Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పురుషులు.. ఎక్కువగా కోపం తెప్పించే ఆ 10 విషయాలు..!?
పురుషులు, వారు ప్రియమైనవారిగా ఉండాలనుకుంటే అలానే ఉండగలరు.కాని కొన్నిసమయాలలో వారు చేసే పనులు తప్పనిసరిగా మీకు కోపం తెప్పిస్తాయి. విచారకరమైన విషయం ఏమిటంటే మీరు వీటినుండి 'ఈ ఒక్కసారి' అని అనుకుని ఉండలేరు. కొంతమంది మగవారు స్వతహాగా అలానే ఉంటారు మరియు వారు ప్రతిరోజూ అలానే ప్రవర్తిస్తారు; వారు ఏమి చేస్తున్నారో తెలీనంతగా అలవాటు పడతారు. మేము ఇక్కడ పురుషులు ఎక్కువగా కోపం తెప్పించే పనులు, ఏం చేస్తారో వాటిలో కొన్ని మీ ముందు ఉంచుతున్నాం.

ఎప్పుడూ టీవీ చూస్తుండటం: ఈ విషయం ఏమీ దురలవాటు కాదు, కాని పరిధులు దాటి ఉంటే మాత్రం, ఇది మీకు కోపం తెప్పించే విషయమే. నిజమే, వారు ఆఫీసు నుండి అలసిపోయి వొస్తారు మరియు వారికి విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం అవసరమని మీకూ తెలుసు. కాని మీరు కూడా అప్పటివరకు వంటగదిలో పనితో అలసిపోయి ఉంటారు. మీకు సహాయం చేయకుండా లేదా మీరు చెప్పేది వినకుండా టెలివిషన్ కి అతుక్కుపోయి ఉంటారు.

ఎల్లప్పుడూ నిస్సహాయత: కొంతమంది మగవారు తమ సొంత వ్యక్తిగత పనులను కూడా చేసుకోలేరు. వారు ఎప్పుడూ మీ సహాయం కొరకు ఎదురుచూస్తుంటారు. దీనివలన మీకు ఇంటిపనిలో సహాయం చేయరు లేదా కనీసం సూపర్ మార్కెట్ నుండి సబ్బుల్ని కూడా కొనలేరు. ఉదాహరణకి మీరు పని హడావుడిలో పడక మీద దుస్తుల్ని వొదిలి వెళితే, తిరిగి మీరు ఇంటికి చేరుకోనేంతవరకు అవి అక్కడే ఉంటాయి. కొంతమంది మగవారు శెలవు మీద ఇంట్లో ఉన్నా, వాటిని సరిగా ఉంచరు.

గాడ్జెట్లు మరింత ముఖ్యమైనవి: అవును, వారు నిజంగా అలానే ఉంటారు ఎందుకంటె మీరు చక్కగా తయారై వారితో కలిసి బయట డిన్నర్ కు వెళితే, కొంతమంది మగవారు, మీరు కారులో ఉన్నా లేదా రెస్టారంట్ వొడ్డ ఉన్నా మీ వంక చూడరు. ఎందుకు? వారు బ్లాక్బెర్రి ఫోనులో మెసేజ్ పంపించటంలో బిజీగా ఉంటారు. ఒకవేళ వారు మీ వైపు చూసినా వారు "తొందరగా, ఆలస్యమవుతుంది" అని చెపుతారు. కొన్నిసార్లు, ఇటువంటి ప్రవర్తన నిజంగా కోపాన్ని తెప్పిస్తుంది. అవును కదా?

వారి రోజువారీ వొస్తువులను సరిగా అమర్చుకోలేకపోవటం: కొంతమంది మగవారిలో ఈ ప్రత్యెక లక్షణం పుట్టుకతోనే ఉంటుందని అనుకోవొచ్చు. వారు సాక్స్ ఎక్కడ ఉంచారో మర్చిపోతుంటారు లేదా వారి నీలిరంగు చొక్కాకు సరిపోలిన టై మర్చిపోతుంటారు. కొన్ని రోజుల్లో కనీసం వారు కారు యొక్క తాళాలను కూడా మర్చిపోతుంటారు. అప్పుడు వారు మీ సహాయం కోసం వొస్తారు. పురుషపుంగవుల్లారా! మీ జీవితాల్లో ఆడవారు లేకుండా మీరేం చేయగలరు?

టాయిలెట్ సీట్ ను పైకి వొదిలివేయటం: కొంతమంది మగవారు చేసే ఈ పని విపరీతమైన కోపాన్ని తెప్పిస్తుంది. వారు ఈ విషయాన్ని మర్చిపోతారు కాని ప్రతిఒక్కరు కాదు మరియు అందరు ఆడవాళ్ళు వారిలాగా ఉండరు. టాయిలెట్ సీట్ ను పైకి తెరిచి ఉంచటం,ఇందువలన మీరు టాయిలెట్ లో పదవొచ్చు, ఇది చాలా జుగుప్సను కలిగిస్తుంది. ఒక్కసారి వారు టాయిలెట్ సీట్ ను క్రిందికి వేసి ఉంచితే, వారికి ఏమీ దెబ్బ తగలదు, అవును కదా!

తమ పనుల తరువాత శుభ్రపరచుకోవటానికి అశక్తత: అంటే గిన్నెలను డిష్వాషర్ లో వదిలేయటం, బట్టలను వాషింగ్ మెషీన్నులో అలానే ఉంచటం, వారి దుస్తులను బాత్రూం నేలమీద వదిలేయటం మరియు అన్నిటికన్నా ముఖ్యమైనది-తడి టవల్ ను మంచం మీద వదిలేయటం. వారికి పడుకునే మంచం దుస్తులను ఆరవేయతానికి ఉపయోగించే రాక్ లాగా కనిపిస్తుందా లేక టవల్ దానంతటదే మంచం మీద ఆరుతుంది అనుకుంటార? కొంతమంది మగవారు ఇటువంటి సాధారణమైన పనులు చేస్తే, మీకు జీవితం చాలా బాగుంటుంది.

మీరు చెప్పేది వింటునట్లుగా నటించటం: మీరు ఏదైనా ముఖ్యమైనదాని గురించి వారికి చెప్పాలనుకున్నప్పుడు, ఉదాహరణకు మీ పని గురించి, మీరు ఇంటికి వొచ్చినతరువాత మరియు వారితో విషయాన్ని పాలు పంచుకోవటానికి మొదలుపెడతారు. కాని కొంతమంది మగవారికి తల ఊపుతూ, 'ఊ' కొడుతుంటారు మరియు చివరగా మీరు వారిని ప్రశ్నించితే " అయితే ఇప్పుడు నేనేమి చేయాలి?" అంటారు. మరికొంతమంది పెదవి విరిచి, వెనక్కి వాలి " క్షమించాలి, ఏమిటి చెపుతున్నావు" అంటారు. నిజంగా ఇది కోపగించుకునే విషయమే కదా!

టాయిలెట్ లో ఉన్నప్పుడు చదవటం: కొంతమంది మగవారికి ఆ రోజు ముఖ్యమైన అన్ని వార్తలు టాయిలెట్ లోనే! టాయిలెట్ లో వార్తాపత్రిక ఎలా చదవాలనిపిస్తుందో దేవుడికే తెలియాలి. అన్నిటికంటే, వారు మీ సమయాన్ని ఎక్కువగా తీసుకుంటారు అలానే వారు టాయిలెట్ నుండి త్వరగా బయటపడరు.

గురక: కొంతమంది మగవారు నిద్రలో గురక పెడుతుంటారు మరియు దీనిని తప్పించుకోవటం చాలా కష్టం. దాని గురించి మీరు ఏమి చేయలేరు. మీరు వారికి ఈ విషయాన్ని చెప్పినట్లయితే, వారు దానిని అంగీకరించరు సరికదా, మీ నిద్ర పాడవుతుంది.

ఎక్కువగా త్రాగటం: వారు బయటకు వెళ్లి, స్నేహితులతో కలిసి త్రాగి వొస్తే మీకు ఏమి అభ్యంతరం ఉండదు. కాని వారు విపరీతంగా త్రాగి, వీరిని ఎవరో ఒకరు మీ పడకగది వరకు తోడుగా తీసుకురావటం; అప్పుడు కోపం నసాళానికి అంటుతుంది. అవును కదా?



Click it and Unblock the Notifications
