Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
క్యారెట్-కొబ్బరి తురుము ఫ్రై- రోటీ స్పెషల్ సైడ్ డిష్

కావలసిన పదార్థాలు:
క్యారెట్: 3-4
కొబ్బరి తురుము: 1/2cup
జీలకర్రపొడి: 1/2tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పోపుకోసం
వేరుశెనగపప్పు: 1tbsp
ఉద్దిపప్పు: 1/4tsp
జీలకర్ర: 1/4tsp
ఆవాలు: 1/4tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఎండు మిర్చి: 4-6
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారెట్స్ కు పై పొట్టును సన్నగా తీసేసి నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి నీరంత పోయిన తర్వాత క్యారెట్స్ ను తురుముకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో వేరుశెనపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత మిగిలిన పోపు దినుసులను కూడా వేసి వేయించుకోవాలి.
3. పోపు వేగే సమయంలో ఉద్దిపప్పు బ్రౌన్ కలర్ కు మారే సమయంలో క్యారెట్ తురుమును వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
4. క్యారెట్ కొంచెం మెత్తబడే సమయంలో జీలకర్ర పొడి, కారం, ఉప్పు చల్లి కలుపుకోవాలి, చివరగా కొబ్బరి తురుము కూడా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
5. క్యారెట్ కొకొనట్ ఫ్రైని క్రిందికి దింపుకొనే ముందు కొత్తమీర తరుగును గార్నిష్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపేసుకోవాలి. అంతే క్యారెట్ కొకొనట్ ఫ్రై రెడీ. రైస్, రోటికి, చపాతికీ సూపర్బ్ కాంబినేషన్.



Click it and Unblock the Notifications