బెండకాయ పప్పుల పొడి వేపుడు

Ladies Finger Fry
కావలసిన పదార్థాలు:
బెండకాయముక్కలు: 1cup
పసుపు: 1/2tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు, కారం: తగినంత
వేయించిన పల్లీలు (వేరుశనగపప్పు): 3tsp
పుట్నాలపప్పు (వేయించిన శనగపప్పు): 2tsp
ఎండుకొబ్బరి: చిన్న ముక్క,
వెల్లుల్లి రెబ్బలు: 2
నూనె: కావలసినంత
పోపుకోసం:
ఆవాలు: 1/2tsp
శనగపప్పు:అర టీ స్పూను
ఎండుమిర్చి: 4,
మినప్పప్పు: 1/2tsp

తయారు చేయు విధానము:
1. వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి... వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. బెండకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని కాసేపు ఆరనివ్వాలి.
3. పాన్ లో నూనె వేడిచేసి పోపు సామాను వేసి, వేగాక కరివేపాకు, బెండకాయముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి మూత పెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు పూర్తిగా వేగాక ఉప్పు, కారం, పల్లీల పొడి, పసుపు వేసి కలిపి దించుకోవాలి.

Story first published: Tuesday, June 7, 2011, 16:40 [IST]
Desktop Bottom Promotion