Latest Updates
-
జస్ట్ 20 నిమిషాల్లో ది బెస్ట్ సాంబార్ రైస్.. రెస్టారెంట్ ని మించిన రుచితో ఎలా చేసుకోవాలంటే.. -
మలబద్దకంతో బాధపడుతున్నారా? మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఈ ఫుడ్స్ తినండి -
అన్నం, కూర అక్కర్లేదు..ఇదొక్కటి ఉంటే చాలు పొట్టకి హాయిగా, లంచ్ బాక్స్ కి బెస్ట్..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు..శరీరానికి అవసరమయ్యే కాల్షియం, ప్రొటీన్, ఇంకా చాలా పోషకాలు -
వేడి చేసి మూత్రం సరిగ్గా రావట్లేదా? మన పూర్వీకుల ఈ పచ్చడి తింటే చాలు..చుక్క నూనె లేకుండానే క్షణాల్లో చేయండిలా -
చాలా తక్కువ టైంలో రుచికరమైన, పౌష్టికమైన పచ్చడి.. ఉల్లిపాయలతో ఈజీగా చేసేయండిలా.. -
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు..పక్షవాతం రాకుండా అడ్డుకునే బెస్ట్ వ్యాయామం ఇదే! -
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా..
ఈ విధమైన కోరికలుండే పురుషులు చాలా అరుదు..!
సాధారణంగా పురుషులు చాలా సింపుల్ గా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతారు. వీరు స్త్రీల కంటే ఎక్కవగా ఎమోషనల్ గా ఉంటారు. అయితే వారకంటూ కొన్ని ప్రిన్సిపుల్స్ (నియమాలు)ఉంటాయి. ప్రతి ఒక్క మగవాడికి తనకంటూ కొన్ని సొంత కోరికలు ఉంటాయి. అయితే అవి అసంపూర్ణంగానే ఉంటాయి. వివాహపరంగా మరియు ఫాషన్ ఫరంగా ఇటువంటి వాటి కాకుండా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన కోరికలు కలిగి ఉంటారు. అంతే కాదు అవి వాస్తవికానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు.
అది స్వాకీ కార్స్, బైక్స్, గాడ్జెట్స్ వంటి ఉపరితల స్థాయిలో(బయటకు చెప్పుకొనే విధంగా) తకకంటూ కొన్ని కోరికలను కలిగి ఉంటాడు. కానీ అంతర్గతంగా మంచి మార్గాలను వెతుక్కుంటాడు. అతన్ని మంచి మార్గంలో ట్రీట్ చేసే వారి కోసం వెతుక్కుంటాడు. అలాంటివి కొన్ని విషయాలను ప్రతి మగవాడు కోరుకొనే కోరికలు ఏంటో చూద్దాం...

నిబంధన లేని ప్రేమ: ఇది ఎల్లప్పుడు ఒక వ్యక్తి తన తండ్రి కంటే తల్లికి దగ్గరగా ఎక్కువ ప్రేమను కలిగి ఉంటాడు. ఎందుకంటే, తల్లి ఎప్పటికీ తన పిల్లలకు ఆ ప్రేమనంతంటిని పంచుతుంది. అందులో ఎటువంటి షరత్తులు ఉండవు. అందుకే తల్లిప్రేమను ఎక్కువగా కోరుకుంటాడు. ఇటువంటి వారు తన సహచర లేదా భార్య కోసం కూడా అంతే ప్రేమను కలిగి ఉంటారు.

స్నేహితులు: పురుషుల్లో చాలా మందికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. అయితే వారిలో చాలా కొంత మంది మాత్రమే సన్నిహితులుగా ఉంటారు. అటువంటి స్నేహితులు చచ్చేంత వరకూ తోడుగా ఉండాలని కోరుకుంటాడు. తనకూడా అలాగే ఉండాలని అనుకుంటాడు.

అత్త కోడలు మద్య సంబంధం: ఈ సంబంధంలో అనుకూలత ఉంది. ప్రతి మనిషి తన భార్య మరియు తన తల్లి కలిసి మొలసి ఉండాలని కోరుకుంటాడు. ఎటువంటి అపార్థాలు లేకుండా వారితో పాటు జీవించాలని కోరుకుంటాడు.

భక్తిభావాలు: ప్రతి వ్యక్తిలో విశ్వసనీయత మరియు భక్తి భావం ఉండాలని కోరుకుంటాడు. ఇది లేకపోవడం వల్లనే సంబంధాలు విచ్ఛిన్నం అవడానికి కారణం అవుతున్నాయి. ఈ విషయంలో పురుషులు వారి భాగస్వామి విశ్వసనీయత కలిగి ఉండాలని కోరుకుంటారు.

ఆహారం: ఒక నానుడి (సామెత) ఉంది ఒక వ్యక్తి యొక్క గుండెకు ఉత్తమ మార్గం తన కడుపు ద్వారానే అని. ప్రతి వ్యక్తి ఇలా అంచనా వేస్తాడు...అతని భార్య /సహచరని తనకు నచ్చే విధంగా వంటలు చేయాలని కోరుకుంటాడు. అతను రెస్టారెంట్స్ లో తినడం కంటే ఇంట్లో తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

ఓపిక: పురుషుల గురించి బాధపడటానికి ఇది మరో కారణం. ఎందుకంటే కొన్ని సందర్బాల్లో పురుషులు తెలివితక్కువగా మరియు మూర్కంగా ప్రవర్థిస్తుంటాడు. అటువంటి సమయంలో తన ఫ్రెండ్ లేదా భార్య లేదా అతని వల్ల బాధపడ్డ ఇంకెవరైనా సరే అది వాళ్ళు మరచిపోవాలని కోరెకుంటాడు. లేదా తన క్షమించేంత ఓపికను కలిగి ఉండాలని కోరుకుంటాడు.

ఒక ఆదర్శమైన భార్యను కోరుకుంటాడు: ప్రతి మహిళ తన మొదటి బిడ్డను తన భర్తలోనే చూసుకుంటుంది అలాగే ప్రతి పురుషుడు తన భార్యలోనే తల్లిని చూసుకుంటాడు. కాబట్టి ప్రతివ్యక్తి వారి భార్య లేదా సహచరణి సహనం మరియు ఓపిక, కొన్ని నియమాలు కలిగి ఉండాలని కోరుకుంటాడు.

అందంతో పాటు తెలివి తేటలు: ఇది ప్రతి ఒక్క వ్యక్తి కోరుకొనే మొదటి కోరిక, అందుకే ప్రతి వ్యక్తి తనకు నచ్చే అందంగా మరియు చలాకిగా ఉండే ఫర్ ఫెక్ట్ మహిళకోసం వెతుక్కుంటాడు. పురుషులు ఎక్కువగా గాసిప్స్ మాట్లాడే వారన్న లేదా అతిగా ప్రదర్శించేవారన్నా వారికి ఇష్టం ఉండదు. పురుషులు ఎక్కువగా నమ్మకమైన స్త్రీని, సహనం, ఓర్పు, కలిగి అందంగా ఉన్న స్త్రీనే ఎక్కువగా కోరుకుంటాడు.

ఇండిపెండెంట్ స్త్రీ: వ్యక్తిగతంగా నిర్ణయాలు మరియు భాద్యతలు తీసుకొనే వారంటే గౌరవిస్తారు. స్త్రీ తన స్వంతంగా సంపాదించగలిగినప్పుడు తన కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది.

భావ పరిణితి: పురుషులు చాలా వరకూ భావోద్వేగంగా కలిగి ఉన్నా బయటకు మాత్రం కఠినంగా కనిపిస్తారు. అందుకు వారి మానసికంగా పరిపక్వం మరియు బాధ్యతలు కలిగి, వారి మీద పెత్తనం చేలాయించని వారికోసం వెతుకుతారు.

ప్రాపంచిక లాభాలు: అందరూ మగవారు కొన్ని స్థిరమైన కోరికలు కలిగి ఉంటారు. ఒక ఇల్లు కొనాలనో, ప్రపంచం అంతా చుట్టిరావాలనో, గాడ్జెట్స్ కలెక్ట్ చేయాలనో..కార్లు..బైక్స్ వంటి వాటి మీద అమితమైన కోరికలు కలిగి ఉంటారు. అందుకోసం డబ్బును పొదుపు చేసుకుంటారు.

కెరీర్: ప్రతి మనిషికి తనకంటూ ఒక లక్ష్యాన్ని ఎర్పరుచుకోవాలి. అది అతని జీవనానికి మార్గదర్శకం కావాలని కోరుకుంటాడు.

ఆకర్షితులు: సాధారణంగా పురుషులు ఆడవారికి ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. అది వారి హాస్యం /తెలివితెటలకు ఎక్కువగా ఆకర్షింపబడుతుంటారు.

సాధారణ ఆసక్తి: పురుషులు ఎల్లప్పుడు తన భాగస్వామితో లేదా ఫ్రెండ్స్ తో సంతోషంగా గడపాలనే ఆసక్తిని కలిగి ఉంటాడు. పురుషుడు తన స్నేహితులు విషయంలో కానీ భాగస్వామి విషయంలో కానీ ప్రేమను మరియు స్థిరత్వాన్ని మరియు సంపూర్ణ సంబంధాన్ని కోరుకుంటాడు...



Click it and Unblock the Notifications
