Latest Updates
-
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య!
మీ స్నేహితుడికి మీరంటే...అసూయా?
అసూయ అనేది పుట్టటానికి కారణాలు అనేకం ఉంటాయి. వాటిలో అందమైన అమ్మాయితో డేటింగ్ లేదా మంచి జీతం, లేదా స్నేహితులంతా మిమ్మల్నే కోరటం....మొదలైనవి మీ ఫ్రెండ్ కి అసూయ పుట్టించేలా చేస్తాయి. స్నేహితులు అసూయ భావించటం మొదలుపెడితే, మీ ఇద్దరి మధ్య సంబంధాలు చెడిన తర్వాత గాని మీకు ఆ విషయం తెలియదు. కొంతమంది స్నేహితులు తమ అసూయను బాహాటంగా బయట పెట్టేస్తారు. కాని చాలామంది వారి గుండె లోతుల్లో దానిని ఉంచేసి బయటకు ఏ మాత్రం లేకుండా స్వీట్ గా ప్రవర్తిస్తారు. కనుక మీ మంచి మిత్రుడు మీ పట్ల అసూయతో ఉన్నాడనేందుకు నిదర్శనం ఎలా చూపాలి?
ఒక మంచి స్నేహితుడు మన పట్ల అసూయతో ఉన్నాడనేందుకు చిహ్నాలు!
తప్పించుకు తిరగడం - ఒక స్నేహితుడికి బాగా అసూయ ఉంటే, అతను లేదా ఆమె మిమ్మల్ని వీలైనంతమేరకు తప్పించుకు తిరుగుతారు. ఎందుకంటే అతను మీరు జీవితంలో పైకి రావటం చూడలేడు కనుక. నేను చాలా బిజీగా వున్నాను. నీ వద్దకు రాలేను అనేది సాధారణంగా అటువంటి వారు చెప్పే సాకుగా ఉంటుంది.

నటన - కొంతమంది పెదవులపై చిరునవ్వు మీరు ఆనందంగా ఉన్నపుడు సహజంగా చూపుతారు. అయితే, ఈ చిరునవ్వు అబద్ధం అని మీకు అనిపిస్తూ ఉంటే, అతను మీ పట్ల అసూయతో ఉన్నట్లే. అతను సంతోషంగా ఉన్నానని చెపటం మీ పట్ల నవ్వు ప్రదర్శించటం అంతా బూటకంగా భావించండి.
మిమ్మల్ని తక్కువ చేయడం - మీరంటే అసూయపడే కొంతమంది స్నేహితులు మీతో పోటీకి దిగుతారు. ఇతరులముందు మిమ్మల్ని తక్కువచేసి చూపటమే వారి లక్ష్యంగా ఉంటుంది. ఇది అసూయ గుణం ఉండే వారికి సర్వసాధారణ గుణంగా భావించాలి. అతనికి లేదా ఆమెకు చిన్నతనం లేదా ఇన్ ఫీరియారిటీ కలిగి వుందనేందుకు ఇది సాధారణం.
ప్రతి దానికి వ్యాఖ్యలు - మీ మంచి మిత్రుడు అసూయా పరుడు అతను చెప్పిందే ఎల్లపుడూ సరైనదని, మీరు ఏది చెప్పినా అది పూర్తి తప్పు అని కూడా సూచించేందుకు ప్రయత్నిస్తాడు. చిన్న అంశాలలో మిమ్మల్ని సరిచేస్తూ, వ్యాఖ్యలు చేస్తాడు. ఇదంతా మీ మనసును బాధ పెట్టటానికి మీ విశ్వాసం సడలించటానికి చేస్తాతడు. లో లోపల ఎంతో అయిష్టంగా, మీరంటే కోపంగా కూడా ఉంటాడు.
మీ మంచి మిత్రుడు మీ పట్ల అసూయగా వుండటం సాధారణ విషయమే. మీరు మీ స్నేహితుడి ఆనందాన్ని తప్పక మీదిగా భావించండి. అందరూ ఒకే తీరునరకూడా ఉండరని గ్రహించండి. మీరు భావించినట్లే మీ స్నేహితుడు భావించకపోవచ్చు. మీ స్నేహితుడితో చర్చించండి ...మీ ఇద్దరి మధ్య ఉన్న పొరపొచ్చాలను సరిదిద్దుకోండి.



Click it and Unblock the Notifications
