Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
స్పెషల్ టేస్ట్ ..స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ పూరీ బాజీ

పూరీని మైదా లేదా గోధుమ పిండి రెండితోనూ తయారు చేస్తారు. బాజీ ని బంగాళదుంపతో తయారు చేస్తారు. ఒక్క బ్రేక్ ఫాస్ట్ గానే కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా పూరీ బాజీని తయారు చేసుకొంటారు. ప్రయాణంలో మరియు విహారయాత్రలకు వెళ్ళినప్పడు పూరీబాజీని ఎక్కువగా తింటుంటారు. ఇది బ్రేక్ ఫాస్ట్ మరియు లంచ్ గా కూడా తీసుకుంటారు. అయితే మితంగా తింటేనే టేస్ట్ మరియు ఆరోగ్యం. మీకు పూరీ బాజీ తినాలని కోరికగా ఉంటే బాజీ ఎలా తయారు చేయాలో ఒక సారి చూసేయండి....
కావల్సిన పదార్థాలు:
బంగాళ దుంప: 3(ఉడికించి పొట్టు తీసి చిదిమి పక్కన పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్నగా, చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 4(మద్యకు కట్ చేసి పెట్టుకోవాలి)
టమోటో: 1(సన్నగా కట్ చేసుకవాలి)
అల్లం: చిన్న ముక్క(చితగొట్టి పక్కన పెట్టుకోవాలి)
పసుపు: 1/4tsp
ఉప్పు : రుచికి సరిపడా
కొత్తిమీర : గార్నిష్ కు (తగినంత)
నూనె: సరిపడా
పోపుకోసం:
ఆవాలు: 1tsp
ఇంగువ: చిటికెడు
పచ్చిమిర్చి: 2-3(మద్యకు కట్ చేసుకోవాలి)
కరివేపాకు: 10-12
తయారు చేయు విధానం:
1. ముందుగా కుక్కింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఆవాలు, వేసి చిటపటలాడాక, ఇంగువ వేసి అర నిముషం వేగించాలి. అందులోనే తాజా కరివేపాకు, పచ్చిమిర్చి, మరియు అల్లం వేసి మరో నిముషం పాటు వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద 5నిముషాలు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి మిక్స్ చేయాలి. అలాగే కట్ చేసుకొన్న టమోటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఉడికించి చిదిమి పెట్టుకొన్న బంగాళదుంపను వేసి బాగా మిక్స్ చేస్తూ ఉప్పును సరిచూసుకొని అవసరం ఐతే కొద్దిగా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతటిని బాగా మిక్స్ చేస్తూ వేగిస్తూ అరకప్పు నీళ్ళు అందులో పోసి మరో ఏడేనిమిది నిముషాల పాటు వేగించాలి. కర్రీ అంతా డ్రైగా మారే వరకూ వేగించాలి. తర్వాత స్టౌ కట్టేయాలి . కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి పూరిలతో సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications