Latest Updates
-
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా?
టమోటో పన్నీర్ పలావ్

కావలసిన పదార్ధాలు:
టమాటాలు: 4-6
పనీర్: 100grms
సన్నబియ్యం: ఒక గ్లాస్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కొత్తిమీర: ఒక కట్ట
పుదీనా: ఒక కట్ట
ఉల్లిపాయ: 2
పచ్చిమిర్చి : 6-8
కారం: 2tbsp
పసుపు:1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
గరంమసాలా పొడి: 1tsp
లవంగాలు, చెక్క, షాజీర, బిర్యానీ ఆకు: తగినంత
తయారు చేసే విధానం:
1. పనీర్ ను చిన్న ముక్కలుగా కోసుకుని కొంచెం ఉప్పు, కారం, పసుపు, పావు స్పూన్ గరంమసాలా పొడి వేసి కలిపి ఒక పావుగంట మారినేట్ చెయ్యాలి.
2. బియ్యం కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. టమాటాలు ఉడికించి గ్రైండ్ చేసి గుజ్జు రెడీ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేడి చేసి నాలుగు లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, ఒక స్పూన్ షాజీర వేసి వేయించాలి.
4. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
5. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత టమాట గుజ్జును వేయాలి. పచ్చివాసన పోయే వరకూ వేయించుకోవాలి.
6. అందులోనే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి బాగా వేయించి మారినేట్ చేసిన పనీర్ ముక్కలు వేసి కలపాలి. తగినంత కారం, పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా పొడి వేసి బాగా కలిపి రెండుగ్లాసుల నీళ్ళు పోసి మరిగాక బియ్యం, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఆవిరంతా తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతే టమోటో పనీర్ పలావ్ రెడీ. వేడి వేడిగా పెరుగుపచ్చడితో తింటే ఈపులావ్ చాల రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications











