Latest Updates
-
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.!
చపాతీల్లోకి ఇలా కుర్మా చేస్తే..ఒట్టి కుర్మానే తినేస్తారు!
భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన కాంబినేషన్లలో చపాతీ, వెజిటబుల్ కుర్మా ఒకటి. వేడి వేడి, మృదువైన చపాతీలను కమ్మటి, సుగంధ ద్రవ్యాలతో కూడిన వెజ్ కుర్మాతో కలిపి తింటుంటే ఆ రుచే వేరు. అంతేకాకుండా ఇందులో వాడే అనేక రకాల కూరగాయలు, మసాలా దినుసుల వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.

చపాతీ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళాదుంప
-క్యారెట్
-ఫ్రెంచ్ బీన్స్
-పచ్చి బఠానీలు
-ఉల్లిపాయ
-టమాటో
-పచ్చిమిర్చి
-నూనె
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-యాలకులు
-రాతి పువ్వు
-అనాస పువ్వు
-పసుపు
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-ఉప్పు
-కొత్తిమీర
-జీలకర్ర పొడి
-పచ్చి కొబ్బరి
-పుదీనా
-అల్లంవెల్లుల్లి పేస్ట్

చపాతీ కుర్మా తయారీ విధానం
-ముందుగా 10 బీన్స్, 1 క్యారెట్, 1 మీడియం సైజ్ బంగాళదుంపను ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసిన బంగాళదుంప ముక్కలను నీళ్లలో వేసుకోండి. దీనివల్ల అవి రంగు మారకుండా ఉంటాయి.
-ఇప్పుడు ఒక గిన్నెలో గుప్పెడు చిన్న సైజు మీల్ మేకర్ వేసి అందులో వేడి నీళ్లు పోసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి.,
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలు, 1 టమాటో ముక్కలు, అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్ల వంట నూనె వేసి వేడి చేయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పావు టీస్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 యాలకలు, 1 అనాస పువ్వు, రాతి పువ్వు కొంచెం వేసి లైట్ గా వేయించాక ఇందులో పొడవుగా కట్ చేసిన 2 పచ్చిమిరపకాయల చీలికలు వేసి వేయించాలి.
-పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అందులో నానబెట్టుకున్న మీల్ మేకర్ ని గట్టిగా పిండేసి వేసుకొని వేయించుకోవాలి.
-మీల్ మేకర్ 2 నిమిషాలు వేగిన తర్వాత అందులో 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పుదీనా, అరకప్పు పచ్చి బఠాణీలు, 1 టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి వీటన్నింటిని 2-3 నిమిషాలు వేయించుకోండి.
-ముక్కలన్నీ 2 నిమిషాలు లైట్ గా వేయించుకున్నాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుున్న పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు వేయించుకున్నాక అందులో ఒకటిన్నర టీస్పూన్ కారం, 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ గరం మసాలా వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి, అందులో 1 టస్పూన్ కసూరి మేథీ, ఉప్పు చెక్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి పెద్ద మంట మీద 2 విజిల్స్ రానిస్తే చాలు.
-2 విజిల్స్ వచ్చి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి గరిటతో కొన్ని బంగాళదుంప ముక్కలను లైట్ గా మెదపండి. దీంతో అవి బాగా మెదిగిపోయి కూర చిక్కబడుతుంది. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని కలుపుకుంటే చపాతీ కుర్మా రెడీ. పూరీ, వెజ్ బిర్యానీలోకి కూడా ఇది బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications