ఇంట్లో ఈ 5 వస్తువులు తెలియకుండానే క్యాన్సర్‌ రిస్క్‌ను పెంచుతాయని తెలుసా.?

క్యాన్సర్‌ ముప్పు ప్రజలను వణికించేస్తుంది. జన్యుపరమైన కారణాలు, జీవనశైలిలో మార్పులు, ఆరోగ్య సమస్యలు ఇలా వివిధ కారణాల వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో జీవితమంతా చికిత్సతోనే సరిపోతోంది. ఈ క్రమంలో మనకు తెలియకుండానే క్యాన్సర్‌ ముప్పును ఇంట్లోనే కొని తెచ్చుకుంటున్నామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐదు వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

these five household items at home cause cancer

ఈ రోజుల్లో మనం ఉపయోగించే ప్రతి వస్తువు కెమికల్స్‌తో ముడిపడి ఉంటుంది. మరోవైపు కల్తీ ఆహార పదార్థాలు కూడా ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలో మనం ఇంట్లో నిత్యం ఉపయోగించే ఐదు వస్తువుల కారణంగా క్యాన్సర్‌ ముప్పు ముంచి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. మరి అవి వస్తువులేంటి.. ఇక్కడ చూద్దాం..

అగరబత్తీలు

దేవుడి దీపారాధనలో అగరబత్తీలు ప్రధానం. అగరబత్తీల్లో చాలా రకాల మోడల్స్‌ ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఫ్రాగ్రన్స్‌తో రకరకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు కెమికల్స్‌ ఉంటాయనేది వాస్తవం. ఈ కారణంగా వీటి నుంచి సువాసన మనకు మంచి అనుభూతిని ఇచ్చినా నిదానంగా క్యాన్సర్‌కి దారితీస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అగరబత్తీల్లోని బెంజీన్‌, ఫార్మాల్డిహైడ్‌ నిదానంగా దుష్ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు.

అయితే అగరబత్తీలు వెలిగించినప్పుడు దేవుడి గది తలుపులు, ఇంటి తలుపులు మూసి ఉంచకుండా తెరిచి ఉంచాలని తద్వారా వాటి సువాసన బయటకు వ్యాపించి ఊపిరితిత్తులపై ప్రభావం చూపదని వైద్యులు సూచిస్తున్నారు.

మస్కిటో కాయిల్స్‌

వర్షాకాలంలో మస్కిటో కాయిల్స్‌ లేనిదే నిద్ర పోవడం సాధ్యం కాదనే మాట నిజం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న చోట వీటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అయితే వీటిలోని ఎలిథ్రైన్‌ సమ్మేళనాలు చాలా ప్రమాదకరం. దోమల నివారణ కాయిల్స్‌ నుంచి వచ్చే పొగను పీల్చడం ద్వారా వాటిలోని ఈ సమ్మేళనాలు ఊపిరితిత్తుల్లోకి చేరి లంగ్స్‌ వాపునకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా క్యాన్సర్‌కు దారితీయొచ్చు.

ఈ ముప్పు నుంచి బయటపడాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. మస్కిటో కాయిల్స్‌ వాడాల్సి వస్తే వెలిగించి చాలా సేపటివరకు మీరు బయట ఉండటం అవసరం. లేదంటే నెట్‌లు, మస్కిటో రిఫిల్స్‌ వాడటం ఉత్తమమని సూచిస్తున్నారు.

ఇంట్లో దుర్వాసనను, తేమ నుంచి వచ్చే వాసనను తొలగించేందుకు ఎక్కువగా ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులోని అస్థిర ఆర్గానిక్‌ సమ్మేళనాలు, ఫార్మాల్డిహైడ్‌ క్యాన్సర్‌ ముప్పును కలిగిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం గది తలుపులు మూసి ఉంచి ఆటోమేటిక్‌ ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌ వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు. తరచుగా వీటిని వాడకూడదని.. అప్పుడప్పుడూ వాటిని వాడటం ప్రమాదకరం కాదని చెబుతున్నారు.

టాల్కమ్‌ పౌడర్‌

చెమట బారి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు, ఫ్రెష్‌గా ఉండేందుకు మంచి సువాసన కలిగిన టాల్కమ్‌ పౌడర్లను ఉపయోగిస్తారు. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని ఎక్కువగా వాడితే క్యాన్సర్‌ ముప్పు తప్పదు. వీటిలోని ఆస్‌బెస్టాస్‌ చాలా ప్రమాదకరం. వీటిని ఎక్కువగా తరచుగా వాడకూడదని సూచిస్తున్నారు.

డ్రై క్లీనింగ్‌

పట్టు బట్టలు, ఇతర సున్నితమైన వస్త్రాలను నీటిలో తీస్తే పాడయ్యే అవకాశం ఉన్న కారణంగా ఎక్కువగా వీటిని డ్రై క్లీనింగ్‌కి ఇస్తుంటారు. అయితే ఈ ప్రాసెస్‌లో ఎక్కువగా క్లోరో ఇథైలిన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. డ్రై క్లీనింగ్‌కి తరచుగా ఇవ్వడం ద్వారా క్లాత్‌ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వస్త్రాలను ఒకసారి ధరించాక కాసేపు తేమ ఆరిపోయేందుకు కొన్ని గంటలపాటు బయట ఆరేయడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion