Latest Updates
-
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.!
ప్రేమ పంచు....హృదయం విస్తరించు...!
ప్రేమకు భాష లేదు. పరిధులు లేవు. మనం ప్రేమ అనే పదాన్ని ఎపుడు విన్నప్పటికి, అది జంటలు లేదా భార్యా భర్తలు పంచుకునే రొమాన్స్ అని మాత్రమే భావిస్తాము. ప్రేమకు మరో అర్ధంగా రొమాన్స్ అనేదానికంటే కూడా ఈ పదానికి ఎంతో ప్రాధాన్యత వుంది.

అయిదు రకాల ప్రేమ సంబంధాలు
తల్లితండ్రుల ప్రేమ - ప్రేమ కధలన్నికూడా జంటలకు సంబంధించినవే కావు. మీ తల్లితండ్రులతో కల బలమైన సంబంధం కూడా ప్రేమ సంబంధమే. మీరు నేడు ఈ ప్రపంచంలో వున్నారనటానికి వారి ప్రేమ కారణం. లోకంలో ప్రతి వారూ వారి తల్లితండ్రులను ప్రేమించటానికి ఎంతో ఇష్టపడతారు. ఆ ప్రేమ అధికంగా లేదా ఒక మాదిరిగా కూడా వుండవచ్చు. ఉదాహరణకు ఒక కుమార్తె తన తండ్రిని అధికంగా ప్రేమిస్తుంది. అట్లే, ఒక కుమారుడు తన తల్లిని అధికంగా ప్రేమిస్తాడు. ఇది ఎన్నో యుగాలనుండి వచ్చే ప్రేమ. అది పెరిగి పెద్దదవుతూ మనం మరణించేవరకు ఉంటుంది.
స్నేహితుల ప్రేమ - తల్లితండ్రులేకాక, మనకు స్నేహితులు కూడా వుంటారు.స్నేహితులలో మరింత సన్నిహితంగా వుండేవారు కూడా ఉంటారు. వీరిని గురించి మనం జాగ్రత్త వహించటమేకాదు, వారిని అర్ధం చేసుకోవాలి. స్నేహితులు కష్టాలలో వున్నపుడు వారికి అండగా వుండాలి. వారిని ఆ సమయంలో చిరునవ్వుతో ఉంచటమనేది మీరు వారిపట్ల చూపే ప్రేమ.
దైవ ప్రేమ - మీరు దేముడు లేడు...అనే వారు కాకుంటే, దేముడంటే మీకు ఎంతో ప్రేమ వుంటుంది. దేముడు అన్ని చోట్లా ఉన్నాడనే భక్తుల భావన లేదా నమ్మకం వారికి ఎంతో ప్రేమ చూపేలా చేస్తుంది. వయసు, మతం, లింగ భేధం వంటివాటితో సంబంధం లేకుండా, మనమంతా దేముడిని ప్రార్ధించటం, అతడు మనపట్ల వున్నాడని భావించటం చేస్తాము.
వస్తువుపట్ల ప్రేమ - నేను ఈ ఆహారాన్ని ప్రేమిస్తాను లేదా ఈ దుస్తులను ప్రేమిస్తాను అనేది కూడా ఒక ప్రేమ. ఈ ప్రేమలో సాన్నిహిత్యం కూడా ఉంటుంది. ప్రేమించటం లేదా ఆ వస్తువును కలిగి వుండటం అనేది ఒక వ్యక్తి ప్రాధమిక గుణం.
పెంపుడు జంతువుల ప్రేమ - ప్రేమ మానవాళికే పరిమితం కాలేదు. ఒక కుక్క, పిల్లి, పక్షి, కుందేటు మొదలైన మూగ జీవాలు కూడా ప్రేమలు చూపుతాయి. మీరు దగ్గరలేకుంటే మీ పెంపుడు జంతువు, ఎంతో బాధపడుతుంది. అది అలవాటనండి లేదా ప్రేమ అనండి...అదే మిమ్మల్ని మీ పెంపుడు జంతువుకు లేదా జంతువును మీకు దగ్గర చేస్తోంది.
ఇవి ఒక వ్యక్తి జీవితంలో ఉండే కొన్ని రకాల ప్రేమలు. ఇలా చెప్పాలంటే ప్రేమలో ఎన్నో రకాలున్నాయి. అంతేకాని మన పార్టనర్ లేదా జీవిత భాగస్వామి ప్రేమకు మాత్రమే ప్రేమ అనేది పరిమితం కాదు. మీకు తెలిసిన మరింత ప్రేమ సమాచారం మాకు వ్రాసి పంచుకోండి.



Click it and Unblock the Notifications
