Latest Updates
-
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం -
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
చలికాలంలో నువ్వులు తింటే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా వెజిటబుల్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా, రుచిగా తయారు చేసుకోండిలా -
బంపర్ ఆఫర్ అంటే ఇదే.. రీఛార్జ్ తో పాటు ఫ్రీగా రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్ ఇస్తున్న BSNL -
చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే! -
మధ్యాహ్న భోజనానికి బెస్ట్.. వంకాయ మునగకాయ మసాలా 10 నిమిషాల్లోనే చేయండిలా.. -
ఎసిడిటీ, గ్యాస్ వేధిస్తున్నాయా? ఈ 5 ఇంటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం! -
ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్ కోసం త్వరగా అయిపోయే మసాలా కొబ్బరి అన్నం...పిల్లల లంచ్ బాక్స్ కు బెస్ట్
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి
వీకెండ్ లో లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇంట్లోనే నోరూరించేలా, రెస్టారెంట్ స్టైల్ లో ఒక వెరైటీ వంటకం తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఘుమఘుమలాడే చికెన్ గార్లిక్ రైస్ పర్ఫెక్ట్ గా ఉంటది. వెల్లుల్లి సువాసన, మసాలాల ఘాటు, మెత్తని చికెన్ ముక్కలు, కరకరలాడే కూరగాయలతో తయారయ్యే ఈ వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది. తక్కువ సమయంలోనే ఎంతో రుచికరంగా చికెన్ వెల్లుల్లి రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-10 వెల్లుల్లి రెబ్బలు
-పావు టేబుల్ స్పూన్ పసుపు
-ఒక టేబుల్ స్పూన్ కారం పొడి
-పావు టేబుల్ స్పూన్ జీలకర్ర
-పావు టేబుల్ స్పూన్ ఉప్పు
-ఒక టేబుల్ స్పూన్ నూనె
-సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
-శుభ్రం చేసిన చికెన్ ముక్కలు
-తరిగిన క్యాప్సికమ్
-క్యాబేజీ
-వండిన అన్నం
-రుచికి సరిపడా ఉప్పు
-కొత్తిమీర

తయారీ విధానం
-ముందుగా రోట్లో 10 వెల్లుల్లి రెబ్బలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వీటన్నింటినీ కచ్చాపచ్చాగా దంచుకోండి. ఈ మసాలా ముద్దే మన రైస్ కు అసలైన ప్రాణం పోస్తుంది.
-తర్వాత స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా ముద్దను జోడించాలి. మసాలా మొత్తం చికెన్ కు పట్టేలా బాగా కలిపి, చికెన్ ముక్కలు మెత్తగా ఉడికి నూనె పైకి తేలేవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
-చికెన్ చక్కగా ఉడికిన తర్వాత, తరిగిన క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలను వేసి పెద్ద మంట మీద రెండు నిమిషాల పాటు టాస్ చేయాలి. కూరగాయలు మరీ మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటేనే రుచి అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత పొడిపొడిగా వండిన అన్నాన్ని, రుచికి సరిపడా ఉప్పును వేసి, మసాలా అంతా అన్నానికి పట్టేలా జాగ్రత్తగా కలపాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి, మరో నిమిషం పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే వెల్లుల్లి వాసనతో ఘుమఘుమలాడే, ఎంతో రుచికరమైన చికెన్ వెల్లుల్లి రైస్ రెడీ. నిమ్మకాయ పిండుకుని తింటే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
