Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మామిడికాయ పప్పు: ఉగాది స్పెషల్
మామిడికాయ పప్పు(మ్యాంగో దాల్)ఆంధ్రాలో బాగా పాపులర్ అయినటువంటి క్లాసిక్ పప్పు కూర(దాల్). ఈ మామిడికాయ పప్పు ఆంధ్రా కుటుంబ సభ్యలకు చాలా ఇష్టమైనటువంటి పప్పుకూర. ఉగాదికి చిన్న చిన్న సైజులో వేసవి సీజన్ ను పలకరిస్తూ, పుల్ల పుల్లగా మనకు అందుబాటులో ఉంటాయి.
పచ్చిమామిడి కాయలు, ఈ పుల్లని లేలేత పచ్చిమామిడి కాయలతో పప్పు వండితే చాలా రుచికరంగా ఉంటుంది. దాల్ మరియు మామిడికాయ ఒక బెస్ట్ కాంబినేషన్. ఉగాది రోజున మామిడికాయ పప్పుతో, విందు భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒక సారి ట్రై చేయండి. పుల్లపుల్లగా కమ్మగా ఎంజాయ్ చేయండి...

కావల్సిన పదార్థాలు:
తూర్ దాల్/ కంది పప్పు: 1cup
పచ్చి మామిడి ముక్కలు: 1/2cup(పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
టమోటో: 1(చిన్నది, సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు: 1/4tsp
పచ్చి మిర్చి: 4-6(పొడవుగా మద్యలోకి కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్న ముక్క(తురుముకోవాలి లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచిక సరిపడా
నీరు: 1 లేదా 2 cup
పోపు కోసం :
ఆవాలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
వెల్లుల్లి రెబ్బలు: 3-4(కచపచ దంచుకోవాలి)
ఎండు మిర్చి: 2(విత్తనాలు తీసేసి మద్యకు కట్ చేసుకోవాలి)
ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: 2-3tsps
తయారు చేయు విధానం:
1. ముందుగా పప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో కడిగి పెట్టుకొన్న పప్పు, మామిడి ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, టమోటో ముక్కలు మరియు పసుపు వేయాలి.
3. తర్వాత అందులోనే రెండు కప్పుల నీళ్ళు పోసి, మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఆవిరి తగ్గనివ్వాలి.
4. అంతలోపు, స్టౌ మీద మందపాటి పాత్ర పెట్టి, అందులో నూనె వేసి, వేడయ్యాక అందులో ఆవాలు వేసి, చిటపటలాడినతర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఎండు మిర్చి మరియు కరివేపాకు వేసి మరో నిముషం వేగించుకోవాలి.
5. పోపుదినుసులు వేగిన తర్వాత అందులో కుక్కర్ లో ఉడికించి పెట్టుకొన్న పప్పు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద 5-10నిముషలు ఉడికించుకోవాలి. అంతే ఉగాది స్పెషల్ మామిడికాయ పప్పు రెడీ. ఈ పప్పును వేడి వేడి అన్నం, వేపుడు, అప్పలంతో వడ్డిస్తే, చాలా రుచికరంగా, మంచి కాంబినేషన్ తో పండుగ విందు ఆహా అనిపిస్తుంది.




Click it and Unblock the Notifications











