Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
ఆలూ ఫ్రైడ్ పూరీ: కిడ్స్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్
సహజంగా చిన్న పిల్లలు ఫ్రై చేసిన మరియు క్రిస్పీగా ఉన్నా ఏ ఫుడ్స్ అయినా సరే చాలా ఇష్టంగా తింటారు . అన్నింటికంటే, ఏ వంటకైన బంగాళదుంపను జడిస్తే చాలా మరింత ఎక్కువగా ఇష్టపడుతారు . మీ పిల్లలు బంగాళ దుంపను ఎక్కవుగా ఇష్టపడుతుంటే, ఈ ఫ్రైడ్ పొటాటో పూరీలాను తప్పకుండా ట్రై చేయాల్సిందే. పిల్లలకు ఇష్టమైన వంటల్లో ఇది ఒక ఉత్తమ రిసిపి.
అందువల్ల ఫ్రైడ్ ఆలూ పూరిని తయారుచేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పిల్లలకు చాలా హెల్తీ మరియు లంచ్ బాక్స్ కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరి ఈ ఫ్రైడ్ ఆలూ పూరి ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
మైద: 4cups
బంగాళదుంప: 150grams
కొత్తిమీర తరుగు : కొద్దిగా
వెల్లుల్లి రెబ్బలు: 6
పచ్చిమిర్చిం 4
నూనె: ఫ్రై చేయడానికి సరిపడ
ఉప్పు: రుచికి తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుపంలను ఉడికించి, పొట్టు తీసి, స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీల కొత్తిమీర, పచ్చిమిర్చి, మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
3. తర్వాత స్మాష్ చేసి పెట్టుకొన్ని బంగాళదుంపు ఈ పచ్చిమిర్చి పేస్ట్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఉప్పు కూడా జోడించి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇక గిన్నెలో మైదా తీసుకొని 2టేబుల్ స్పూన్ల నూనె వేసి మిక్స్ చేసి తర్వాత సరిపడా నీళ్ళు పోసి, చపాతి పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు పిండి నుండి కొద్దికొద్దిగా తీసుకొని, చిన్న ఉండలు చేసి చపాతీలా వత్తుకొని , మద్యలో బంగాళదుంప స్టఫ్ ను పెట్టి, తిరిగి పూరిల్లా ఒత్తుకోవాలి.
6. ఇలా అన్ని స్టఫింగ్ పూరిలను తయారుచేసుకొన్నాక , స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడిచేయాలి.
7. నూనె వేడయ్యాక అందులో ఒక్కో పూరినీ వేసి బ్రౌన్ కలర్లో, క్రిస్పిగా వచ్చేవరకూ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకోవాలి అంతే రుచికరమై క్రిస్పీ ఆలూ పూరీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.



Click it and Unblock the Notifications











