Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హార్ట్ పేషంట్స్ తినదగ్గ హెల్తీ బిర్యానీ-చెన్న బిర్యానీ
ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిని, చాలా మందిని చూస్తూనే ఉన్నాం. చాలా వరకూ హార్ట్ పేషంట్స్ కొన్ని రకాలైన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒక్క సారి హార్ట్ కు డైయాగ్నసిస్ చేసిన తర్వాత, డాక్టర్ చాలా ఖచ్చితమైన డైట్ ను ఫాలో చేయమని సలహాలిస్తుంటారు . ఆ డైట్ ఫుడ్ మీకు ఎప్పటికీ నచ్చకపోవచ్చు. అటువంటప్పుడు హార్ట్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరియు మీ టేస్ట్ బడ్స్ కు రుచి చూపించడానికి ఏం చేయాలి?
ఈ సమస్యకు ఒక ఫర్ ఫెక్ట్ పరిష్కారం ఉంది. కాబూలీ చెన్న లేదా తెల్లని బుడ్డశెనగలు హార్ట్ పేషంట్స్ కు ఒక అద్భుతమైన ఆహారం. కాబూలి చెన్న రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హార్ట్ పేషంట్స్ లో కొలెస్ట్రాలో లెవల్స్ ను తగ్గిస్తుంది మరియు హార్ట్ మజిల్స్ ను బలోపేతం చేస్తుంది. మరి ఈ కాబూలీ శెనగలతో రుచికరమైన బిర్యాని తయారు చేసుకొని రుచి చూడవచ్చు. ఈ వంటకు చాలా తక్కువ నూనెను ఉపయోగించి బిర్యానీ తయారుచేసుకోవచ్చు. అదెలాగో చూడండి..

బాస్మతి బియ్యం: 2 cups(వండిన అన్నం)
పుదీనాఆకులు: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కొత్తిమీర: 3tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిరపకాయలు: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
కుంకుమ పువ్వు: ఒక చిటికెడు
లోఫ్యాట్ మిల్క్: ½cup
నూనె: 1tsp
మసాలా కోసం:
కాబూలి చెన్నా(కాబూటి శెనగలు/చిక్పీస్): 1cup(రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tsp
పసుపు: 1tsp
కారం: ½ tsp
ధనియాలపొడి: 1tsp
లోఫ్యాట్ పెరుగు: 1cup
టమోటాలు : 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
బంగాళ దుంపలు : 2 (ఉడికించిన మరియు చిన్న ముక్కలుగా తరిగాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tbsp
నీళ్ళు: 2 cups
తయారు చేయు విధానం:
మసాలా కోసం
1. ముందుగా రాత్రంతా కాబూలీ శెనగలను నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి.
2. మరుసటి రోజు ఉదయం శెనగలను కుక్కర్ లో వేసి, సరిపడా నీళ్ళు, ఉప్పు చేర్చి ఒకటి, రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. తర్వాత కుక్కర్ పక్కకు దింపుకొని, కుక్కలోని ఆవిరి పూర్తిగా తగ్గే వరకూ అలాగే పక్కనుంచాలి.
4. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో మూడు నిముషాలు వేగించుకోవాలి.
5. తర్వత అందులోనే కారం, పసుపు, ధనియాలపొడి వేసి మీడియం మంట మీద రెండు నిముషాలు వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకూ వేగించుకోవాలి.
7. అలాగే బంగాళదుంపలు, పచ్చిమిర్చి లో ఫ్యాట్ పెరుగు, వేసి బాగా మిక్స్ చేస్తూ వేగించుకోవాలి. 5-10నిమిషాలు వేగించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
బిర్యానీ తయారుచేయడానికి:
1. కుంకుమ పువ్వును లోఫ్యాట్ మిల్క్ లో కలిపి పక్కన పట్టుకోవాలి.
2. తర్వాత ముందుగా వండి పెట్టుకొన్న అన్నంలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తరుగులను వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు బేకింగ్ ట్రేకు కొద్దిగా నూనె రాసి, అందులో సగం అన్నంను వేసి ట్రేమొత్తం సర్ధాలి.
4. దాని మీద సెకండ్ లేయర్ గా ముందుగా తయారుచేసి పెట్టుకొన్న కాబూలీ గ్రేవీ వేసి ట్రే మొత్తం సర్ధాలి.
5. ఇప్పుడు మూడవ లేకర్ గా తిరగి అన్నం, తర్వాత దాని మీద చెన్నా గ్రేవీ పూర్తిగా వేసి సర్దాలి.
6. చివరగా కుంకుమ పువ్వునానబెట్టుకొన్న పాలను చికలరించి అల్యూమినియం ఫోయల్ తో పాన్ పూర్తిగా కవర్ చేసి. 200డిగ్రీ సెంటీగ్రేడ్ లో ఓవెన్ లో 20నిముషాలు ప్రీ హీట్ చేయాలి.
7. బేక్ చేసిన తర్వాత ఫ్రైయింగ్ ట్రేను బయటకు తీసి వేడి వేడిగా సర్వ్ చేయాలి అంతే చెన్నా బిర్యానీ రిసిపి రెడీ.
ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన బిర్యాని రిసిపిని లోఫ్యాట్ కర్డ్ రైతాతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications