Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
పడగ్గదిలో ఉద్రేకంలో తీయని గాయాలు అవుతున్నాయా? ఆ లవ్ బైట్స్‌ను ఇలా తగ్గించుకోండి
లవ్ బైట్.. రాత్రి పట్టరాని ఉద్రేకంలో మీ భాగస్వామి చేసే చిలిపి పనికి ఈ లవ్ బైట్స్ ఏర్పడుతుంటాయి. అయితే దీన్ని ఎవరికీ కనిపించకుండా దాచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని తెగ టెన్షన్ పడిపోతూ.. వాటిపై మేకప్ వేయడం, కనిపించకుండా డ్రెస్ తో కవర్ చేయడం, ముఖ్యంగా స్కార్ఫ్ ను చుట్టుకోవడం వంటివి చేస్తుంటారు.
చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఈ తీపి గాయాలను త్వరగా తగ్గించుకునేందుకు నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లవ్ బైట్.. అదో చిలిపి పని, తీయని జ్ఞాపకం. నిజానికి చెప్పాలంటే ఇది మీలో మధురానుభూతిని కల్గజేస్తుంది. అది చూసినప్పుడల్లా మీరు తెగ సిగ్గు పడిపోతుంటారు. కానీ బయట వాళ్లే చూస్తే బాగోదని కవర్ చేసుకుంటూ ఉంటారు. గట్టిగా ముద్దు పెట్టుకోవడం, నోట్లో పెట్టుకుని నలపడం, ఒత్తిడి కారణంగా ఈ లవ్ బైట్ ఏర్పడుతుంది.
మీ భాగస్వామి ఇలా చేసినప్పుడు ఎర్ర రక్తకణాలు ఆక్సీకరణం చెంది అవి ఉదా రంగు పాచెస్ ను ఏర్పరుస్తాయి. అయితే వీటిని రాత్రికి రాత్రే లేకుండా చేయలేం. కానీ నెమ్మదిగా తగ్గించుకోవచ్చు.
1. లవ్ బైట్ పై ఐస్ ఉంచండి:
లవ్ బైట్ గాయం తప్ప మరోటి కాదు. కాబట్టి కోల్డ్ కంప్రెస్ చేయడం వల్ల ఇది త్వరగా త్గగుతుంది. చిన్న ఐస్ ముక్క తీసుకొని దానిపై రుద్దండి. ఇది గడ్డకట్టిన రక్తాన్ని కదిలిస్తుంది. ఇలా త్వరగా లవ్ బైట్ ను తగ్గించుకోవచ్చు.
2. వెచ్చని టవల్‌తో మసాజ్:
కోల్డ్ కంప్రెస్ ఉపయోగించిన తర్వాత కూడా తగ్గకపోతే వెచ్చని కాటన్ టవల్ తో మసాజ్ చేయాలి. దీని వల్ల ఆ ప్రాంతంలో రక్తం సరఫరాను పెంచవచ్చు.
3. మందులు వాడాలి:
ఈ రెండు పద్ధతులు వాడినప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం మంచిది. వారు ఇచ్చే క్రీములు వాడి వీటిని త్వరగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆర్నికా క్రీములు, థ్రోంబోఫోబ్ క్రీమ్ లను ఎక్కువగా వాడుతుంటారు. వీటిని ఎక్కువగా గాయాల కోసం వాడుతుంటారు. వైద్యుడి సలహాతో లవ్ బైట్ ను తగ్గించుకునేందుకు కూడా ఉపయోగించవచ్చు.
వీటిని మాత్రం అస్సలే వాడకూడదు:
క్షణాల్లోనే లవ్ బైట్ ను తగ్గించుకోవచ్చంటూ సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఉంటాయి. అయితే ఇందులో ఉండేవి చాలా వరకు సరైనవి కావు. ముఖ్యంగా అలోవెరా జెల్ రాయడం, పిప్పరమెంట్ స్ప్రే కొట్టడం, అరటి తొక్క హ్యాక్, టూత్ పేస్ట్, ఆల్కాహాల్ వంటివి వాడాలంటూ చెబుతారు. కానీ వీటి వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. సో ఇవేమీ ట్రై చేయకుండా పైన చెప్పినవి ఫాలో అయితే త్వరగా లవ్ బైట్స్ ను తగ్గించుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications