Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ట్యాంగీ చీజ్ మరియు గ్రిల్డ్ టమోటో సాండ్విచ్ : బ్రేక్ ఫాస్ట్ స్పెషల్
ప్రపంచ వ్యాప్తంగా అల్పాహారాల్లో బ్రెడ్ చాలా ప్రాధాన్యత కలిగిన బ్రేక్ ఫాస్ట్ రిసిపి . దీన్ని తయారు చేయడం సులభం. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో అతి సులభంగా, సింపుల్ గా ఏ వంటకం తయారైతే వాటికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అటువంటి గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో ఇదొక సుతిమెత్తని, నోట్లో పెట్టుకొంటే కరిగిపోయే బ్రెడ్ బట్టర్ పుడ్డింగ్, చాలా అద్భుతమైన రిసిపి. అంతే కాదు, ఇంట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నప్పుడు వారి పెద్దలకోసం (వయస్సు మళ్ళిన)వారికోసం అంటూ ఏదో కటి మెత్తగా తయారు చేయాల్సి ఉంటుంది. అటువంటి వారు ఇటువంటి సులభ వంటకాలను ప్రాధాన్యత ఇవ్వొచ్చు.
అంతే కాదు, ఇందులో బటర్, టమోటో వంటివి ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు జరుగుతుంది. అయితే చీజ్ ను ఎక్కువగా తినకూడదు. మీరు డైట్ ను అనుసరిస్తున్నట్లైతే చీజ్ ను నివారించండి. ట్యాంగీ చీజ్ టమోటో గ్రిల్డ్ సాండ్వించ్ తయారుచేయడం చాలా సులభం, ఇంట్లో కనుక గ్రిల్ ఉన్నట్లైతే పని మరింత సులభం అవుతుంది. మరి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ఫాస్ట్ గా తయారయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
టమోటో : 1(స్లైస్ గా కట్ చేసుకోవాలి)
చీజ్: 2స్లైస్
మిల్క్ బ్రెడ్ : 4స్లైస్
బట్టర్: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
పెప్పర్: కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ముందుగా, నాలుగు బ్రెడ్ స్లైస్ కు కొద్దిగా బట్టర్ ను అప్లై చేసి, వాటి మీద స్లస్ గా కట్ చేసిన టమోటోలను అమర్చాలి. బ్రెడ్ కు మరియు టమోటో లకు మద్య చీజ్ ఉండేవిధంగా అమర్చుకోవాలి.
2. తర్వాత, తర్వాత వాటి మీద ఉప్పు మరియు పెప్పర్ పౌడర్ ను చిలకరించాలి.
3. ఇప్పుడు, గ్రిల్లర్ తీసుకొని, గ్రిల్లర్ మీద బ్రెడ్ స్లైస్ లను అమర్చాలి. తర్వాత ఓవెన్ లో పెట్టి, తగిన టెంపరేచర్ మీద గ్రిల్ చేయాలి. లేదాబేక్ చేయాలి. అంతే చీజ్ టమోటో గ్రిల్డ్ సాండ్వించ్ రెడీ. ఎక్కువ సేపు గ్రిల్ చేయకూడుదు లేదంటే బ్రెడ్ మాడిపోతుంది.



Click it and Unblock the Notifications