Latest Updates
-
టేస్ట్ కు టేస్ట్, హెల్త్ కు హెల్త్.. అప్పటికప్పుడు వేసుకునే కరకరలాడే మొక్కజొన్న దోశ -
బంగారం రేట్లు మరింత తగ్గుతాయా? వైరల్ అవుతున్న జ్యోతిష్యుడి అంచనా! -
ఈరోజు రాశి ఫలాలు (24.03.26): మంగళవారం నాడు ఈ రాశుల వారికి ధనయోగం! -
కామద ఏకాదశి 2026 తేదీ, పూజా ముహూర్తం, విష్ణుమూర్తి ఆశీస్సులు పొందే శక్తివంతమైన మంత్రం -
అన్నంలోకి అమృతంలా ఉండే పెరుగు వంకాయ గ్రేవీ.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ! -
నోటికి పండగలా అనిపించే దహీ సమోసా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
భారత్ లో పెరుగుతున్న రెండో పెళ్లి ధోరణి..జీవన్ సాథి సర్వేలో ఆసక్తికర నిజాలు -
వంకాయ-బంగాళదుంప గుజ్జు..ఇడ్లీ,దోశలకు సరైన జోడి! -
డైట్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు తినాల్సిన 4 సూపర్ స్నాక్స్ ఇవే! -
అచ్చమైన పల్లెటూరి స్టైల్ పచ్చి మామిడికాయ చట్నీ..చపాతీ, రోటీ, అన్నం దేనిలోకైనా అదుర్స్!
అనురాగం పూత వేస్తే...ఆనందం విరిసింది!
ఆనందంగా, సంతోషంగా ఒకరితో మరి ఒకరు చెట్టా పట్టాలేసుకొని తిరిగే జంటలు అరుదుగా కనపడుతూంటారు. వివాహం అయి కొంతకాలం గడిచిందంటే వారి సంతోషాలు వెనుకపడతాయి. సంతోషంగా తిరిగే భార్యాభర్తలు త్వరగా కనపడరు. నానాటికి వారి సంఖ్య తగ్గిపోతోంది. మరి మీరు కనుక హేపీగా తిరిగే జంటలు కనిపిస్తే తప్పక చూసి ఆనందించండి.మరి వారిని అంటే హేపీ జంటలను కనుగొనటం ఎలా?

వివాహమై ఆనందంగా ఉన్న జంటల లక్షణాలు ఎలా ఉంటాయంటే?
పూర్తిగా ప్రశాంతంగా - వివాహం అయిన తర్వాత మొదటి సారి వారి ముఖాలలో కనబడేది భధ్రత. ఒకరితో ఒకరు ప్రశాంతంగా ఉంటే, వారి ముఖాలలో కల సుఖం కనపడుతుంది. వారు తన భాగస్వామిని మరెవరైనా చూస్తున్నారా? అంటూ అటూ ఇటూ చూడరు. వారిలో అసూయ అనేది స్వార్ధం అనేది కనపడవు. ఒకరితో ఒకరు సౌకర్యంగా ఉంటారు.
ప్రశాంతత లో నిశ్శబ్దం - వారు ఒకరితో ఒకరు కలసి ఉన్నప్పటికి మౌనంగా హాయిగా ఉంటారు. మాటలకు వెతకటం వారి మధ్య ఉండదు. ఒకరితో ఒకరు కలసి ఏ మాటలూ లేకనే ఆనందంగా చేతులు పట్టుకొని కూర్చుంటారు.
కలసి మెలసి పని చేస్తారు. - ఆనందపు జంటలు ఎల్లపుడూ కలసి పని చేస్తారు. కలసి వ్యాయామ తరగతులకు హాజరవుతారు. కలసి సినిమాలు చూస్తారు. కలసి షాపింగ్ చేస్తారు. ఇది అంతా వారు ఒకరి సాంగత్యం మరి ఒకరు ఇష్టపడుతున్నారనేదానికి నిదర్శనంగా ఉంటుంది. కలసి సమయం గడపటం వారికి ఎంతో ఇష్టం.
వచ్చి తీసుకెళ్ళు - భర్త ఎంత ఆలస్యమైనప్పటికి ఎన్ని ట్రాఫిక్ జామ్ లు ఉన్నప్పటికి ఆమెను ఆఫీస్ వద్ద కు వచ్చి పికప్ చేస్తాడు. ఆమెను చూడగానే అతని బాధలు మరచిపోతాడు. అదే విధంగా భార్య కూడా ఎంత దూరమైనా సరే తన భర్తకు మధ్యాహ్న భోజనం అందిస్తుంది.
అనుకూలతలు....లేకపోవటాలు - ఆనందకర జంటలు అంటే అన్ని విషయాలలోను ఒకరితో మరి ఒకరు ఏకీభవించాల్సిన పని లేదు. ఉదాహరణకు హాబీలు పంచుకోవటం...ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఒకరు చేసిందే మరి ఒకరు చేయాలని లేదు. అతనికి గోల్ఫ్ ఆడటం ఇష్టం, ఆడనివ్వండి. గ్రౌండ్ లో ఉండి ఛీర్స్ చెప్పండి.
జంటలు ఆనందంగా గడిపేయటం అంత తేలికకాదు. కాని అటువంటి ఆనందపు జంటలు కనపడితే....అసూయపడకండి, వారి ఆనందాల వెనుక రహస్యం తెలుసుకోండి.



Click it and Unblock the Notifications











![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)