Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
పిల్లలు పుడితే సంతోషం ఎలా వస్తుంది?
మీరు తల్లి తండ్రులు కాబోయే సమయంలో, మీ జీవితంలో అంతా మార్పు వచ్చేస్తుంది. బిడ్డ పుడుతున్నాడంటే, కుటుంబంలో అందరికి ఆనందంగా ఉంటుంది. తల్లి లేదా తండ్రి అవబోయే ముందు మీకు ఒక స్వతంత్ర గుర్తింపు ఉంటుంది. కాని, ఇపుడు మొదట మీరొక తల్లి లేదా తండ్రి తర్వాతే మీరు. మీ బిడ్డను మొదటిసారి పట్టుకున్నపుడు మీకు ఎంతో హాయి కలుగుతుంది. ఇంతకంటే మించిన ఆనందం లేదనిపిస్తుంది. ఒక బిడ్డ మీ జీవితాలలో ఆనందాన్ని నింపుతున్నాడనేందుకు ఎన్నో నిదర్శనాలుంటాయి. బిడ్డల పెంపకం చాలా కష్టంతో కూడినది అయితే, ప్రపంచంలో ఎంతో ఆనంద అనుభూతి. కనుక ఒక బిడ్డ కుటుంబంలోకి ఆనందాలను ఎలా తెస్తాడనేది పరిశీలించండి.

తల్లి - తన కడుపులో షుమారుగా పది నెలలు మోసి పుట్టిన తర్వాత ఆ బిడ్డను చూసి ఆనంద బాష్పాలు కారుస్తుంది. తన జీవితం ధన్యమైందనుకుంటుంది. చాలా సార్లు, తన అవసరాలకంటే, కుటుంబ అవసరాలకంటే కూడా ముందు బిడ్డ ఆలనా పాలనా చూస్తుంది. తన బేబీ అవసరాలను తీర్చటంలో గల సంతోషం ఆమెకు మరెందులోనూ ఉండదు. మీకు పుట్టిన బిడ్డ మీ చేతులలో కనపడుతూంటే, ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది.
తండ్రి - సాధారణంగా తండ్రులు పిల్లలంటే ముందుగా ఇష్టపడరు. కాని వారు తండ్రి అయి తమ స్వంత బిడ్డను చూస్తూంటే, వారి ప్రపంచం మారిపోతుంది. పిల్లవాడి బాగోగులకై ఆర్ధికంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ ప్రణాళికలు వేస్తారు. ఒకప్పుడు పరిపక్వత లేని యువకుడు నేడు ఒక బిడ్డకు తండ్రిగా భాధ్యతాయుతంగా ఉంటాడు. బిడ్డ నవ్వితేచాలు, ఆనందిస్తారు. వారి ఆలోచనలన్ని కుటుంబంలో కొత్తగా వచ్చిన బిడ్డ చుట్టూ తిరుగుతాయి. అప్పటివరకు తాను చేయనిపనులను తన బిడ్డ కొరకు ఆనందంగా, ఒక సవాలుగా స్వీకరించి చేస్తాడు.
కుటుంబ ఇతర సభ్యులు - కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా కొత్తగా వచ్చే చిన్ని సభ్యుడికి స్వాగతం చెపుతూంటారు. ఒక బిడ్డ ఇంటిలోని ప్రతి ఒక్కరికి ఆనందం కలిగిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక సంబంధం పెరుగుతుంది. ఒక తండ్రి గ్రాండ్ ఫాదర్, ఒక అన్నకు తమ్ముడు, ఒక అక్కకు తమ్ముడు అలా సంబంధం ప్రతి ఒక్కరికి పెరుగుతుంది. భవిష్యత్ తరానికి బుజ్జిగాడు నాంది....అంటారు. అంతకు ముందు లేని సంతోషం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. మీ జీవితం మరింత మెరుగయ్యేటందుకే మీ బిడ్డ దోహదం చేస్తుంది.



Click it and Unblock the Notifications
