Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
నిద్ర లేవగానే ఒళ్లంతా నొప్పులుగా ఉంటుందా?.. ఈ చిన్న పొరపాట్లే పెద్ద కారణాలు.!
కొందరికి నిద్ర లేవగానే ఒళ్లు నొప్పులు పెడుతుంటాయి. అయితే ఈ సమస్యను చాలా మంది లైట్ తీసుకుంటారు. కాసేపటికి సెట్ అయిపోతుంది అనుకుంటారు. కానీ ఇది సరైంది కాదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. నిద్ర లేచిన వెంటనే మీకు బాడీ పెయిన్స్ తరచుగా ఉన్నట్లయితే అందుకు అంతర్లీనంగా పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..

విటమిన్ డి లోపం
ప్రతి ఒక్కరికి విటమిన్ డి చాలా ముఖ్యం. శరీరంలో ఈ విటమిన్ లోపించినప్పుడు హైపోకాల్షిమియా సంభవిస్తుంది. అంటే రక్తంలో కాల్షియం స్థాయి తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. మూత్రపిండాలు, కండరాల వంటి శరీరంలోని కీలక అవయవాల పనితీరుకు, ఎముకల దృఢత్వానికి కాల్షియం దోహదపడుతుంది. అందుకే శరీరం కాల్షియం స్వీకరించడానికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి లోపిస్తే ఈ అవయవాలు, ఎముకల్లో నొప్పుల్లో ఏర్పడి నిద్ర లేవగానే బాడీ పెయిన్స్‌తో బాధపడుతుంటారు.
రక్త హీనత
శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గితే రక్త హీనత లోపిస్తుంది. అదే అనీమియా. తద్వారా శరీర కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో ఇతర భాగాలు సరిగా పనిచేయవు. ఈ కారణంగా అలసటగా అనిపిస్తుంది. అందుకే నిద్ర లేవగానే నొప్పులు బాధిస్తాయి. అంతేకాకుండా రక్తహీనత కారణంగా అలసట, హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గులు, తల తిరగడం, తల నొప్పి, ఛాతీ నొప్పి, చేతులు, చర్మం పాలిపోయినట్లు ఉంటాయి.
అధిక బరువు
చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అధిక బరువు కారణంగా వీపు, మెడపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నొప్పిని అనుభవిస్తారు. ఈ క్రమంలో నిద్రలో శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటారు. ఫలితంగా సరైన నిద్ర కరువవుతుంది. అధిక బరువుతో రాత్రంతా శరీరంపై ఒత్తిడి కలగడంతో పాటు నిద్ర లేక ఉదయం లేవగానే నొప్పులు అధికమవుతుంటాయి. ఇందుకు ఆరోగ్యకరంగా బరువు తగ్గడం శ్రేయస్కరం.

నాణ్యత లేని పరుపు
మనం ఎక్కడ పడుకుంటున్నాం, ఎలా నిద్ర పోతున్నాం అనేది కూడా ఒళ్లు నొప్పులకి కారణమవుతుంది. నాణ్యత లేని పరుపులపై నిద్రపోవడం కూడా ఇందుకు ఓ కారణం. నిద్రించేటప్పుడు ఏ భంగిమలో ఉంటున్నారు అనేది కూడా ప్రధానం. ఇది కూడా బాడీ పెయిన్స్‌కి దారి తీస్తుంది. పక్కకి తిరిగి, వెల్లకిలా, బోర్లా పడుకోవడం ఇలా కొన్ని భంగిమల్లో నిద్రించేటప్పుడు శరీర భాగాలపై ఒత్తిడి పడితే అది ఉదయం ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా శ్వాసకోశ రుగ్మతలు ఉన్నవారు పక్కకు తిరిగి నిద్రపోవడం ద్వారా ఊపిరి సవ్యంగా పీల్చుకుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర లేకపోయినా బాడీ పెయిన్స్‌ను అనుభవించాల్సి ఉంటుంది.
ఈ సమస్యలను పరిష్కరించుకుని ప్రశాంతమైన నిద్రను ఆస్వాదిస్తూ ఉదయాన్నే యాక్టివ్‌గా మేల్కొనేందుకు సమతుల్య ఆహారం, సరైన నిద్ర వేళలు, నాణ్యత కలిగిన పరుపుపై నిద్ర పోవడం వంటివి సరిచూసుకోవాలి. క్రమంగా తీవ్రమైన ఒళ్లు నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
