Latest Updates
-
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా?
మీ అనుబంధం అర్ధవంతంగా లేదు అనడానికి సంకేతాలు
ఒక సంబంధంలో ఉన్నపుడు ఆ అనుభూతి మీ జీవితంలో మరే ఇతర ఆనందకరమైన అనుభూతులతో సమానం కాదు. ఇది మీరు జీవితాంతం కోల్పోకూడదు అనుకునే విషయం. చిన్న చిన్న తగాదాలు, కోపం, ప్రేమ, గారాబం మొదలైన ప్రత్యేకమైన విషయాలు మీ ఇద్దరి మధ్య బంధాన్ని కట్టిపడేసే ముడిలా౦టివి. కానీ జీవితంలో ప్రతిదీ చాలా సున్నితంగా వెళుతుంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. అత్యంత సఫలీకృత సంబంధంలో గులాబికి ముల్లున్నట్లుగా ‘తెగిపోవడం’, ‘విడాకులు’ వంటి మాటలు రావచ్చు. అలాంటి అపజయాలు ప్రధాన పాత్ర పోషించడానికి ముఖ్య కారణాలు ఏమిటి? అలాంటి వాటి వల్ల సంబంధాలలో కమ్యూనికేషన్ లేకపోవడం లేదా ఆ సంబంధంలో చాలా ఎక్కువ, మరింత ప్రేమ లేకపోవడం జరుగుతుంది.
అవును, కొన్నిసార్లు ఇది ఎంత కష్టంగా ఉంటుందంటే మీరు ఆ అనుబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడే౦త. కానీ, మీకు తెలుసు, సంబంధాలు రబ్బర్ లాంటివి. ఆ వ్యాకోచత్వం ప్రేమ, శ్రద్ధ, నిజాయితీను చురుకుగా చేస్తుంది. ఆ నమ్త్రత పోతే, దాన్ని ముందుకు లాగడం వల్ల ఉపయోగం లేదు. రాబోయే జీవితంలో చేదు అనుభవం పొందేకంటే ఆ బాధను, నిజాన్ని ఎదుర్కోవడమే మంచిది.
ముందు చెప్పిన విధంగా సంబంధంలో కమ్యూనికేషన్ లేకపోవడం అనేది, ఆ సంబంధంలో ఎటువంటి ప్రేమ ఉండదు. ముగింపు పలకడానికి ఇవే కారణాలు. కానీ సంబంధంలో ప్రేమ లేదు అని గుర్తించడానికి మరికొన్ని గుర్తులు మీ సంతోషకరమైన అనుబంధం ఇకమీదట ఉండదు-

1. కమ్యూనికేషన్ లేకపోవడం
సంబంధంలో కమ్యూనికేషన్ లేకపోవడం అనేది మీ సంబంధం ఎక్కడికీ పోదు అనడానికి అతి ముఖ్యమైన సూచన. సంబంధం అంటే ఒకరికొకరు మీ అనుభూతులను, సమస్యలను పంచుకునే సామర్ధ్యం కలిగి ఉండడం. ఒకవేళ మీరు కమ్యూనికేట్ చేయలేకపోయినా, ఆ విషయంపై విముఖత చూపిన మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
2. మీ అనుబంధంలో ఇకమీదట ప్రేమ లేదు
నిజానికి, మీ అనుబంధంలో ఇకమీదట ప్రేమ లేకపోవడం వల్ల ముగింపు పలకాడానికి వేరే కారణం అవసరం లేదు. మీరు ఒకరికొకరు మీ అనుభూతులను పంచుకుంటే అన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. చేతులో చెయ్యి వేసి రోడ్డు దాటోచ్చు. కానీ జిగురు ఎండిపోతే, మీ ఇద్దరినీ ఏదీ కలపలేదు.

3. ప్రేమతో ఉండడం ఇష్టం లేనపుడు
ఒక ఆరోగ్యకరమైన ప్రేమ జీవితం శారీరిక అవసరం, ఆ కోరికను చల్లర్చడంపై ఆధారపడి ఉంటుంది. పడకగదిలో ఆశక్తి లేకపోతే దానికి కారణం వెతకాలి. అంతేకాకుండా, మీ సంబంధంలో కమ్యూనికేషన్ లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయి.
4. భవిష్యత్తు గురించి ఎప్పుడూ చర్చించవద్దు
ఇది మీ అనుబంధం ముగింపు దశలో ఉందని గుర్తుచేయడంలో క్లిష్టమైన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ మీరు మీ భాగస్వామి మీ భవిష్యత్తు గురించి ఏమీ మాట్లాడలేదు అంటే అర్ధం మీరు మీ భాగస్వామితో మీ భవిష్యత ప్రణాళిక సిద్ధం చేసుకోలేదని, అందువల్ల, ఇది ముగింపుకు గుర్తు.

5. ప్రతిరోజూ తగాదాలు
మీరు మీ భాగస్వామితో ప్రతి విషయంలో విసుక్కుంటున్నారా? మీ భాగస్వామి ప్రతి చిన్న విషయానికీ మీతో గొడవపడుతున్నారా? ఇది ఇప్పుడు మళ్ళీ ఆలోచించే సమయం. చిన్న చిన్న తగాదాలు మీ అనుబంధాన్ని గట్టిపరుస్తాయి కానీ అది శృతి మించితే గాలి పీల్చుకోవడానికి కొంత స్థలం ఖచ్చితంగా అవసరం.

6. పగటి కలలు
మీ జీవితాన్ని మీ ఒక్కరి గురించే ఊహించుకుంటున్నారా? మీరు మీ భాగస్వామితో కలిసి ఏదైనా కొత్తదనాన్ని పొందాలని తరచుగా ఆలోచిస్తున్నారా? ఇంక మీ ఇప్పటికే ఉన్న అనుబంధం ఖచ్చితంగా ముగిసినట్టే.
7. విధేయత అనే ప్రశ్న
చివరిది, ఎటువంటి అనుమానం లేకుండా మీ అనుబంధం ముగియడానికి ఇది అతిపెద్ద కారణం. మాట్లాడడం లేదా కౌన్సెలింగ్ వల్ల అన్ని సమస్యలు పరిష్కార మౌతాయి, కానీ మీరు మీ భాగస్వామిని మోసం చేయాలి అనుకుంటే, ఎటువంటి పరిస్థితుల్లో మీ అనుబంధం నిలవదు.

మీ అనుబంధం ముగిసి పోయింది అని అనడానికి ఇక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయి. సంబంధంలో కమ్యూనికేషన్ లేకపోవడం అనేది అనుబంధాన్ని కోల్పోవడమే. ఇతర కారణాలు మీతోపాటు వస్తాయి. నిజానికి, అనుబంధం పువ్వు వంటిది. దాన్ని ప్రతిరోజూ శ్రద్ధ చూపి, పెంపొందించడం అవసరం. లేకపోతే, అది దాని రంగు, పరిమళం కోల్పోతుంది.



Click it and Unblock the Notifications
