Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Relationship Tips: మహిళలతో మాట్లాడుతున్నారా? పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు
ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వరం మృదువుగా అవసరమైనప్పుడు గంభీరంగా ఉండాలి. మర్యాదగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు, ఐ కాంటాక్ట్ సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా ఆడవారితో మాట్లాడేటప్పుడు ఏమాత్రం పొరపాట్లు లేకుండా మాట్లాడాలి. మాటల్లోనే తప్పులు దొర్లడం కాదు, మాట్లాడేటప్పుడు తప్పులు చేయకుండా ఉండాలి.
మహిళల పట్ల మంచి అభిప్రాయాన్ని సంపాదించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అసలు మహిళలతో ఎలా మాట్లాడాలి.. వారిలో మాట్లాడేటప్పుడు చేయకూడని ఆ తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సరిగ్గా వినకపోవడం:
మనం చెప్పేది వినాలని ఎలా కోరుకుంటామో.. ఎదుటి వారు కూడా వారు చెప్పేది మనం వినాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఎక్కడో ఆలోచనలు పెట్టడం వల్ల వాళ్లు చెప్పేది వినకపోవచ్చు. అది వారికి తెలిస్తే హర్ట్ అవుతారు. వారి అభిప్రాయాలు, ఇష్టాలు, అభిరుచులు చెబుతున్నప్పుడు మరింత శ్రద్ధ కనబరచాలి.
వాదించడం:
వ్యక్తులతో విభేదాలు, అభిప్రాయలబేధాలు ఉండటం చాలా సహజం. అయితే మహిళలతో వాదించకుండా ఉండటం ముఖ్యం. వాదనల సమయంలో గౌరవం తగ్గిపోతుంది. వారు చెప్పేదానికి మీరు ఏకీభవించకపోతే ఆ విషయాన్ని ప్రశాంతంగా చెప్పాలి. సూటిగా స్పష్టంగా మాట్లాడాలి.
అభ్యంతరకరంగా మాట్లాడటం:
సాన్నిహిత్యం లేకుండా పర్సనల్ విషయాల జోలికి వెళ్లొద్దు. ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతున్నప్పుడు సెక్సీ కామెంట్లు, అభ్యంతర పదాల వాడకం ఉండకుండా చూసుకోవాలి. అలాంటి వ్యాఖ్యల వల్ల మంచి అభిప్రాయం ఏర్పడదు.
మీ గురించి మాత్రమే చెప్పడం:
సంభాషణ ఎప్పుడు రెండు వైపుల నుండి ఉండాలి. అప్పుడే అది సంభాషణ అనిపించుకుంటుంది. ఒక్కరే మాట్లాడుతూ ఉంటే అది ప్రసంగం అవుతుంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు సెల్ఫ్ డప్పు కొద్దిగా తగ్గించి ఎదుటివారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి.
పర్సనల్ స్పేస్‌ను గౌరవించాలి:
స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పర్సనల్ స్పేస్ ను గౌరవించాలి. మహిళలకు ఇష్టం లేకుండా వారికి అతిదగ్గరగా వెళ్లి మాట్లాడొద్దు. తాకడం లాంటివి అస్సలే చేయొద్దు. దీని వల్ల అభిప్రాయాలు మారిపోయి, స్నేహం చెడిపోుంది.
ఫ్లర్టింగ్ చేయడం:
స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఫ్లర్టింగ్ మంచి మార్గం. అయితే అతి ఎక్కడా పని చేయదని గుర్తుంచుకోవాలి. ఒక స్థాయి వరకు ఫ్లర్టింగ్ చేయవచ్చు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే వరకు ఫ్లర్టింగ్ ఉండొద్దు.
నో చెబితే అంగీకరించాలి:
మహిళలు నో చెబితే నో అనే అర్థం. ఏదైనా విషయం వారికి నచ్చకపోతే వారు అయిష్టాన్ని చూపిస్తే, నేరుగా నో చెబితే ఇక దాని గురించి ప్రస్తావించకూడదు. ఆమెకు ఆసక్తి లేకపోతే.. ఆ విషయాలు వారు చెబితే వారి నిర్ణయాన్ని గౌరవించాలి. నో చెబితే అంగీకరించాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications