Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సాబుదాన లేదా సగ్గుబియ్యం ఖీర్: శ్రీరామనవమి స్పెషల్
సగ్గు బియ్యం అనగానే పాయసం. పాయసం అనగానే సగ్గుబియ్యం గుర్తుకొస్తాయి కదూ! అయితే ఈ తినే తెల్లని ముత్యాలంటే చాలా ఇష్టం.
వీటినే ఆంగ్లంలో 'సాగో' అని హిందీలో 'సాబుదానా' అని అంటారు. మన భారతదేశంలో పండుగలకు చేసే పొంగలిలో, పాయసంలో వీటిని తప్పకుండా వాడటం తప్పనిసరి. వీటిని ఉపయోగించి పాయసమే కాకుండా రకరకాల పిండివంటలు తయారుచేస్తారు. అందరూ ప్రధానంగా పిల్లలు ఎంతో ఇష్టంగా సగ్గుబియ్యంతో తయారుచేసిన వంటలు తింటారు.
సాబుదాన ఖీర్ ఒక ఇండియన్ డిజర్ట్ రిసిపి. మీకు తీపి తినాలనే కోరిక ఉన్నప్పుడు ఇటువంటి సింపుల్ అల్పాహారంను తయరుచేసుకోవచ్చు. ఈ స్పెషల్ వంట పిల్లలకు మరియు పెద్దలకు కూడా చాలా ఇష్టం. మరి మీరు కూడా రుచి చూడాలంటే ఒక సారి ప్రయత్నించి పండుగ ప్రాశ్యస్తంను పూర్తి చేసుకోండి...

కావల్సిన పదార్థాలు:
సాబుదాన లేదా సగ్గుబియ్యం :1cup
పాలు: 2 cups
బెల్లం లేదా చక్కెర: 1cup
ఏలకుల పొడి: 1tsp
ఎండుద్రాక్ష 10
బాదం 10
జీడిపప్పు 10
వెన్న: 1tbsp
కేసర్ లేదా కుంకుమ :1 చిటికెడు
తయారుచేయు విధానం:
1. సాబుదాన ఖీర్ తయారుచేయడానికి సన్నని సగ్గుబియ్యాన్ని ఉపయోగించండి . ఖీర్ సాఫ్ట్ గా ఉండాలంటే సగ్గు బియ్యాన్ని కనీసం 1 గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే, మీరు తయారుచేసే పద్దతి చాలా సులభం అవుతుంది.
2. డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా పాలు పోసి మరిగించాలి. పాలు పొంగకముందే అందులో పంచదార లేదా బెల్లం వేసి స్పూన్ తో మిక్స్ చేస్తుండాలి. బెల్లం లేదా పంచదార కరిపోయే వరకూ మిక్స్ చేయాలి.అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు .
3. తర్వాత ఇందులో సాబుదాన వేసి 10 నుండి 12 నిముషాలు ఉడికించుకోవాలి.
4. అంతలోపు స్టౌ మీద మరో చిన్న పాన్ పెట్టి అందులో దాల్చిన చెక్క పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి . బ్రౌన్ కలర్ లోకి వేగిన తర్వాత వాటిని తీసి ఉడుకుతున్న సాబుదాన కీర్ లో మిక్స్ చేయాలి .
5. చివరగా చిటికెడు కుంకుమ పువ్వు వేసి బాగామిక్స్ చేసి, స్టౌ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఫ్రింజ్ లో పెట్టి, రెండుగంటల తర్వాత సర్వ్ చేయండి. అంతే రామ నవమి స్పెషల్ సాబుదాన రెడీ...



Click it and Unblock the Notifications