పక్కన పెట్టిన నువ్వుల పొడిని గిన్నెలో వేసి అడుగు అంటకుండా కలియతిప్పి 2 నిముషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించుకొవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలుపుకుని తినవచ్చును.



Click it and Unblock the Notifications