For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్లింగ్ తో ..ఢీ.... కొడితే....?

By B N Sharma
|

Top 7 Relationship Rules You Should Follow!
మీరు కనుక ఎవరితోనైనా ఒక సంబంధం కలిగి ఉంటే, కొన్ని నిబంధనలు తప్పక పాటించాలి. ఈ ప్రాధమిక నిబంధనలు పాటిస్తూపోతే, మీ సంబంధం హాయిగా చిరకాలం కొనసాగుతుంది. ప్రేమలోనే కదా అని ఎలా పడితే అలా ప్రవర్తించుతూ సంబంధం ఖరాబు చేసుకునేకంటే, కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఆ సంబంధాలను నిలుపుకోవటం ఎంతో మంచిది. ప్రేమించేటపుడు ఇరువైపులా బేలన్స్ చేస్తూ పోవాలి. పూర్తిగా మీ వైపునుండే అన్ని సౌకర్యాలు కలిగించుకుంటూ ఇతరులను కష్టాలలోకి నెట్టివేయరాదు. మీకు ఒక సంబంధం నిర్వహణకు కొన్ని సులభమైన నిబంధనలు సూచిస్తున్నాం పరిశీలించండి.

అతను చేయరాదు అనే పనులను మీరు అతనికి చెప్పకండి
అతనికి అన్నీ విషయాలు తెలిపారు. అతను అతని మాజీతో మాట్లాడరాదు. శుక్రవారం రాత్రి బాస్కెట్ బాల్ ఆటలకు పిల్లలతో కలసి వెళ్ళరాదు. అర్ధరాత్రి టెలిఫోన్ లో ఆడ స్నేహితులతో మాట్లాడరాదు వంటివన్ని అతనికి తెలిపారు. మరి నిబంధనలనేవి ఇద్దరికి ఒకటే. సమానంగానే ఉంటాయి. నిబంధనలన్ని అతనికి పెట్టేసి మీరు హీపీ భావిస్తూ మీ మాజీతో ఛాటింగ్ లేదా స్నేహితులతో అతనికి తెలియకుండా తిరగడం వంటివి చేయరాదు.

స్నేహితులు ప్రతివారి జీవితంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తారు. అయితే, వ్యక్తులు ఒక సంబంధంలోకి ప్రవేశించగానే, వారు వారి స్నేహితులను మరచిపోతారు. లేదా పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేస్తారు. అలా అసలు చేయరాదు. మీరు సంబంధం పెట్టుకున్నారన్న కారణంగా మీ స్నేహితులను వదిలివేయకండి.

మీరు భావిస్తేనే అతనికి చెప్పండి
మీ గుండె లోతులలో ఉండే విషయాన్నే అతనికి తెలుపండి. అది కూడా సరైన సమయంలో చెప్పాలి. ఎదురుగా ఉన్నవారికి చెప్పేటపుడు మీరు కూడా ఆ అంశాలు భావించి, ఆచరించి ఎదుటవారికి ఖచ్చితంగా తెలియపరచాలి.

ఒకరికొకరు వేరుగా ఉండకండి.
ఆ సంబంధంలో ఉన్నది మీరు ఇద్దరే. కనుక మూడోవారు ఎవరైనా ఉంటే, వారి ప్రసక్తి మీ మధ్య రానీయకండి. మిమ్మల్ని లేదా మీ పార్టనర్ ని ఏదేని సమస్య బాధిస్తూ ఉంటే, ఆ సమస్యను మీలో మీరే పరిష్కరించుకోండి. దానిలోకి బయటవారి జోక్యం తీసుకోకండి. చాలా సమస్యలకు మూడవ మనిషి జోక్యం అవసరం లేదు. కనుక ఇతరులను మీ సంబంధం బయటే ఉంచండి.

ఒకరినొకరు ఎపుడూ మోసగించుకోకండి!
బోర్ కొట్టేసిందా? ఆ సంబంధాన్ని తెగతెంపులు చేసుకోండి కాని భాగస్వామిని మోసం చేయకండి. బోర్ కొట్టేసిందని మోసగించడం దానికి పరిష్కారం కాదు. అది అసలు పూర్తిగా ఆమోదించదగినది కాదు. జరిగే పరిస్ధితి మీకు సంతోషంగా లేదని మీ పార్టనర్ కు విడమర్చి చెప్పండి. సాధ్యమైతే మీలో మీరు పరిష్కరించుకోండి. లేదా తెగతెంపులు చేసుకోండి.

పోల్చకండి
మరి మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు మీకు ప్రియంగానే ఉండవచ్చు. అటువంటివారు మరొకరు లేకపోవచ్చు. కాని మీరు ఇపుడు మీ మాజీతో లేరని గుర్తించండి. కనుక ప్రస్తుతం ఉన్న వారిని గతంలోని వారితో పోల్చకండి. మీ చేతిలో ఉన్న సంబంధంతో సంతోషంగా ఉండండి.

పార్టనర్ కు సమయం వెచ్చించండి - అతను మీరంటే ఎంతో ప్రేమిస్తాడు. కాని మీరు మాత్రం అతనికి సమయం వెచ్చించలేరు. చివరకు మీరు అతనిని ఎంత బాగా ప్రేమిస్తున్నారనేది కూడా అతనికి చెప్పలేకపోతున్నారు. అతనికి మీరు ఈ రకంగా లేకపోతుంటే, మరొకరు అతనికి బాసటగా ఉండేవారు ఉంటారని గుర్తించండి. కనుక మీ పార్టనర్ తో సుఖ సంతోషాలు అనుభవించండి లేదా వేరెవరైనా మీ పార్టనర్ తో వచ్చి ఉంటే మీరు ఇక సతాయించకండి.

English summary

Top 7 Relationship Rules You Should Follow! | సంబంధాల నిబంధనలు!

He cares for you, but you can't invest time for them? Or you're unable to tell the person how much you love them? If you're not there for someone, chances are, someone else will be there for them. So, either care for your partner, or don't crib later if someone replaces you in
Desktop Bottom Promotion