Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
‘‘సరిలేరు ఈ జోడికెవ్వరు‘‘... దక్షిణాదిన దశాబ్ద కాలానికి పైగా ఆదర్శ జంటగా నిలిచారు...!
నమ్రతా బాలీవుడ్ లోకి అడుగు పెట్టకముందే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. అందులో విజయం సాధించి మిస్ ఇండియాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు నమ్రత శిరోద్కర్ తో వివాహమై... పిల్లలు పుట్టినా కూడా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక్క టాలీవుడ్ లోనే దక్షిణ భారతదేశంలోనే వీరు ఉత్తమ జంట అని చెప్పొచ్చు. వీళ్లలాగానే తమ దాంపత్య జీవితం కూడా ఆరు కాలల పాటు అన్యోన్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మహేష్ లాంటి అందమైన భర్త రావాలని పెళ్లి కాని మహిళలందరూ కోరుకుంటూ ఉంటారు.
ఇందుకు మహేష్ బాబు అందం ఒక్కటే రీజన్ కాదు. ఆయన క్యారెక్టర్ కూడా. ఆయన తన భార్య, మాజీ మిస్ ఇండియా నమ్రతాకు ఇచ్చే విలువను చూసి అందరూ వారిని అంతగా అభిమానిస్తారు. జనవరి 22వ తేదీన నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా వీరి ప్రేమ కథ ఎలా మొదలైంది... పెళ్లి వరకు అంతా సవ్యంగా జరిగిందా? లేదా సినిమాల్లో లాగా ఏవైనా అడ్డంకులు ఎదురయ్యాయా అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

రాజ కుమారుడిగా...
సూపర్ స్టార్ క్రిష్ణ తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు మన ‘రాజ కుమారుడు‘. అదే సమయంలో బాలీవుడ్ లో నమ్రతా శిరోద్కర్ కూడా తన కెరీరన్ ప్రారంభించింది.

మహేష్ కంటే పెద్దది...
వయసులో ప్రిన్స్ మహేష్ బాబు కంటే నమ్రతా శిరోద్కర్ నాలుగేళ్లు పెద్దది. ఈ జంట కుటుంబ సంప్రదాయాలపైనా చాలా గౌరవం కలవారు.

మిస్ ఇండియా...
నమ్రతా బాలీవుడ్ లోకి అడుగు పెట్టకముందే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. అందులో విజయం సాధించి మిస్ ఇండియాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అంతేకాదు మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటి టాప్-6లో చోటు దక్కించుకుంది. మిస్ ఆసియా పసిఫిక్ పోటీల్లోనూ రన్నరప్ గా నిలిచి తన సత్తా చాటింది.

1998లో బాలీవుడ్ లోకి...
ఆ తర్వాత 1998లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నమ్రత వెండి తెరపై రాణించకపోయినా... రీల్ లైఫ్ లోనూ.. రియల్ లైఫ్ లోనూ ఓ వెలుగు వెలిగింది. మంచి పాపులారిటీని మాత్రం సాధించింది.

వీరిద్దరూ కలిశారిలా..
నమ్రతా శిరోద్కర్ మరియు మహేష్ బాబు మొదటిసారి ‘వంశీ‘ చిత్రం ద్వారా కలిశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్‘ అన్న మాటను వీరిద్దరూ నిజం చేశారు. అలా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.

ప్రేమలో పడ్డారిలా..
ఇద్దరు చాలా సింపుల్ గా ఉండే వీరి వ్యక్తిత్వమే వీరిని ప్రేమలో పడేసింది. ఆ సినిమా తర్వాత వీరి ప్రేమ సాఫీగా సాగింది. అయితే అదే సమయంలో వాారి ప్రేమ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచారు. ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు.

పెద్దల అనుమతి..
కుటుంబానికి ఎంతగానో విలువ ఇచ్చే మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు వివరించారు. వారి అనుమతి తర్వాత బయటి ప్రపంచానికి వారి ప్రేమ గురించి తెలియజేశారు.

2005లో వివాహం..
అలా 2005లో తెలుగు వారి సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఈ పెళ్లికి వారి ఇద్దరి కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహం ముంబైలోని మారియట్ హోటల్లో 2005లో ఫిబ్రవరి 10వ తేదీన జరిగింది.

పెళ్లికి ముందు కూడా...
వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వారి పెళ్లి పనులన్నీ నమ్రత కుటుంబసభ్యులే దగ్గరుండి నిర్వహించారు. పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు సినిమా షూటింగులో పాల్గొన్నారు.

మహేష్ కు ఇష్టం లేదని..
తన పెళ్లి తర్వాత తాను నటించడం మహేష్ బాబుకు ఇష్టం లేదని, పెళ్లికి ముందే నమ్రతా తన షూటింగులన్నీ పూర్తి చేసుకుందట. అది ఎంతలా అంటే పెళ్లికి వారం రోజుల ముందు వరకూ ఆమె షూటింగులో పాల్గొంటూనే ఉండేదట.

2006లో గౌతమ్ పుట్టుక..
వీరి పెళ్లి అయిన తర్వాత సంవత్సరంలోనే గౌతమ్ పుట్టాడు. అయితే ప్రేమ పెళ్లి అంటే నిరంతరం అర్థం చేసుకుంటూ బంధాన్ని నిలబెట్టుకోవడమే అని ఈ జంట నిరూపించింది.

2008లో రూమర్స్..
అయితే ఈ జంట బంధంపై 2008లో తెగ రూమర్లు వచ్చాయి. వీరిద్దరూ విడిపోయారని... అందుకు తగ్గట్టే అప్పట్లో నమ్రత తన కుమారుడితో కలిసి ముంబైకి వెళ్లిపోవడంతో అందరూ అలాగే అనుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ వారిని కఠినమైన పరిస్థితుల్లోనూ కలిసేటట్టు చేశాయి.

గొడవలు నిజమేనన్న నమ్రత..
ఆ రూమర్స్ గురించి నమ్రత ఓ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు.‘‘పెళ్లి తర్వాత మూడో ఏడాదిలో మా ఇద్దరికీ పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. అప్పటికీ మాహేష్ బాబుకు సినిమాలు లేవు. మా అమ్మ, నాన్న చనిపోయారు. తన బామ్మ కూడా మరణించారు. మహేష్ కూడా ఎలాంటి సినిమా ఒప్పుకోవాలో.. తనకు అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాడు. అప్పుడు మా ఇద్దరికీ కొంత గొడవలు జరిగాయి. అయితే ఇవన్నీ మమల్ని మరింత కలిపేందుకు పని చేశాయి.

బంధం మరింత బలంగా..
దీని వల్లే మా ఇద్దరి మరింత బలంగా తయారైంది. ఇప్పటికీ మా ఇద్దరి బంధానికి సంబంధించిన పునాదులు చాలా బలంగా ఉన్నాయంటే అందుకు గొడవలు కూడా ఒక కారణమే‘‘ అని నమ్రత చెప్పారు.

2012లో సితార..
వీరిద్దరూ గొడవల తిరిగి కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత కొన్నేళ్లకు అంటే 2012లో సితారకు జన్మనిచ్చింది నమ్రత. మహేష్ తన పిల్లలు, భార్యతో ప్రేమతో ఉండటమే కాదు. కాస్త టైమ్ దొరికితే చాలు. టూర్లకు వెళ్లడానికి తెగ ఆసక్తి చూపుతారట.
2005లో తెలుగు వారి సాంప్రదాయం ప్రకారం మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వివాహం చాలా సింపుల్ గా జరిగిపోయింది. ఈ పెళ్లికి వారి ఇద్దరి కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహం ముంబైలోని మారియట్ హోటల్లో 2005లో ఫిబ్రవరి 10వ తేదీన జరిగింది.



Click it and Unblock the Notifications
