Latest Updates
-
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.!
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు!
వీకెండ్ వచ్చిందంటే చాలు భోజన ప్రియులకు నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులోనూ చికెన్ ఉంటే ఆ మజాయే వేరు. అయితే ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా, కరివేపాకు సువాసనతో, ఆంధ్రా స్టైల్ మసాలాల ఘాటుతో నోరూరించే కరివేపాకు తొక్కు చికెన్ ఎప్పుడైనా ట్రై చేశారా? పేరు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. వేడి వేడి అన్నం, రోటీ, చపాతీ, నాన్ లేదా బిర్యానీ ఇలా ఎందులోకైనా ఈ కరివేపాకు చికెన్ పర్ఫెక్ట్ కాంబినేషన్.

కరివేపాకు తొక్కు చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్ కోసం
బోన్లెస్ చికెన్: 500 గ్రాములు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: మీ కారానికి తగినట్లుగా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ కోసం)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు కారం పొడి కోసం
ధనియాలు: 3 టేబుల్ స్పూన్లు
మిరియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4
యాలకులు: 2
ఎండు మిర్చి: 20 గ్రాములు
బిర్యానీ ఆకు: 1
కరివేపాకు: 1 కప్పు
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు!
కరివేపాకు తొక్కు చికెన్ తయారీ విధానం
-ముందుగా ఒక స్టీమర్ (ఆవిరి పాత్ర) తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన బోన్ లెస్ చికెన్ వేసి సుమారు 20 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన చికెన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా చేత్తో పొరలు పొరలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో కారం పొడి కోసం తీసుకున్న మసాలా దినుసులు..ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండు మిర్చి, బిర్యానీ ఆకు వేసి సన్నని మంట మీద మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించాలి. అవి చల్లారాక పక్కన పెట్టుకోవాలి.
-అదే పాన్ లో ఒక కప్పు కరివేపాకు వేసి, ఆకులు క్రిస్పీగా కరకరలాడేలా మారే వరకు నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, కరకరలాడే కరివేపాకును మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఘుమఘుమలాడే కరివేపాకు కారం పొడి సిద్ధమైనట్లే.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తాజా కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇందులో ముందుగా ఉడికించి ముక్కలు చేసుకున్న చికెన్ వేసి, మీడియం మంట మీద ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి.
-ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు కారం పొడి వేసి చికెన్ ముక్కలకు మసాలా పట్టేలా బాగా కలపాలి. మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
