Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్!
సీ ఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది, అందరూ ఎంతో ఇష్టంగా తినేది చేప. మార్కెట్లో ఎన్నో రకాల చేపలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఆదివారం లేదా వారానికి కనీసం ఒక్కసారైనా చేపలు వండుకోవడం చాలా తెలుగు ఇళ్లలో ఒక ఆనవాయితీగా వస్తోంది.

సాధారణంగా మనం చేపలను కొన్న వెంటనే పులుసుగానో, ఇగురుగానో లేదా డీప్ ఫ్రైగానో వండుకుని తింటుంటాం. కానీ ఎప్పుడైనా మీరు చేపల కుర్మా వండి రుచి చూశారా? పల్లెటూరి స్టైల్ లో మట్టి పాత్రలో వండే ఈ కుర్మా గ్రేవీ వేడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ.. ఇలా దేనిలోకైనా అద్భుతమైన కాంబినేషన్.
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి
చేపల కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - పావు కేజీ
చింతపండు - చిన్న ఉసిరికాయంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు
పెద్ద ఉల్లిపాయ - 1
టమాటా - 1
పచ్చిమిర్చి - 2
పసుపు - పావు టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 3 టీస్పూన్లు
సోంపు - ముప్పావు టీస్పూన్
నూనె - తగినంత
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి తురుము - అర చిప్ప
జీడిపప్పు - 6
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
చేపల కుర్మా తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, జీడిపప్పులు వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు వల్ల కుర్మాకు మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది.
-చేపల కూరలు మట్టి కుండలో వండితే ఆ రుచే వేరు. స్టవ్ వెలిగించి మట్టి కుండను పెట్టి, తగినంత నూనె పోసి వేడి చేయండి. నూనె కాగాక సోంపు గింజలు వేసి చిటపటలాడించాలి. ఆ సువాసన వస్తుండగానే కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
-ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి మారిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి.
-టమాటాలు బాగా మగ్గి మెత్తబడిన తర్వాత..అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. మసాలాలు మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా నీళ్లు చల్లి నూనె పైకి తేలేవరకు వేయించాలి.
-మసాలాల పచ్చివాసన పోయాక, ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి-జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. దీనిలో అర కప్పు నీళ్లు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి.
-గ్రేవీ బాగా మరుగుతున్న సమయంలో శుభ్రం చేసుకున్న చేప ముక్కలను నెమ్మదిగా అందులో వేయాలి. చేపలను గరిటెతో ఎక్కువగా కలపకూడదు.
-చేపలు ఉడికిన తర్వాత అందులో పావుగంట సేపు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మీ రుచికి తగినట్లుగా వేసుకుని, మూతపెట్టి సన్నని మంట మీద మరికాసేపు ఉడికించాలి.
-కూరలోంచి నూనె పైకి తేలుతూ, మంచి సువాసన వస్తున్నప్పుడు కొత్తిమీర, కరివేపాకు చల్లి స్టవ్ ఆపేయాలి.
-అంతే చేపల కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications