Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
వెన్నుపోటుదారులని వదిలి జీవితంలో ముందుకెందుకు సాగిపోవాలి
జీవితాంతం కొన్ని బంధాలు నిలవాలని నియమమేమీ లేదు.కొన్ని బంధాలని ఒక్కోసారి మన మంచికోసమే మధ్యలో వదిలెయ్యాల్సి రావచ్చు.
ఈరోజు ఈ ఆర్టికల్ లో వెన్నుపోటుదారులని వదిలి మనము ఎందుకు ముందుకెళ్ళాలో, అలాంటి వాళ్ళకి రెండో అవకాశం ఎందుకు ఇవ్వకూడదో చూద్దాము.
మనకి బాగా దగ్గరివారు మన మంచి కోరో లేదా సరైన కారణం తో మిమ్మల్ని మోసం చేస్తే అది వేరే సంగతి.కానీ ఇలా చెయ్యడం వెనుక వారి స్వార్ధం ఉంటే కనుక ఇక మీరు వారితో మీ బంధాన్ని కొనసాగించడం మీద పునరాలోచించుకోవాల్సిందే.
ఇక వెన్నుపోటు దారులకి మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వకూడదంటున్నామో చదివి, మేమిచ్చిన లిస్టు తో సరి చూసుకుని మరలా అలాంటి వారిని నమ్మవచ్చో లేదో మీరే నిర్ణయించుకోండి.

కోల్డ్ ఫ్రెండ్స్
మిమ్మల్ని ఇబ్బందులలోకి నెట్టే పరిస్థితులని తప్పించడం లేదా మిమ్మల్ని రక్షించే అవకాశం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి మీరు మరింత ఇబ్బందులలోకి జారేటట్లు చేసే స్నేహితులుంటే వారిని ఇక మీదట పట్టించుకోనవసరం లేదు.

మారని మనుష్యులు
బహు కొద్ది మంది మాత్రమే తాము చేసిన తప్పు తెలుసుకుని పశ్చాతాప పడతారు.చాలా మంది పగ ని మనసులో పెట్టుకుని సమయమొచ్చినప్పుడు విషం లా కక్కుతుంటారు.అందుకే వెన్నుపోటుదారులని పట్టించుకోవద్దనేది

పరిస్థితుల వల్లే అని చెప్తే నమ్మకండి
నిజమైన స్నేహితులెప్పుడూ తమ స్నేహితులని మధ్యలో విడిచి వెళ్ళరు.మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేవాళ్ళెప్పుడూ పరిస్థితుల దృష్ట్యా అలా చెయ్యాల్సి వచ్చిందని చెప్తారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి,పరిస్థితులు కాదు, వాళ్ళే అలా చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

అపరిపక్వత
వెన్ను పోటు పొడిచిన ప్రతీ సారీ తెలీక చేసాననో తాను ఇమ్మెచ్యూర్(అపరిపక్వత) అవ్వడం వల్ల అలా చేసాననో అనడం సాధారణం.అలాంటి మాటలు అస్సలు నమ్మకండి.మిమ్మల్ని మానసికం గా గాయపరచడానికి వాళ్ళు సరైన స్థితిలోనే ఉన్నారు.

ఎల్లప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు
ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదని మనకి తెలుసు.స్నేహితులని వారి లోపాలతోనే అంగీకరించడం చాలా ముఖ్యం.మీ స్నేహితుడు తాను చేస్తున్నది తప్పు అని తెలిసీ మరలా అదే పునరావృతం చేస్తుంటే ఇక వారి స్నేహానికి వీడ్కోలు పలకాల్సిన సమయమొచ్చిందని గుర్తు.అలాంటి వాళ్ళు ఎన్నటికీ మారరు

వారు ఎన్నడూ పశ్చాతాపపడరు
తప్పు జరిగాకా మీకు సారీ చెప్పచ్చు కానీ కొన్ని రోజులకి వారి నిజ స్వరూపం బయటకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం, సారీ చెప్పడం మళ్ళీ జరుగుతాయి.ఇలాంటి వాళ్ళ నుండి ఎంత త్వరగా దూరం జరిగితే అంత మంచిది.వారు స్నేహానికి అర్హులు కారు. ఈ ఆర్టికల్ మీద మీ సలహాలూ సూచనలూ ఉంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా తెలియచెయ్యండి.



Click it and Unblock the Notifications