Latest Updates
-
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే! -
పెళ్లిళ్ల సీజన్ రద్దీ.. మీ వేడుకను పాడుచేయకుండా ఇలా ప్లాన్ చేసుకోండి! -
బిర్యానీ, పులావ్ బోర్ కొట్టిందా? అయితే ఈ సండే ఆలూ చికెన్ రైస్ ట్రై చేయండి! -
దగ్గు, గొంతు నొప్పితో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో వెంటనే ఉపశమనం పొందండి -
Happy akshaya tritiya 2026: అక్షయ తృతీయ నాడు మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్! -
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!
చెట్టినాడు వెజిటేబుల్ కర్రీ
Veg
oi-Saraswathi
By Sindhu

గసగసాలు: 2tbsp
జీడిపప్పు: 1tbsp
జీలకర్ర: 1tbsp
మెంతులు: 1 tsp
ధనియాలు: 1 tsp
ఎండు మిర్చి: 2
లవంగాలు: 3
యాలకులు: 3
చెక్క: చిన్న ముక్క
కొబ్బరి తురుము: 1/2 cup
ఉప్పు రుచికి తగినంత
నూనె: 2tbsp
మసాలా పేస్ట్ తయారు చేయు విధానం:
1. ముందుగా గసగసాలు, జీడిపప్పు వేడి నీళ్ళలో పది నిమిషాల పాటు నానబెట్టి , పది నిమిషాల తర్వాత వడగట్టి తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, మెంతులు వేసి చిటపటలాడిన తర్వాత అందులోనే ధనియాలు, ఎండుమిర్చి, యాలకులు, చెక్క, లవంగాలు, కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేయాలి. ఇవన్నీ తక్కువ మంట మీద వేగనివ్వాలి. తర్వాత ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
3. ఇప్పుడు మిక్సీలో జీడిపప్పు, గసగసాలు, వేయించి పెట్టుకొన్ని మసాలా దినుసులు, కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
చట్నీ కోసం:
మిక్డ్స్ వెజిటేబుల్స్: 2 cups(క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకొన్నవి)
ఉల్లిపాయ: 1(ముక్కలుగా తరుగుకోవాలి)
టమోటో: 2 (ముక్కలుగా తరుగుకోవాలి)
పసుసు: 1/2 tsp
కారం: 1 tsp
నూనె: 4 tbsp
పాలు: 1/4 cup
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి బాగా వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అందులోనే పసుపు, కారం వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
2. తర్వాత టమోటో ముక్కలు వేసి ఫ్రై చేస్తూ మెత్తగా అయ్యే వరకూ వేయించుకోవాలి.
3. తర్వాత మసాలా ముద్ద వేసి వేయించి. తర్వాత కూరగాయల ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేయించి, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద ఐదునిమిషాల పాటు ఉడికించుకోవాలి.
4. చివరగా కొద్దిగా పాలు, ఉప్పు వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాలు తక్కవ మంట మీద ఉడికించుకోవాలి. అంతే చెట్టినాడు మిక్డ్స్ వెజిటేబుల్ కర్రీ రెడీ...
ఇది అన్నం, రోటిలోకి చాలా రుచిగా ఉంటుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: carrot cauliflower beans capsicum onion tomato redchilli powder salt క్యారెట్ కాలీఫ్లవర్ బీన్స్ క్యాప్సికమ్ ఉల్లిపాయ టమోటో కారం ఉప్పు
English summary
Chettinad Vegetable Curry | చిట్టినాడు వెజిటేబుల్ కర్రీ
Story first published: Wednesday, July 4, 2012, 8:34 [IST]
Other articles published on Jul 4, 2012



Click it and Unblock the Notifications











