విడిపోయే పరిస్థితి ఉన్నా కలిసుండక తప్పట్లేదా.. ఈ 3 విషయాలపై ఫోకస్‌ పెడితే చాలు.!

వివాహ జీవితం మొదలయ్యాక సాధారణంగా దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. కొన్ని జంటల్లో ఈ సమస్యలు సులువుగా పరిష్కారమైనా.. మరికొన్ని జంటల్లో పొరపొచ్చాలు ముదిరి విడాకుల వరకు దారితీస్తాయి. ఈ క్రమంలో కొందరు విడిపోతే మరికొందరు కలిసుండాల్సిన పరిస్థిత నెలకొంటుంది. ఇందుకు కారణాలేంటి.. ఇలాంటి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలి.. సైకాలజిస్టుల సలహాలు తప్పక తెలుసుకోవాలి.

couple should live together despite facing a separation keep these three things in mind

మన దేశ సంప్రదాయంలో వివాహ జీవితం ఎంతో పవిత్రమైనది. ఎన్నో ఆచార వ్యవహారాలతో కూడుకున్నది. భార్యాభర్తలు ఒకరికి ఒకరై కుటుంబ వ్యవహారాలను, బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే కాకుండా వారి మధ్య ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. దంపతుల మధ్య బలమైన భావోద్వేగ బంధంతోనే కుటుంబంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఆ బంధం లోపిస్తే పొరపొచ్చాలు తప్పవు. ఈ కారణంగా విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు విడిపోయి ఎవరి దారులు వారు చూసుకుంటారు.

విడిపోయి.. కలిసుండాలంటే..

కానీ కొన్ని జంటలు మాత్రం వారి మధ్య మనస్పర్థలు, గొడవలు ముదిరి విడిపోయేందుకు దారితీసినా కలిసుండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇందుకు కుటుంబ విషయాలే ప్రధాన కారణం. పిల్లల కోసం విడాకులు తీసుకోవాలనుకునే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. ఇంకా సమాజంలో చిన్న చూపు ఎదురుకావద్దనే ఉద్దేశంతో తమ గొడవలను బయటకు రానివ్వరు. మరికొందరు తల్లిదండ్రుల పరువు, సంతోషం కోసం కలిసుండాలని భావిస్తారు.

couple should live together despite facing a separation keep these three things in mind

అయితే కలిసున్నంత మాత్రాన వారి మధ్య అన్యోన్యత ఉండే అవకాశం కొన్ని జంటల్లో ఉండదు. అదే టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌. వివాహ జీవితంలో ఏళ్లు గడుస్తున్న కొద్దీ అభిప్రాయ భేదాలు రావడం, ఒత్తిడి, మనస్పర్థలు, ప్రేమ తగ్గిపోవడం.. ఇంకా కారణాలు ఏవైనా వారి మధ్య శారీరక, మానసిక బంధం తగ్గిపోతుంది. ఇలా విడిపోయే పరిస్థితి ఉన్నా కలిసుండాల్సిన పరిస్థితి వస్తే మూడు విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకొని వాటిని పాటించాలని ప్రముఖ సైకాలజిస్టు డా. విజయ పెద్దిన సూచిస్తున్నారు. అవేంటే చూద్దాం..

భావోద్వేగం వద్దు

మీ పార్ట్‌నర్‌తో విభేదాలు ఉండి.. వారితో శారీరకంగా, మానసికంగా కలిసుండలేం అని భావించినప్పుడు మీరు ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండటం చాలా ముఖ్యం. చట్టబద్ధంగా విడాకులు తీసుకోకపోయినా మానసికంగా విడాకులు తీసుకోవాలి. భాగస్వామితో ఎలాంటి ఎమోషనల్‌ కనెక్షన్‌ పెట్టుకోవద్దు. కేవలం మీ, మీ పిల్లల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని వాటిపైనే ఫోకస్‌ పెట్టుకోవాలి. భావోద్వేగానికి గురైతే ఒక్కోసారి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంచనాలు వద్దు

మీరు కేవలం మీ భాగస్వామితో పిల్లల కోసం, సమాజం కోసమే కలిసుంటున్నారు కాబట్టి వారిపైన అంచనాలు పెట్టుకోవద్దు. ఇది మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురిచేస్తుంది. మీ మధ్య భార్యాభర్తల బంధం లేదని.. కేవలం కుటుంబం కోసమే కలిసుంటున్నారనే విషయాన్ని గమనిస్తే మీరు ఎలాంటి అంచనాలు లేకుండా మనశ్శాంతిగా ఉండగలరు.

వ్యక్తిగత జీవితం..

వివాహ బంధమే జీవితమని అనుకోవద్దు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మీ దాంపత్య బంధం విఫలమైనంత మాత్రాన మీరు జీవితం అయిపోయిందని అనుకోవద్దు. అంతకంటే విలువైనవి చాలా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తికీ జీవితంలో ప్యాషన్‌, ఇష్టాలు, లక్ష్యాలు ఉంటాయి. ఈ సమయాన్ని భావోద్వేగాలకు తావివ్వకుండా మీకు నచ్చిన పని మీద దృష్టి సారిస్తూ మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీ కోసం మీరు సమయం కేటాయించుకోవడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు.

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎన్ని గొడవలు తలెత్తినా దాంపత్య బంధం గొప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో మీరు లేదా మీ భాగస్వామి చేసిన తప్పులను తెలుసుకుని ఒకరికొకరు దగ్గరవ్వాలని భావిస్తే ఖచ్చితంగా ఒక్కటవ్వండి. విడాకుల వరకూ వెళ్లిన జంటలు తమ తప్పులు తెలుసుకుని మళ్లీ ఒక్కటైన సందర్భాలు రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఎన్నో ఉన్నాయి.

Story first published: Monday, July 6, 2026, 20:46 [IST]
Desktop Bottom Promotion