Latest Updates
-
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు!
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి!
నూరు కాలాల పాటు కలిసుండాలి అని పెద్దలు ఆశీర్వదించి చేసే పెళ్లిళ్లు అన్నీ జీవితాంతం ఒకేలా నిలబడతాయా? వివాహ బంధం అనేది మానవ జీవితంలో అత్యంత మధురమైనది, బలమైనది. కానీ కాలం గడిచేకొద్దీ మనుషులు మారుతారు.. వారి ఆలోచనలు, అవసరాలు, భావోద్వేగాలు కూడా మారతాయి. ఈ మార్పులు ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తే బంధం మరింత బలపడుతుంది, లేదంటే ఊహించని దూరాన్ని పెంచుతుంది.

ప్రస్తుత రోజుల్లో విడాకుల రేటు ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో అసలు పెళ్లయిన తర్వాత ఏయే సంవత్సరాల్లో విడాకుల ముప్పు ఎక్కువగా ఉంటుంది? భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏ దశలో తారాస్థాయికి చేరుకుంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూడండి.
ఆరంభంలో ఆటుపోట్లు..ఆపై సెవెన్ ఇయర్ ఇచ్
రిలేషన్ షిప్స్ గురించి విశ్లేషించే ప్రముఖ వెబ్ సైట్ మ్యారేజ్ డాట్ కామ్, అనేక సర్వేల ప్రకారం.. వివాహం జరిగిన మొదటి రెండు సంవత్సరాలు చాలా కీలకం. ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు ఉన్న వ్యక్తులు ఒకే గొడుగు కిందకు రావడం, ఒకరికొకరు సర్దుకుపోవడం ఈ దశలో కాస్త సవాలుతో కూడుకున్నది.
ఆ తర్వాత పెళ్లయిన 5 నుంచి 8 సంవత్సరాల మధ్య విడాకుల ప్రమాదం అత్యధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా 7వ, 8వ సంవత్సరాలను బంధానికి అత్యంత ప్రమాదకరమైనవిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాశ్చాత్య దేశాల్లో నిపుణులు దీనిని సెవెన్ ఇయర్ ఇచ్ (ఏడేళ్ల విసుగు) అని పిలుస్తారు. అంటే పెళ్లై ఏడేళ్లు గడిచేసరికి చాలామంది జంటలు తమ వైవాహిక జీవితం పట్ల ఒకరకమైన విసుగును, ఆసక్తి లేమిని అనుభవిస్తారని ఈ పాత సిద్ధాంతం చెబుతోంది. ఇది నూటికి నూరుపాళ్లు శాస్త్రీయంగా నిరూపించబడనప్పటికీ, గణాంకాలు మాత్రం సరిగ్గా ఈ ఏడవ, ఎనిమిదవ ఏటనే విడాకుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

తుఫాను తర్వాత ప్రశాంతత ఎప్పుడంటే..
వివాహ జీవితంలో ఈ ఎనిమిదేళ్ల కష్టకాలాన్ని దాటిన జంటలు చాలా వరకు సురక్షిత తీరానికి చేరుకున్నట్లే. అధ్యయనాల ప్రకారం పెళ్లయిన తొమ్మిదో సంవత్సరం నుంచి పదిహేనవ సంవత్సరం మధ్య విడాకుల రేటు గణనీయంగా తగ్గుతుంది. ఈ దశలో భార్యాభర్తల మధ్య అద్భుతమైన అవగాహన, స్థిరత్వం ఏర్పడతాయి. పిల్లల బాధ్యతలు, కెరీర్ ఎదుగుదల, ఆర్థిక ప్రణాళికలు వంటి అంశాలపై వారికి ఒక స్పష్టత వస్తుంది. బంధం ఒక గాడిలో పడి మరింత పరిపక్వత సాధించే సమయం ఇదే.
మనసులు ఎందుకు విడిపోతాయి? అసలు కారణాలివే..
ఒక అందమైన బంధం విడాకుల వరకు వెళ్లడానికి ఏ ఒక్క కారణమో ఉండదు.
ఆర్థిక ఒత్తిళ్లు: ప్రస్తుత రోజుల్లో విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందులే. అప్పులు, ఉద్యోగం కోల్పోవడం వంటివి దంపతుల మధ్య తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి.
వేర్వేరు లక్ష్యాలు: పెళ్లయిన కొన్ని నాళ్లకు ఇద్దరి భవిష్యత్తు లక్ష్యాలు, కెరీర్ ప్రాధాన్యతలు మారిపోవడం వల్ల వారి మధ్య గ్యాప్ వస్తుంది.
నమ్మకం లేకపోవడం: బంధంలో మూలస్తంభమైన నమ్మకం సన్నగిల్లడం, వివాహేతర సంబంధాలు (అవిశ్వాసం) విడాకులకు దారితీస్తున్నాయి.
ఇతర కారణాలు
అత్తమామలతో సఖ్యత లేకపోవడం, గృహహింస, ఒకరికొకరు భావోద్వేగపరమైన మద్దతు ఇచ్చుకోలేకపోవడం బంధానికి ఉరితాడుగా మారుతున్నాయి. అంతేకాకుండా యుక్తవయసులోనే (చిన్న వయసులో) పెళ్లి చేసుకోవడం, మానసిక పరిపక్వత రాకముందే తల్లిదండ్రులు కావడం కూడా బంధాన్ని నిలబెట్టుకోవడంలో సవాళ్లను విసురుతున్నాయి.



Click it and Unblock the Notifications
