Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
పెళ్ళంటే భయం....పడకంటే ఇష్టం!

డేటింగ్ కు సిద్ధ పడినప్పుడు ఎంచుకునే భాగస్వామిని పెళ్ళి కారణంగా కూడా ఎంచుకుంటారు. కాని, వివాహ ప్రతిపాదన రాగానే, భయం పట్టుకుంటుంది. చిన్న వయసు వారిలో పెళ్ళి అంటే భయం సహజమే. కొంతమంది వివాహాన్ని, సమాజంలో ఒక ఉచ్చు వంటిదని భావిస్తారు.
మరి అసలు వివాహం అంటే భయపడాల్సిన అవసరం ఉందా? పెళ్ళి అంటే భయపడేందుకు కారణాలేమిటి? పరిశీలిద్దాం.
భాధ్యతల భయం - పెళ్ళి చేసుకుంటే వచ్చిపడే కొత్త రకం భాధ్యతల బరువును గురించి చాలామంది పురుషులు, స్త్రీలు భయపడతారు. పెళ్ళికి ముందు, వారు పెద్దవారి భాధ్యతలో ఉంటారు. పెళ్ళి తర్వాత, వారి భాధ్యత వారు తీసుకోవడమే కాక, వేరే ఇతరుల భాధ్యతకూడా తీసుకోవలసి వస్తుంది. అప్పటివరకు కేర్ ఫ్రీగా వుండే జంటలు పెళ్ళి అయిందంటే, భాధ్యతగల పురుషుడు, స్త్రీ గా మారిపోతారు.
సర్దుబాట్ల భయం - వివాహ జీవితం సక్సెస్ కావాలంటే, ప్రధానంగా సర్దుబాట్లు వుండాలి.జీవిత భాగస్వామితో, కొత్త వాతావరణంతో, బావమరుదులు, అత్త, మామలు వంటివారితో, సర్దుబాటు చేసుకోగలగాలి. సాధారణంగా అత్తమామలతో సర్దుబాటే ప్రత్యేకించి స్త్రీలు భయపడతారు. దానికి కారణం వీరే అధిక సమస్యలు తెచ్చి పెట్టేది కూడాను. కాని అది అందరి విషయంలోను వుండదు. ఏదేమైనప్పటికి కొత్త కుటుంబంలో సర్దుబాటుకు కొంత సమయం తీసుకుంటుంది. కాని తప్పక సర్దుకుంటారు. సమయం గడిచిందంటే, బాగా సంబంధాలు వికసిస్తాయి.
కలసి నిర్ణయాలు - పెళ్ళి తర్వాత నీవు లేదా నేను అనేది వుండదు. మనం ....అనుకోవాలి. ఒక్కరుగా నిర్ణయం తీసుకోరాదు. సింగల్ గా నిర్ణయం తీసుకుంటే, అది కొన్ని మార్లు సంబంధం పాడుచేస్తుంది. అంశం ఆర్ధికం, లేదా మానసికం ఏదైనప్పటికి ఒకరితో మరిఒకరు కలసి నిర్ణయం తీసుకోవాలి. అంటే దీని అర్ధం మీకు స్వేచ్ఛ ఉండదని కాదు. అది ఒకరి భావాలను మరొకరు లేదా ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవించటం.
చెడు పెళ్ళి సంబంధం - కొంతమంది జంటలకు తమ సమీప బంధువులలోనే కొన్ని చెడిపోయిన వివాహ జీవితాలు కనపడతాయి. అదే కారణంగా కూడా వీరు కొంత భయపడతారు. అయితే, అన్ని సంబంధాలు చెడుగా వుండవు. ఆనందిస్తున్న జంటలు కూడా అధికంగానే వున్నారు. వాటిలో మీది ఒకటిగా భావించి పెళ్ళి అంగీకరించవచ్చు.
తన పార్టనర్ మారిపోతాడన్న భయం - పెళ్ళి తర్వాత మార్పులు వస్తాయన్న సాధారణ భయం కూడా వుంటుంది. భాగస్వామి మానసికంగా మారతాడనేదే కాదు, తర్వాత శారీరకంగా కూడా మారి అయిష్టత చూపుతాడనే భయం వీరికుంటుంది. ఈ లోకంలో ప్రతిదీ మారేదే అని గ్రహించండి. ఏదీ శాశ్వతంకాదు. మార్పు రానిది, మరింత పెరిగేది మీరు మీ భాగస్వామితో పంచుకునే ప్రేమ మాత్రమేనని గుర్తించండి.
ఈ కారణాలుగా మీరు వివాహానికి భయపడవద్దు. ఇవన్ని చిన్నపాటి కారణాలు. వీటిని కొద్ది ప్రేమ, అవగాహనలతో సరిచేయవచ్చు. కనుక, సరైన జీవిత భాగస్వామి దొరికితే, ఆనందంగా వివాహం చేసుకోండి.



Click it and Unblock the Notifications
