స్పైసీ కార్న్ పులావ్ రిసిపి: టేస్టీ అండ్ హెల్తీ

కార్న్ (మొక్కజొన్న)తో కాల్చి లేదా ఉడికించి లేదా సూప్ చేసుకొని తింటుంటారు. శీతాకాలంలో హాట్ కార్న్ కోసం స్టాల్స్ చుట్టూ తిరుగుతుంటాం. మనలో చాలా మంది కార్న్ ను ఈవెనింగ్ స్నాక్ గా తింటుంటారు. అంతే కాదు మన ఇంటికి వచ్చిన మన ఫ్రెండ్స్ కూడా కాఫీ మరియు టీ తో పాటు హాట్ కార్న్ ను సర్వ్ చేస్తుంటాం. కార్న్ మంచి స్నాక్ మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇందులో అధికంగా విటమిన్స్ ఉండి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది.

కార్న్ తో వివిధ వెరైటీ వంటలు తయారు చేసి తింటారు. కాబట్టి మనం కూడా ఓ మంచి వెరైటీ వంట..అదే కార్న్ పులావ్ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Easy to cook spicy corn pulao

కావల్సిన పదార్థాలు:
ఉల్లిపాయ: 1(నాలుగుబాగాలు కట్ చేసుకోవాలి)
టమోటో: 1(రెండుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి: 4-5రెబ్బలు
అల్లం: కొద్దిగి(సన్నగా తురుముకోవాలి)
పచ్చిమిర్చి: 2
ధనియాలపొడి: 1tbsp
గరం మసాలా: 1/4tsp
కారం: 1tbsp
పసుపు: 1/4tbsp

వంటకు కావల్సినవి:
బాస్మతి రైస్: 1cup
అమెరికన్ కార్న్ కెర్నల్స్: 3/4 cup
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిబఠానీలు: 1/2cup
బ్లాక్ యాలకలు: 2
లవంగాలు : 3
దాల్చిన చెక్క: 1
జీడిపప్పు: 8
బిర్యానీ ఆకు: 1
కుంకుమ పువ్వు: చిటికెడు
కొత్తిమీర: 1(సన్నగా తరిగినవి)
పాలు: 1tbsp
నెయ్యి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్ళు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు, పాలల్లో కొద్దిగా కుంకుమపువ్వు వేసి నానబెట్టి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత మిక్సీ గ్రైండర్ లో మసాలా కోసం సిద్దం చేసుకొన్నవన్నీ వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4.ఇప్పుడు కడైని స్టౌ మీద పెట్టి, వేడయ్యాక అందులో నెయ్యి వేసి కాగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకొన్న బియ్యం అందులో వేసి 2నిముషాలు మీడియం మంట మీద ఫ్రైచేసుకోవాలి.
5. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక చెంచా నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, మరియు బిర్యానీ ఆకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి మరో నిముషం గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు చిలకరించడం వల్ల,ఉల్లిపాయలు, గోల్డ్ బ్రౌన్ కలర్ లోకి మారుతాయి.
7. ఇప్పుడు అందులో కార్న్ కెర్నల్స్ వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. దాని తర్వాత అందులో నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకొన్న బియ్యంను కుక్కర్ లో వేయాలి. ఒక కప్పు బియ్యంకు రెండు కప్పుల నీళ్ళు పోసి, రుచికి సరిపడా నీళ్ళు పోయాలి.
9. ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి, 10నిముషాలు మంట ఎక్కువగా పెట్టి, తర్వాత మీడియంకు తగ్గించాలి. ఒకటి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
10. అంతలోపు, పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి.
11. కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత మూత తీసి కుంకుమపువ్వు నానబెట్టిన పాలను చిలకరించి, దాని మీద కొత్తిమీర తరుగు, ఫ్రై చేసుకొన్న జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
12. చివరగా లవంగాలు మరియు దాల్చిన చెక్కతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే మంచి రుచితో ఆరోమాటిక్ సువాసనతో నోరూరించే కార్న్ పులావ్ రెడీ

Story first published: Monday, October 27, 2014, 18:15 [IST]
Desktop Bottom Promotion