Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
ప్రియుడి పెళ్ళి ...ప్రియురాలికి సంకటం?
కాలేజ్ రోజులలో అతనితో కలసి ఎన్నో ముచ్చట్లు, వర్షం రాత్రులు, ఆనంద సరాగాలు. అన్నీ అయ్యాయి. కాని విధివశాత్తూ విడిపోయారు. ఎక్కడెక్కడో కొంతకాలం గడిచిపోయింది. అయితే ఉన్నట్లుండి ఆ బెస్ట్ ఫ్రెండ్ నుండి తన వివాహ ఆహ్వానం అందింది. ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాలా? లేక వెళ్ళకుండా ఉండాలా? వెళితే, అక్కడకు కాలేజ్ గ్యాంగ్ అంతా దిగి గతంలో తమకు గల సంబంధాన్ని, కలిసి మెలసి తిరగటాన్ని ప్రశ్నిస్తారు.

అంతేకాదు, అతనికి కాబోయే భార్యకు కూడా తను ఎవరో గతంలో అతనితో కలసి ఎలా తిరిగిందో తెలిసిపోతుంది. అతనికి కూడా ఆమె నుండి ఈ పరిస్ధితులలో కొంత నష్టం జరుగవచ్చు. అటువంటపుడు ఏం చేయాలి. ఈ పరిస్ధితినుండి ఎలా బయటపడాలి? పెళ్ళికి హాజరు కాకుండా మానేస్తే అతను ఎంతో బాధ పడతాడు. ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి అనేది పరిశీలించండి.
1. మీ బెస్ట్ ఫ్రెండ్ కాబోయే భార్య లేదా కొత్త ప్రియురాలిని ఏ కారణం లేకుండా ద్వేషించకండి. ఆమె మీకు స్నేహితురాలు కాకపోవచ్చు. అయినప్పటికి ఏవో కొద్ది మాటలు మాట్లాడేందుకు సిద్ధం అవుతుంది. అటువంటపుడు మీరు ఆమె పై బ్యాక్ ఫైర్ కారాదు. గతంలోని మీకుగల అతని సంబంధాన్ని చెప్పరాదు. చెప్పి అతనికి కోపం తెప్పించరాదు.
2. కలసి మెలాసి సాగండి - వెళ్ళటానికే సిద్ధం అయిపొండి. అటువంటి బెస్ట్ ఫ్రెండ్ వివాహపు ప్రత్యేక రోజు మరల రాదని గ్రహించండి. అతని కుటుంబంలోని సభ్యులు, ఇతర స్నేహితులతో వివాహ ఏర్పాట్లలో మీరు కూడా ముణిగిపొండి. ఈ రకంగా మీరు బిజీగా ఉండాలి. అదే సమయంలో మీ మూడ్ ఆహ్లాదంగా ఉంచుకోండి.
3. ఫ్రెండ్ భార్యతో మాట్లాడండి - సంభాషణ మొదలు పెట్టటం ప్రధానం. ఏదో రకంగా మాటలు మొదలు పెట్టి ఆమెకు మీ ఫ్రెండ్ గురించిన చిన్న రహస్యాలనుండి ఆమె వెడ్డింగ్ చీర సరిచేయటం వరకు చేయండి.
4. స్నేహితులవండి - మాట్లాడటం మొదలెడితే, ఇక స్నేహితులవటం కష్టం కాదు. ఆమె స్నేహితులను, కుటుంబ సభ్యులను కలిసి ఆమె గురించిన సమాచారం సేకరించండి. ఆమెకు ప్రత్యేక పార్టీ ఇవ్వండి. ఆమె సంతోష పడేలా చేయండి.
5. మీ బెస్ట్ ఫ్రెండ్ మరియు పెళ్ళి కొడుకు అయిన అతనిని నిర్లక్ష్య పరచకండి. అతను వేరే వారిని పెండ్లాడుతున్నాడన్నది వాస్తవమే కాని అంగీకరించాలి. అది అతనికి మంచిదని భావించండి. అతని పురుష స్నేహితులతో అతనికి ఒక పార్టీ ఇప్పించండి. స్నేహాన్ని కాపాడుకోటానికి ఇది మంచి సమయం.
6. మీ బెస్ట్ ఫ్రెండ్ మరియు గతంలోని మీ మాజీ వేరే స్త్రీని పెళ్ళి చేసేసుకుంటున్నాడన్న బాధ మీలో ఉండరాదు. కనుక బాగా అలంకరించి ఆనందంగా బయటకు కనపడండి. పెళ్ళి కొడుకు బెస్ట్ మహిళా ఫ్రెండ్ గా అందరి కళ్ళలో పడండి.
7. ఇక మీ భవిష్యత్ జీవితాలకు మీ ఫ్రెండ్ మేరేజ్ డే ఎంతో విలువైనది. గతంలో అతనితో గడిపిన మధురక్షణాలను మీరు గుర్తు తెచ్చుకోండి. వాటిని పదిల పరచుకోవడం మీకు ఎంతో విలవైనదిగా ఉంటుంది. అవన్ని పదిల పరచుకుంటే, అతనితో ముందు జీవితం కూడా స్నేహ పూరితంగా కొనసాగిపోతుంది.
8. సింగల్ గా ఉండే ఆనందం పొందండి - పెళ్ళితో కొన్ని కొత్త సంబంధాలు, భాధ్యతలు ఏర్పడతాయి. ఎంతో సహనం కావాలి. అటువంటి పరిస్ధితి మీకు కూడా వస్తుందనే భావించండి. కాని ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉన్నారు. కనుక ఒంటరి జీవితాన్ని బాగా ఆనందించేయండి.



Click it and Unblock the Notifications
