Latest Updates
-
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి!
బ్రెడ్ అండ్ బట్టర్ పుడ్డింగ్-బ్రేక్ ఫాస్ట్ రిసిపి
ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో అతి సులభంగా, సింపుల్ గా ఏ వంటకం తయారైతే వాటికే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అటువంటి గ్రేట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలలో ఇదొక సుతిమెత్తని, నోట్లో పెట్టుకొంటే కరిగిపోయే బ్రెడ్ బట్టర్ పుడ్డింగ్, చాలా అద్భుతమైన రిసిపి. అంతే కాదు, ఇంట్లో పనిచేసే ఉద్యోగస్తులు ఉన్నప్పుడు వారి పెద్దలకోసం (వయస్సు మళ్ళిన)వారికోసం అంటూ ఏదో కటి మెత్తగా తయారు చేయాల్సి ఉంటుంది. అటువంటి వారు ఇటువంటి సులభ వంటకాలను ప్రాధాన్యత ఇవ్వొచ్చు.
ఈ నోరూరించే, రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇందులో పుష్కలమైనటువంటి ప్రోటీనులు మరియు అతి తక్కువ కార్బోహైడ్రేట్స్, కలిగి ఉంటుంది. అందుకే ఈ రిసిపి వృద్ధులకు చాలా బాగా నచ్చుతుంది. ఇష్టంగా కూడా తింటారు. ఇక పిల్లలంటారా, క్రీమీ వంటకాలు చూస్తే తినడానికి వారే ముందుంటారు. మరి ఈ టేస్టీ, అండ్ హెల్తీ బ్రెడ్ బటర్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బ్రెడ్: 10 slice
పాలు: 300 ml
వెన్న: 70gms(కరిగించుకోవాలి)
బ్రౌన్ షుగర్: 80gms
స్పైస్ పొడి: 2tbsp
గుడ్లు: 2 (కొట్టిన)
డ్రై ఫ్రూట్స్: 180gms(blackcurrant, orange peels and raisins)
జాజికాయ: 1tbsp(తురుము కోవాలి)
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బ్రెడ్ ముక్కలను బ్రేక్ చేసి పెట్టుకోవాలి
2. తర్వాత ఈ బ్రెడ్ ముక్కల మీద పాలు పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా కలుపుకోవాలి.
3. కలిపిన ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత హాఫ్ లీటర్ బేకింగ్ డిష్ తీసుకొని, దానికి బట్టర్ ను రాసిపెట్టాలి.
5. ఇప్పుడు కరిగించి పెట్టుకొన్న వెన్న, బ్రౌన్ షుగర్, గుడ్లు, మరియు స్పసీలను అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి.
6. తర్వాత ఈ మిశ్రమంలో ముందుగా పాలతో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న బ్రెడ్ పేస్ట్ ను, పాలతో సహా ఇందులో పోయాలి.
7. అలాగే ఇందులో డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి, బాగా మిక్స్ చేసుకోవాలి.
8. తర్వాత ఈ మొత్తం మిశ్రమానికి జాజికాయ తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
9. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బేకింగ్ వోవెన్ లో పెట్టి 35నిముషాలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకూ బేక్ చేయాలి. అంతే ఇప్పుడు మీకు నోరూరించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి బట్టర్ పుడ్డింగ్ రెడీ. ఈ నోరూరించే పుడ్డింగ్ ను చల్లచల్లగా లేదా వేడిగా కూడా తినవచ్చు.



Click it and Unblock the Notifications