Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
ఆఫీస్ రొమాన్స్ అటకెక్కితే....!
కొద్దిపాటి సరసం ఎవరిని ఇబ్బంది పెట్టదు. పెట్టినప్పటికి అనిపించదు. కాని అది అధికమై వికటిస్తే దానిని ఎలా సరిచేసుకోవాలి? లంచ్ బ్రేక్ లో అడ్డూ ఆపూ లేని సరసాలు. కాఫీ లంటూ కేంటీన్ లో రాసుకు పూసుకు తిరుగుతూ ఒకరికొకరు మెసేజ్ ఇచ్చేసుకోవటాలు. పని ముగిసిందంటే ధియేటర్ లో మకాం పెట్టి నలిపేసుకోవటాలు. ఇదంతా ఆఫీస్ రొమాన్స్ గా బాగానే వుంటుంది. అయితే, అది అధికమై చివరకు విషాదం చూపితే దానిని ఎలా సరిచేసుకోవాలనేది పెద్ద అంశంగా తయారైపోతుంది.

ఆమెతో కలసి తిరగటం లేదా ఆమెను చూడటం బాధాకరమే. అయితే మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి. ప్రతీకార చర్యలు చేయకండి.ఆమె లేదా అతని పనికి ఆటంకాలు కలిగించకండి. అలా చేస్తే మీ సంబంధం మరింత పాడవుతుంది. పైగా అందరూ వేలెత్తి చూపే అవకాశం వుంటుంది. నా మాజీ పని ప్రదేశంలో కనపడుతుంది అని ఆశిస్తూనే మీరు పని మొదలుపెట్టండి దానితో మీరు అనవసర ఆందోళన తగ్గించుకొన్నవారు అవుతారు. ఏవైనా అనుకోని సంఘటనలు ఆమెతో లేదా అతనితో సంభవించాయా? ప్రశాంతంగా వుండండి. అలా వుంటే అది మీకు అనుకూలం అని భావించండి. అంతే కాదు మరోమారు సంబంధం మెరుగుపడే అవకాశం కూడా వుంటుంది.
సంబంధాలు చెడిన తర్వాత ఆమె ఎక్కడో వుంటే మీకు అనవసర ఆందోళనగా వుంటుంది. కాని ఆమె మీ ఆఫీస్ లోనే పనిచేస్తుంటే, కనపడుతోందన్న వాస్తవం మిమ్మల్ని కొంత ఊరట కలిగేలా చేస్తుంది. ప్రొఫెషనల్ గా వ్యవహరించండి. అనవసరంగా ఆమెను పనిలోనించి తప్పించి అసౌకర్యం కలిగించకండి. అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పని ప్రధానం అని, మీకు ఆమెతో గల సంబంధం రెండవ అంశమని గ్రహించండి. మీ పని మీరు చేసుకుంటూ మీ గౌరవానికి భంగం కలుగకుండా చేసుకోండి. ఎన్నో ఏళ్ళనుండి పని చేస్తూ ఈ అంశంపై మీరు చెడ్డ పేరు తెచ్చుకోకండి.
పని ప్రదేశం బయట, మీ భావావేశాలు ప్రదర్శించుకోండి. అనవసరంగా మీ ఉద్యోగాలను వదిలేయటం వంటివి చేయకండి. అవి దీర్ఘకాలంలో మీ కెరీర్ కు చెడు కలిగిస్తాయి. అవసరం అనుకుంటే డిపార్ట్ మెంట్ మార్పు కోరండి. తోటి ఉద్యోగస్తులు మీ సంబంధంపై గుస గుస లాడతారు. ఎలా వ్యవహరించాలి? సాధారణంగా మీ సంబంధం అందరికి ఎపుడో ఒకపుడు తెలిసిపోతుంది. అనవసరంగా మీ అంతట మీరు సోషల్ నెట్ వర్కులలో వేసి పబ్లిక్ చేసుకోకండి. ఆమెతో పూర్తిగా సంబంధాలను తెంచుకున్నట్లే అని ఎవరికి చెప్పకండి.
మీ మాజీ మరో ప్రియుడితో వ్యవహారం మొదలుపెట్టిందా? మీరు ఆవేశ పడకండి. డిగ్నిటీ తో వ్యవహరించండి. ఆమెతో సంబంధం తెగిపోలేదనేవిధంగా నటించటం సరిగా మిమ్మల్ని భావింపజేయదు. అటువంటపుడు మీకుగల సెలవులు వాడండి. మరల మీ భావనలు మారిన తర్వాత ఆఫీస్ లో అడుగుపెట్టి సమస్యను మరో కోణంలో చూడండి.



Click it and Unblock the Notifications
