Latest Updates
-
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
పురుషులకీ ఇదే న్యాయం వర్తిస్తుందా.?.. రూ. 370 బిర్యానీ వివాదంపై నెటిజన్ల హాట్ కామెంట్స్
ఒక మహిళ విలువ రూ. 370 యే నా.? ఒక అమ్మాయి అబ్బాయితో వస్తే దేనికైనా అంగీకరించనట్లేనా.? డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన మీకు వారిపై అన్ని హక్కులు ఉంటాయా.? ఇవి కొన్ని రోజులుగా కామెంట్ల ద్వారా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రశ్నలు. ఓ స్టాండప్ కామెడీ షోలో ఓ యువకుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నెట్టింట్లో పెద్ద దుమారమే చెలరేగింది. అసలేంటి కథ అంటే..

రూ. 370 బిర్యానీ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే షోలో ఒక ప్రేక్షకుడు ఇందుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. గురుగ్రామ్‌కి చెందిన హిమాన్షు జంగ్రా అనే యువకుడు స్టార్విక్ డిజైన్ అనే సంస్థలో వెబ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల ప్రణిత్ మోరే షోకి వెళ్లిన హిమాన్షు.. ఒక యువతితో డేటింగ్ అనుభవాన్ని పంచుకున్నాడు.
తాను ఒక యువతితో డేట్‌కి వెళ్లానని.. అక్కడ తనకి రూ. 370 విలువైన చికెన్ బిర్యానీ తినిపించానని చెప్పుకొచ్చాడు. తర్వాత ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాక… యువతికి హిమాన్షు నచ్చకపోవడంతో అతనిని తిరస్కరించింది. దీంతో మనస్తాపానికి గురై ఆమెకు ఓ ప్రపోజల్ చేసినట్లు చెప్పాడు. తనపై రూ. 370పై ఖర్చు పెట్టినందుకు గాను ఆమె నుంచి శారీరక సాన్నిహత్యం ఆశించానని.. ఆ హక్కు తనకు ఉందనే అర్థంలో షోలో మాట్లాడాడు.
అయితే హిమాన్షు షోలో ఈ విషయంలో చెప్పగానే షోలో కమెడియన్‌తో సహా ఆడియన్స్ సైతం చప్పట్లు కొడుతూ నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో హిమాన్షు వ్యాఖ్యలు, కమెడియన్ తీరుపై తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది.
ఇలాంటి వ్యాఖ్యలు మహిళల పట్ల వివక్షను ఎత్తిచూపుతున్నాయని నెటిజన్లు మండిపడ్డారు. డేటింగ్ సంస్కృతిలో మహిళల అభిప్రాయాలను తక్కువ చేసి చూపేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. #BiryaniIsNotConsent హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఉద్యమం కూడా మొదలైంది. డేటింగ్‌లో మహిళలపై ఖర్చు పెట్టినంత మాత్రాన వారిపై ఎలాంటి హక్కులు ఉండవని తీవ్రంగా దుమ్మెత్తి పోశారు.
ఈ వివాదం ముదిరి హిమాన్షు పనిచేస్తున్న సంస్థకు చేరడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీంతో సదరు వ్యక్తితో పాటు కమెడియన్ ప్రణిత్ మోరే జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు.
ఇదిలా ఉండగా.. మరోవైపు హిమాన్షుని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సమర్థిస్తూనే బాధిత పురుషుల విషయంలో ఇలాంటి చట్టాలే అమలు చేస్తారా అని మరికొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కొందరు భార్యలు, ప్రియురాళ్ల కారణంగా వేధింపులకు గురైన పురుషుల విషయంలో సదరు మహిళలను ఇలాగే ఉద్యోగంలో నుంచి ఎందుకు తొలగించలేదంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.



Click it and Unblock the Notifications
