Latest Updates
-
నెలసరి ఆలస్యమవుతోందా? కారణం ఒత్తిడి మాత్రమే కాదు..ఈ నిజాలు తెలుసుకోండి! -
వీకెండ్ స్పెషల్: రొటీన్ కు భిన్నంగా ఆంధ్రా స్టైల్ కరివేపాకు తొక్కు చికెన్.. టేస్ట్ చేస్తే వదలరు! -
బుధుడి అరుదైన నక్షత్ర సంచారం..5 రాశుల వారు కుబేరులు కావడం ఖాయం! -
త్వరగా ప్రెగ్నెన్సీ రావాలంటే భార్యాభర్తలు తప్పక చేయాల్సిన 5 పనులు -
మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం?
ఒక మంచి స్నేహితుడిని ఎంచుకోవటం ఎలా?

మీరు గనుక మీ స్నేహితుడిని తెలివిగా ఎంచుకున్నట్లయితే, మీ జీవితంలో మరో మంచి స్నేహితుడిని ఎంపిక చేసుకున్నట్లే. అవకాశాన్ని బట్టి చాలా స్నేహితులు ఏర్పడినప్పటికి, వారిలోని గుణ గణాలతో మరింత మంచి స్నేహితుడిని కూడా కొత్తవారిగా చేసుకోవచ్చు. మరి స్నేహితులను ఎలా ఎంపిక చేసుకోవాలనేదానిపై కొన్ని అంశాలు పరిశీలించండి.
మంచి స్నేహితుడిని ఎంచుకోవడం ఎలా?
1. వారి ప్రవర్తన తోటివారితో పోల్చి చూడండి - తోటి వారితో వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిపై వారి గురించి చెప్పవచ్చు. వారు కనుక ఇతరులగురించి నిరంతరం ఫిర్యాదు చేసేవారైనా లేక, వారు లేనపుడు వారి గురించి మాట్లాడేవారైనా, అటువంటి వారితో మీరు స్నేహం చేయవద్దు. మన వెనుక మనగురించి మాట్లాడే వారితో ఎపుడూ స్నేహం తగదు. అనేది స్నేహ నిబంధనలలో ఒకటి.
2. వారి భాష పరిశీలించండి - అతను మాట్లాడే తీరునిబట్టి అతనితో మీరు స్నేహం చేసి కొనసాగించగలరా అనేది తెలిసిపోతుంది. మీరు కనుక డాబుగా, దర్పంగా ఉండే వారితో మాట్లాడి ఆనందించేవారైతే, మీరు సిగ్గుపడుతూ, మెత్తగా మాట్లాడే వ్యక్తులతో స్నేహం ఆనందించలేరు. మంచి స్నేహితులంటే, ఉమ్మడి అంశాలు కొన్ని ఉండాలి.
3. మీకు గల ఆసక్తులు - మీకు గల ఆసక్తులు పంచుకొనే వారేమో పరిశీలించండి. రొమాంటిక్ సంబంధం అయితే తప్ప మంచి స్నేహితులు కామన్ గా కొన్ని అంశాలు కలిగి వుంటారు. అలాగని ఇద్దరికి ఒకే సినిమా లేదా దుస్తులు నచ్చాల్సిన పనిలేదు. ఇద్దరూ ఒక రకమైన పనులు చేయాలని లేదు. మీ స్నేహం మాట్లాడుకుంటూ ఆసక్తులు కొన్ని పంచుకుంటూ తేలికగా వుంటే చాలు.
4. మీ కోర్కెలు మన్నించుకోండి - మంచి స్నేహితుడంటే, మీకు కావలసింది అతను అర్ధం చేసుకోవాలి.మీకుగల ఆశయాలు, లక్ష్యాలు ఎగతాళి చేయనివాడై వుండాలి. మీ కలలను అపహాస్యం చేసే వాడై వుండరాదు. స్నేహ నిబంధనలలో ఒకటేమంటే, మీరు మీ స్నేహితుడిని ఒక వ్యక్తిగా గౌరవించాలి.
5. మీరు చెప్పేది వినే స్నేహితుడిని పట్టుకోండి - కొంతమంది వారు వారంతట ఏదో ఒకటి చెపుతూనే వుంటారు. మీరుచెప్పేది అసలు వినరు. ఆసక్తి చూపరు. చెప్పినా వినిపించుకోరు. పట్టించుకోరు.మీ జీవితంలోని సంగతులకు వినేవారుండరు. అటువంటపుడు, వారికి మీ పట్ల ఆసక్తి లేదని గ్రహించండి. వారిని కొంచెం దూరంలో వుంచండి.
స్నేహితులను చేసుకోవటం తేలికగానే అనిపిస్తుంది. కాని వారిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మెల్లగా స్నేహాన్ని మెరుగుపరచాలి. అతి త్వరగా స్నేహం పెంచేసుకోవడం కూడా పతనం చేస్తుంది. స్నేహం అనేది ఎంతో మంచి సంబంధం. అనుభవించేదిగా వుండాలి. కనుక తర్వాత పశ్చాత్తాప పడకూడదనుకుంటే, స్నేహితులను జాగ్రత్తగా ఎంపిక చేసుకొని, నిదానంగా వారితో స్నేహ సంబంధం పెంచుకోవాలి.



Click it and Unblock the Notifications