Latest Updates
-
వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ 'దేశీ' చిట్కాలు పాటించండి.. ఎండల నుంచి ఉపశమనం ఎలా? -
మండే ఎండలకు చెక్.. ఇంట్లో ఉండే పండ్లతోనే చల్లటి, క్రీమీ ఐస్ క్రీమ్ తయారీ! -
మీ చుట్టూ ఉన్న తేనె పూసిన కత్తులను ఎలా గుర్తించాలి? -
నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి.. డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
జిమ్ వద్దు, కఠిన డైట్ వద్దు..3 నెలల్లో 12 కిలోలు తగ్గిన డాక్టర్ సీక్రెట్ ఇదే! -
రవి యోగం, సిద్ధ యోగం కలయిక.. ఏప్రిల్ 26న ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి!
మంచూరియా పొటాటో

బంగాళాదుపంలు: 4
ఉల్లిపాయ: 2
క్యాప్సికమ్: 2
మొక్కజొన్నపిండి: 1/2cup
మైదా: 1/2cup
వంట సోడా: చిటికెడు
పచ్చిమిర్చి: 4-6(ముక్కలుగా చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tsp
నూనె: తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను సన్నగా చిప్స్ లాగా తరుక్కుని వాటికి కొద్దిగా ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. మిగతా కూరగాయలను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో మైదా, మొక్కజొన్నపిండి, వంటసోడా వేసి అరకప్పు నీరు పోసి మృదువుగా కొద్దిగా గంటె జారుగా కలుపుకోవాలి.
4. మరొక గిన్నెలో కొద్దిగా నీరు పోసి మురిగిన తరువాత కలుపుకున్న చైనీస్ మంచురియాను కలిపి సన్నని మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
5. కొద్దిగా గట్టిపడుతుండగానే స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందుంలో కొద్దిగా నూనె వేసి అందులో బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేయించాలి. దీనికి మంచూరియా కూడా కలిపి వేయించుకోవాలి.
7. సర్వ్ చేసే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు అలంకరించి అందించాలి. ఇదే పద్ధతిలో పనీర్ తో కూడా చేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కల స్థానంలో పనీర్ ముక్కలు కలుపుకోవాలి.



Click it and Unblock the Notifications