Latest Updates
-
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.?
పెళ్లి కానివాళ్లకు బంపరాఫర్..ట్రిప్ కు తీసుకెళ్తారు,నచ్చినోళ్లని చేసుకోవచ్చు..కొత్త పెళ్లి ట్రెండ్ ఇదే!
బాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు చూసి పెరిగిన ప్రస్తుత తరానికి అరేంజ్డ్ మ్యారేజ్ (పెద్దలు కుదిర్చిన పెళ్లి) అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. ఏదో పెండ్లిలోనో, ట్రిప్ లోనో ఒక అపరిచిత వ్యక్తి పరిచయం కావడం, ప్రేమలో పడటం, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం... ఇదంతా సినిమాల్లో చూసేందుకు అద్భుతంగా ఉంటుంది.
కానీ రియల్ లైఫ్ కి వచ్చేసరికి ప్రేమను వెతుక్కోవడం, మోడ్రన్ డేటింగ్ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నేటి యువతకు అతిపెద్ద సవాల్ గా మారింది. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ వచ్చాక పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. సిట్యువేషన్ షిప్, ఘోస్టింగ్, బెంచింగ్ వంటి కొత్త ట్రెండ్స్ యువతను మానసికంగా అలసిపోయేలా చేస్తున్నాయి.

డేటింగ్ యాప్స్ పట్ల విరక్తి పెరిగిపోవడంతో, యువత ఇప్పుడు స్క్రీన్లను వదిలేసి రన్నింగ్ క్లబ్స్, పబ్స్, సింగిల్స్ మిక్సర్స్ వంటి రియల్ లైఫ్ పరిచయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో మ్యారేజ్ మ్యాచ్ మేకింగ్ కూడా యువత అభిరుచులకు తగ్గట్టుగా కొత్త పుంతలు తొక్కుతోంది.
కొత్త తరం డేట్ టు మ్యారీ యాప్ లు
ఒకప్పుడు మ్యారేజ్ బ్రోకర్లు ఇంటికి వచ్చి సంబంధాలు చెప్పేవారు. లేదా వాట్సాప్ లో బయోడేటాలు పంపి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అని బలవంతం చేసే వారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. సాంప్రదాయ మ్యాట్రిమోనీ వెబ్ సైట్లు కూడా పాతబడిపోయాయని నేటి యువత భావిస్తున్నారు. అందుకే, క్యాజువల్ డేటింగ్ యాప్స్, పాతకాలపు మ్యాట్రిమోనీలకు మధ్యస్థంగా డేట్ టు మ్యారీ (Date to Marry) లేదా సీరియస్ డేటింగ్ ప్లాట్ ఫామ్స్ పుట్టుకొచ్చాయి.
ఈ కొత్త యాప్స్ లో అభ్యర్థుల ఇష్టాయిష్టాలు, వ్యక్తిత్వం, లైఫ్‌స్టైల్ ఆధారంగా సైకోమెట్రిక్ టెస్టులు చేసి మరీ సరైన జోడీని సూచిస్తున్నారు. కూప్లెట్, వెరోనా, ఐజిల్ లాంటి యాప్స్ నాణ్యతకే పెద్దపీట వేస్తున్నాయి.
కౌన్సెలింగ్, థెరపీల ఎంట్రీ
ఈ కొత్త ప్లాట్ ఫామ్స్ లలో రిలేషన్ షిప్ కౌన్సిలర్లు, సైకాలజిస్టుల పాత్ర కూడా కీలకంగా మారింది. ఒక డెడికేటెడ్ రిలేషన్ షిప్ కోచ్ ను కేటాయిస్తారు. భాగస్వామిని వెతికే క్రమంలో ఎదురయ్యే ఒత్తిడి, రిజెక్షన్స్ వల్ల వచ్చే బాధను జయించడానికి వీరు ప్రతివారం కౌన్సెలింగ్ ఇస్తూ అండగా నిలుస్తున్నారు.
ఆఫ్ లైన్ ఈవెంట్స్, ట్రావెల్ మ్యాచ్ మేకింగ్
ఈ యాప్స్ కేవలం మొబైల్ ఫోన్లకే పరిమితం కాలేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో సింగిల్స్ మిక్సర్స్ నిర్వహిస్తున్నారు. సుషీ మేకింగ్, కాక్ టెయిల్ వర్క్ షాప్స్, ఆర్ట్ సెషన్స్ ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా యువత ఒకరినొకరు సహజంగా అర్థం చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
దీనికి తోడు ఇప్పుడు ట్రావెల్ మ్యాచ్ మేకింగ్ ట్రెండ్ కూడా మొదలైంది. మనాలి, గోవా, రిషికేష్ లాంటి ప్రాంతాలకు 3-7 రోజుల పాటు సింగిల్స్ అందరూ కలిసి ప్రయాణిస్తారు. అక్కడ రకరకాల యాక్టివిటీస్, ఐస్-బ్రేకర్స్ ద్వారా తమకు సరిపోయే భాగస్వామిని చాలా న్యాచురల్ గా ఎంచుకుంటున్నారు.



Click it and Unblock the Notifications