Latest Updates
-
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.?
ఒంటరితనాన్ని వదిలి తుంటరితనంతో జీవించడం ఎలా..?

1. ఒంటిరిగా జీవించే ప్రతి ఒక్కరూ అక్కర్లేని, అవసరం లేని ఆలోచనలకు తావియ్యకండి. రోజువారీ క్రమంలో జరిగే అనేక సంఘటనలకు అవసరానికి మించి ప్రాధాన్యం ఇవ్వద్దు. వృత్తి రిత్యా ఎంతో మందిని కలవాల్సి వుంటుంది. వారందరిని గుర్తు పెట్టుకొని మనస్సు పాడుచేసుకోకండి.
2. ఆఫీసు పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరితనం మిమ్మల్ని ఆవహిస్తుంది. అలాంటి సందర్శాలలోనే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారందరూ మీ వారే అన్న భావనతో వుంటే ఒంటరితనం మీ దరిచేరదు..
3. ఎప్పుడూ ఇతరుల కోసం కష్టపడుతున్నామన్న భావనతో వుండకండి. ఈ జీవితం నాది. నా కోసం నేను జీవిస్తున్నాను అనుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది. మీ కుటుంబ సభ్యుల కోసమో, ఆత్మీయుల కోసమో జీవించవద్దు. ఈ జీవితం మీది. మీకోసం మీరు జీవించండి. ఈ ఆలోచనే మీకు ఎక్కడ లేని శక్తి నిస్తుంది.
4. ఆత్మన్యూనత భావం జీవితాన్ని ఆస్తవ్యస్తం చేస్తుంది. మిమ్మల్ని సుఖంగా నిద్రపోనివ్వదు. శాంతంగా బ్రతకనివ్వదు. స్వేచ్చగా మీ ఇష్టం వచ్చినట్లు వుండండి. ఇతరులకన్నా మీరు ఎందులోనూ తక్కువ కాదు అన్న భావన కొండంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
5. నవ్వాలనుకుంటే మనస్పూర్తిగా నవ్వండి. దు:ఖం కలిగితే భారం దిగిపోయేంత వరకూ ఏడ్చేయండి. దీని వలన మనసులోని భారమంతా దిగిపోయి మనస్సు తేలికగా అనిపిస్తుంది. నవ్వడం అనేది దేవుడు మీకిచ్చిన వరం. మనసారా నవ్వితే నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అన్న అనుమానాన్ని కలలో కూడా రానీయకండి. మీ చుట్టు పక్కల ఉండే వారందరూ మీ వాళ్ళే అనుకుంటేనే వారితో స్వేచ్ఛగా నవ్వుతూ వుండగలరు. ముఖ్యంగా ఒంటరిగా దూర ప్రాంతాలలో ఉద్యోగం చేసే మహిళలకు ఇది చాలా అవసరం.
6. ఒంటరిగే గడిపేవారికి గార్డెనింగ్, పెట్స్ ను పెంచుకోవడంతో పాటు పుస్తకాలు మంచి నేస్తాలు. అవి మీ మనస్సును ప్రతిబింబిస్తాయి. ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి ఫ్రెండ్ ని కలిసిన అనుభూతి కలుగుతుంది. వీలు దొరికినప్పుడల్లా మంచి సాహిత్య గ్రంథాలు కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒంటరితనం అనిపించినప్పుడల్లా అవి మీకు మంచి కాలక్షపం అవుతాయి. అలాగే మీకు మంచి నేస్తాలు పువ్వులను మొక్కలు. వీటిని పెంచుకొన్నట్లైతే సమయం అంతా గార్డెన్ లో సరిపోతుంది. అవి వికసించినప్పుడు మనస్సుకు కలిగే ఆనందం ఇంతా అంతా కాదు. అలాగే పెట్స్.. మనతో ఉంటే మనకు తోడు ఒకరున్నారన్న భావన కలిగి వాటితో మాట్లాడి, ఆడిపాడి సరదాగా గడిపేయెచ్చు.
7. ఎదుటివారి అభిప్రాయాలు, వారి మాటలను గౌరవించడం అలవాటు చేసుకోవాలి. మీ మంచి కోసం చెప్పే మాటలని కూడా మీరు విశ్వసించలేకపోతే చివరికి మీకంటూ ఎవరూ మిగలకపోవచ్చు. అందుకని ఎదుటివారు ఏం చెపుతున్నారు అన్నది శ్రద్దగా వినండి. తాము చెప్పే మాటలు మీరు వింటున్నారు అంటే చెప్పేవారికి కూడా ఉత్సాహం, సంతోషం కలుగుతుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో కాకుండా పాజిటివ్ గా ఆలోచించండి. ఇది మీ ఆనందాన్ని ఆరోగ్యాన్ని రెట్టింపు చేస్తుంది.



Click it and Unblock the Notifications