Latest Updates
-
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి!
మేతి మట్టర్ పనీర్ పులావ్
మేతి (మెంతి ఆకు)చాలా పాపురల్ గ్రీన్ హెర్బ్. చాలా ఎక్కువగా ఈ మెంతిఆకులను వంటల్లో ఉపయోగిస్తుంటారు. వివిధ రకాలుగా వండుతారు. ఈ మెంతి ఆకులు కొద్దిగా చేదు ఉండటం వల్ల చాలా మంది ఈ ఆకును ఉపయోగించరు. అయితే ఇందులో వివిధ రకాల విటమిన్స్, పోషకాలు, మినిరల్స్ ఉన్నాయి. ఇంకా ప్రోటీలను, ఐరన్, క్యాల్షియం, విటమిన్స్ మరియు పొటాషియం అధికంగా ఉన్నాయి.
ఇంత గొప్ప ప్రయోజనాలున్న ఈ ఆకుకూరతో పులావ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. బిటర్ టేస్ట్ ఉండకూదనుకుంటే, ఇందులో పనీర్, మటర్ వంటి వాటిని జోడించి చేస్తే చాలా రుచికరంగా వెరైటీగా ఉంటుంది. కావాలంటే మీరూ ఒక సారి ట్రై చేసి చూడండి...

కావాల్సిన పదార్ధాలు:
బియ్యం: 1glass
మెంతికూర: రెండు కట్టలు(మీడియం సైజ్)
పనీర్: 100grms(అవసరం అయితే ఇంకా ఎక్కువగానే వాడుకోవచ్చు.)
పచ్చిమిర్చి: 2 (మద్యకు కట్ చేసుకోవాలి)
అల్లం: కొద్దిగా
కొత్తిమీర: 1cup(విడిపించి పెట్టుకోవాలి)
పుదీనా: 1cup(విడిపించి పెట్టుకోవాలి)
పుల్లపెరుగు: 2cups
అల్లం,వెల్లుల్లిపేస్ట్: 2tbsp
గరం మసాలా లేదా బిరియానీ మసాలా పౌడర్ : 1tsp
నెయ్యి: 3tsp
ఉల్లిపాయ: 1(పెద్దది, సన్నగా కట్ చేసుకోవాలి)
టమాటా: 1(పెద్దది, సన్నగా కట్ చేసుకోవాలి)
నూనె: కొద్దిగా
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా మెంతి, కొత్తిమీర, పుదీనా ఆకులు కాడలు లేకుండా తీసేసి కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులు గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి.
2. తర్వాత అల్లం, పచ్చిమిర్చి చీలికల్లాగ తరిగి ఉంచుకోవాలి. ఉల్లిపాయ, టమాటా కూడా సన్నగా తరిగి ఉంచుకోవాలి.
3. ఇప్పుడు చిలికిన పెరుగులో ఉప్పు, పసుపు, ఒక చెంచా అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి చిన్నగా తరుక్కున్న పనీర్ ముక్కలు అందులో వేయాలి. ఆ ముక్కలను అలా ఓ అరగంట పాటు నానబెట్టాలి.
4. అంతలోపు బిరియానీ రైస్ కాస్త నెయ్యి వేసి వండేసి, ఉప్పు కలిపేసి పొడిగా ఆరబెట్టుకోవాలి.
5. తర్వాత ఒక పాన్ లో కానీ పెద్ద డీప్ ఫ్రైయింగ్ పాన్ లో కానీ నెయ్యి లేక నూనె వేసి మిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వలి.
6. తరువాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేయాలి. తరువాత పచ్చిబఠానీ వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
7. అలాగే 5-10నిముషాల తర్వాత కడిగి ఉంచుకున్న మెంతిఆకు అందులో వేయాలి. మాడకుండా కలుపుతూ ఉండాలి. మెంతిఆకు వేగాకా అందులో నానబెట్టిన పనీర్ ముక్కలు, బిరియానీ మసాల పౌడర్, గ్రైండ్ చేసుకుని ఉంచిన కొత్తిమీర-పుదీనా పేస్ట్, కావాలంటే ఒక చెంచా కారం వేసి అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా మగ్గనివ్వాలి.
8. పైన మిశ్రమం దగ్గర పడినట్లుగా అనిపించాకా ఇందాకా పొడిపొడిగా పెట్టుకున్న రైస్ అందులో కలపాలి. టేస్ట్ చూసి కావాలంటే, ఉప్పు కారాలు కలుపుకోవచ్చు. మిగిలిన నెయ్యి కూడా అందులో కలిపేయాలి.
9. ఒక ఐదు పది నిమిషాలు మొత్తం రైస్ ను స్టౌ మీద అలాగే తక్కువ ప్లేమ్ లో ఉంచి ఆ తరువాత దింపుకోవాలి. కొత్తిమీర, కాస్త తురిమిన పనీర్ తో డేకరేట్ చేసి సర్వ్ చెయ్యాలి.
10. ఇందులోకి మామూలుగా బిరియాలీల్లోకి చేసుకునే ఉల్లిపాయ, పెరుగు రైతా బాగుంటుంది. అందులో ఒక కేరెట్ కూడా గ్రేట్ చేసుకుని కలిపితే బాగుంటుంది.
11. ఇది రెగులర్ బిరియానీ టైప్ కాదు కాబట్టి వెరైటీగా ఉంటుంది. సాదారణా సోనా మసురా బియ్యంతో చేస్తే కూడా బాగుటుంది. అయితే బాస్మతి రైస్ అయితే మరింత టేస్ట్ ఉంటుంది.



Click it and Unblock the Notifications