Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
డైవోర్స్ తర్వాత పురుషులు ఎలా భావిస్తారు?

నకిలీగా ఏదో పైపైన సర్దుబాటులు చేసుకోవడం కుదరని పనే. డైవోర్స్ కేసులలో ఈ నకిలీ సర్దు బాట్లే ప్రధానంగా కనపడతాయి. సర్దుబాట్లే కాదు, మరిన్ని కారణాలుగాకూడా వుంటాయి. అవగాహనాలోపం, పార్టనర్ అసమర్ధత, నమ్మక ద్రోహం మొదలైనవి. కాని డైవోర్స్ అనేది పరస్పరం అయితే, సమస్యే లేదు. అది ఇద్దరికి బాధాకరమే. రెండు విభిన్న మనస్సులు ఒకరితో ఒకరు సర్దుకోకపోతే, వారికి డైవోర్స్ మాత్రమే శరణ్యం. మరి డైవోర్స్ విషయంలో పురుషులు ఎలా వుంటారనేది చూడండి.
నేను హాయిగా వున్నాను - మొదటగా, పురుషుడు డైవోర్స్ తర్వాత తాను సంతోషంగా ఏ భాధ్యతలు లేకుండా స్వేచ్ఛగా వున్నానని భావిస్తాడు. ఒక్కడే కనుక ఎలా కావాలంటే అలా తిరిగేస్తాడు. పురుషులు ఒకరి కింద వుండటానికి అంగీకరించరు. ఒక చెడు వివాహ సంబంధంనుండి బయటపడితే వారు నిజంగానే స్వేచ్ఛ భావిస్తారు. తాగినా, తిన్నా, తిరిగినా ఏ స్నేహంలో తిరిగినా అడిగేవారుండరు.
మరి వంట సంగతి? పాపం ఇది కష్టమే. భార్య లేకుంటే పురుషుడికి వంట కష్టం. మంచి ఆహారం తినలేడు. కొద్దిరోజులు హోటళ్ళు , రెస్టరెంట్లు తిరిగినా ఎక్కడో అక్కడ ఇంటిపట్టున ఉన్నపుడు మాత్రం అతను ఆహారాలకు తడుముకోవలసిందే. ఇబ్బంది పడుతూ సర్దుబాటు చేసుకోవలసిందే.
అంతేకాదు, వంట సంగతి ఎలావున్నా, అతను ధరించే దుస్తులు కూడా ఇబ్బంది పెడతాయి. ఒక మెయిడ్ సర్వెంట్ అవసరమవుతుంది. డైవోర్సు తీసుకోగానే మొదటగా వచ్చే ఆలోచన మెయిడ్ సర్వెంట్ పెట్టుకోవాలని. ఇంటిని, తమ దుస్తులను ఇంతకాలం నిర్వహించిన మాజీని మరచిపోతాడు. డైవోర్స్ తర్వాత ొకసారి గతంలోని బాచిలర్ రోజులకు వెనళ్ళిపోతాడు. స్నానం చేయగానే పాపం ఈ డైవోర్సీ కి దుస్తులు గుర్తుకు వస్తాయి. అల్మరా అంతా వెతుక్కోవడం, వేసిన దుస్తులే వేసుకుంటూ వుండటం చేయాలి.
విడాకుల తర్వాత పురుషులు ఒక్కరే. ఏ మహిళతో తిరగాలన్నా స్వేచ్ఛ. డైవోర్స్ తర్వాత డేటింగ్ తేలిక. మరోమారు జీవితమంతా ఒంటరిగా వుండలేరు. కనుక అప్పటివరకు ఎదురుచూస్తున్న గాళ్ ఫ్రెండ్ కు ఆహ్వానం పలుకుతారు. ఎవరికి వీరు భాధ్యులుగా వుండరు? ఒకసారి స్వేచ్ఛ లభించిన తర్వాత, వీరు తమ భార్యల బాధలను అనుభవించరు. భార్య వుండగా, ప్రతిరోజూ ఎన్నో ప్రశ్నలు...వాటికి తగిన జవాబులు చెప్పటంగా వుండేది. ఇక డైవోర్స్ తర్వాత, ఎక్కడున్నా అడిగేవారుండరు. మరీ అవసరపడితే, ఆఫీస్ కేంటీన్ లో తినేయటం, ఒక ప్యాక్ ఇంటికి తెచ్చుకొని చల్లగా తినేయడం కూడా చేయాలి?
డైవోర్స్ ఇచ్చిన పురుషులు భావించే వాటిలో ఇవి కొన్ని అంశాలు. డైవోర్స్ మంచి కొరకే అయినా, ఆశించనివైనా, చెడు కొరకైనా, ప్రధానంగా పురుషుడు ఎదుర్కొనవలసిన అంశాలివి.



Click it and Unblock the Notifications
