Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
పెళ్ళి చేసుకుంటున్నారా? కొంచెం ఆలోచించండి!
మీరు పెళ్ళి చేసుకోవాలనుకున్నా లేక ఇటీవలే వచ్చిన సహజీవన ఒప్పందం చేసుకోవాలన్నా కొంచెం ఆలోచించండి.పెళ్లాడేముందు కొన్ని ప్రధాన అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. అవి కుటుంబ సంబంధాలు, ఆర్ధికతలు, పిల్లలు, జంటల ఆశయాలు అసలు వారు వివాహం నుండి ఏం ఆశిస్తున్నారనేవి తెలుసుకోవాలి.

ఈ అంశాలపై కొన్ని సంస్ధలు సర్వేలు కూడా నిర్వహించాయి. అయితే, సర్వేలో ప్రశ్నలను ఎదుర్కొంటున్నవారు వేసిన ప్రశ్నలకు నిజాయతీగల సంబంధానికి ఖచ్చితమైన అభిప్రాయాలు తెలుపలేకపోయారు. ఈ సర్వేలో జంటలు ఆర్ధికంగా బాగుండి ఆస్తులు సైతం కూడబెట్టుకుంటే, పెళ్ళి చేసుకొని తమ కుటుంబాలను విస్తరించుకుంటే, అసలు పిల్లలు కావాలా వద్దా, మతపర అభిప్రాయాలు ఏమిటి, ఖర్చుల అలవాట్లు ఎలా? వారి కెరీర్ ప్రణాళికలు ఏమిటి మొదలైన అంశాలలో సర్వే సాగింది.
ఇక వివరంగా చెప్పాలంటే....సంబంధం ఏర్పరచుకునే ముందు దిగువ అంశాలపట్ల మీరు ఒక అంగీకారానికి రండి.
ఆర్ధిక అంశాలు - మీ ఇద్దరికి ఉన్న ఆస్తులేమిటో పూర్తిగా తెలుసా? ఈ ఆస్తులు లేదా ఆర్ధికతలు ఎలా పంచుకుంటారు. ఇద్దరిలోనూ పొదుపు అలవాటు ఒకే తీరుగా ఉందా? లేక ఒకరు పెన్షన్ స్కీములో చేరాలనుకుంటే మరొకరు కారు కొని ఆనందించాలనుకుంటున్నారా? జాయింట్ ఎకౌంట్ మెయిన్టెయిన్ చేయాలనుకుంటున్నారా?
కుటుంబ సంబంధాలు - రెండువైపుల కుటుంబాలతోను మీరు సంబంధాలు ఎలా నిర్వహిస్తారు. వారితో నిరంతరం టచ్ లో ఉంటారా? ప్రేమగా ఉంటారా? మీ మధ్య విభేధాలున్నాయా?
పిల్లల విషయంలో - మీకు పిల్లలు కలగాలని కోరుకుంటున్నారా? వారిని ఎలా పెంచుతారు. ఏ రకమైన కుటుంబ విలువలు వారికిస్తారు? ప్రయివేటు విద్యా లేక ప్రభుత్వ సంస్ధల విద్యా?
మతపరంగా మీ అభిప్రాయాలు ఏమిటి? పిల్లలకు ఏ రకమైన మత విలువలు కల్పిస్తారు. పూర్తిగా సాంప్రదాయకమా లేక ఆధునిక విలువలా? మందిరానికి వారానికోసారా లేక ప్రతిరోజూనా?
సెలవులు వినోద కార్యక్రమాలు - మీ విశ్రాంతి సమయంలో ఇద్దరూ ఒకే రీతిలో పని చేస్తారా లేక ఎవరి ఇష్టాలు వారివా? ఇద్దరికి ఒకే ఇష్టమైన హాబీలు ఉన్నాయా? మరి మీ ఐడియా అయిన బీచ్ లో సెలవలు గడుపుతారా? లేక మీ పార్టనర్ ఇష్టం మేరకు రిసార్టులకు వెళతారా?
జీవన విధానం - ఏరకమైన జీవన విధానం మీరు కోరుతున్నారు? నగరంలో ఉండాలనా లేక నగరానికి దూరంగా గ్రామాలలో ఉండాలనా?
ఖర్చులు - మీరు కొనే వస్తువులు బూట్లు, దుస్తులు మొదలైనవి ఖరీదైన బ్రాండెడ్ కొనాలనా లేక సాధారణ వస్తువులా? పేకాటలు, క్లబ్ లు మొదలైనవి సీక్రెట్ గా వెళ్ళాలనుకుంటున్నారా?
ఉద్యోగాలు - ఇద్దరకు సరి సమానమైన ఉద్యోగాలున్నాయా? లేక మీకున్న ఉద్యోగాలతో రాజీ పడాలనుకుంటున్నారా? మీకు వచ్చే జీతాలతో జీవితం ఆనందంగా ఉంటుందని నిర్వహించగలమని భావిస్తున్నారా? పార్ట్ టైం ఉద్యోగాలకు చూస్తున్నారా?
జీవనం సాంప్రదాయకంగా ఉంటే చాలా లేక ఆధునిక జీవన శైలి ఆచరించి హంగు ఆర్భాటాలతో జీవించాలని చూస్తున్నారా? ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మొదలైనవి ఎవరు చెల్లించాలని అనుకుంటున్నారు?
నిజాయతీగా తెలుపుకోండి - మీ మీద ఆధారపడి జీవిస్తూ మీ సహాయ సహకారాలను అన్నివిధాలా ఆశించేవారు ఉన్నారా?



Click it and Unblock the Notifications
