Latest Updates
-
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.?
అత్తమామలు, ఆడపడుచులు సహకరించకుంటే?

వివాహ సమస్యలు - అత్తమామలు సహకరించకుంటే, మీకు మీ భాగస్వామికి మధ్య ఎన్నో సమస్యలు వస్తాయి. ఆడవారికి ఈ సమస్యలు మరింతగా ఉంటాయి. అటువంటపుడు, మీరు మీ భాగస్వామి మద్దతు కూడగట్టాలి. కాని చాలాసార్లు మీ పార్టనర్ ఏమీ చెప్పలేకపోతాడు. దానికి కారణం తన తల్లితండ్రులకు కోప తాపాలు వస్తాయని. అటువంటపుడు పరిష్కరించటం కష్టమే అవుతుంది. అటువంటపుడు మీరు మీ ఆత్త మామలతోనే సహనం వహించి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. మీకు మీ పార్టనర్ కు మధ్య సమస్యలు లేకుండా చేసుకోండి.
కెరీర్ సమస్యలు - చాలామందిలో అత్త, మామలు తమ కోడలి ఉద్యోగాన్ని తప్పుపడతారు.అటువంటపుడు మీ కెరీర్ దెబ్బతింటుంది. చివరకు మీరు ఉద్యోగంనుండి లేట్ గా వస్తున్నావని అంతసేపు ఎక్కడ తిరుగుతున్నావని కూడా ప్రశ్నిస్తారు. మీ ఉద్యోగాన్ని వారు అర్ధం చేసుకోరు. ఒక్కో సమయంలో మీ పట్ల నిజమైన శ్రద్ధతో కూడా వారు ఈ రకంగా ప్రవర్తించవచ్చు. మీరు కొంతకాలం సహనంగా వారికి నచ్చ చెప్పాలి. కొంతకాలం గడిచే సరికి అన్నీ సర్దుకునే అవకాశం ఉంటుంది.
సామాజిక అంశాలు - అత్తమామాలకు మీ స్నేహితులతో లేదా మీ సామాజిక సంబంధాలతో అయిష్టంగా ఉంటే అవి కూడా తగవులకు దోవతీస్తాయి. చాలాసార్లు వారు నేడు సాగుతున్న ఆధునిక జీవన శైలి అర్ధం చేసుకోలేరు. వారి పాతకాల విలువలు చెపుతారు. ఇటువంటివి ప్రతి ఇంటిలోను సాధారణంగా ఉంటూనే ఉంటాయి. మరి మీరు మీ అత్తమామలు ఒక అవగాహనకు రావాలి. మీరు కూడా వారు తెలిపే విలువలు అర్ధం చేసుకోవాలి. అదే సమయంలో మీరు సోషల్ గా నలుగురితోను కలసి నడవాలనే అవసరాన్ని వారికి వివరించండి.
మానసిక ఒత్తిడి - అత్తమామలు పెట్టే సమస్యలు మానసిక ఒత్తిడి కలిగించి వ్యక్తిగత మరియు ఆఫీస్ జీవితాలను ప్రభావిస్తాయి. ఒత్తిడి ఎక్కువైతే, శారీరక సమస్యలు కూడా వస్తాయి. కనుక మీ అత్తమామలు అర్ధం చేసుకోలేకపోతే, వారికి దూరంగా ఉండటం మంచిది. ముందుగా వారితో మంచిగా ఉండటానికి ప్రయత్నించండి. అది కుదరకుంటే మీరు వేరుగా ఉంటూ మీ భాగస్వామితో ఆనందించవచ్చు. మీ జీవితాన్ని మీ భాగస్వామితో ఆనందంగా ఉంచుకోవాలి తప్ప మీ అత్తమామలకొరకు మీ ఆనందాలను చంపుకోవద్దు.
నేటి తరం పిల్లలకు, పాత తరం పెద్దలకు విలువలు, ఆలోచనలు వేరు వేరుగా ఉంటాయి. కనుక మీ మధ్య వ్యత్యాసం పెంచుకునే కంటే, వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవడం అత్యవసరం. సంబంధాలు కాపాడుకోవడం మరింత అవసరంగా గుర్తించండి.



Click it and Unblock the Notifications
